The Full Telugu Review Of Jilla Movie | Ilayathalapathy Vijay | Kajal Agarwal

Teluguwishesh జిల్లా జిల్లా Jilla Telugu Movie Review Ilayathalapathy Vijay Kajal Agarwal : The Full Telugu Review Of Jilla Movie In Which Ilayathalapathy Vijay, Mohanlal and Kajal Agarwal Played In Lead Role. Product #: 66459 2.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  జిల్లా

 • బ్యానర్  :

  సూపర్ గుడ్ ఫిలింస్, శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్

 • దర్శకుడు  :

  ఆర్.టి.నేసన్

 • నిర్మాత  :

  తమటం కుమార్ రెడ్డి, ప్రసాద్ సన్నితి

 • సంగీతం  :

  డి. ఇమాన్

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  గణేష్ రాజవేలు

 • ఎడిటర్  :

  డాన్ మ్యాక్స్

 • నటినటులు  :

  విజయ్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ తదితరులు

Jilla Telugu Movie Review Ilayathalapathy Vijay Kajal Agarwal

విడుదల తేది :

2015-07-24

Cinema Story

శివుడు(మోహన్ లాల్) ఫ్యామిలీని రక్షిస్తున్న సమయంలో ఓ పోలీస్ ఆఫీసర్ చేతిలో శక్తి(విజయ్) తండ్రి చనిపోతాడు. ఇక అప్పటి నుంచి శక్తికి పోలీసులంటే చాలా కోపం. ఆనాధల వున్న శక్తిని శివుడే తన సొంత కొడుకులా తన ఇంట్లోనే పెంచుకుంటాడు. శివుడిని ఎవరైనా, ఏమైనా అంటే శక్తి అస్సలు సహించడు. సీన్ కట్ చేస్తే... శక్తి పెరిగి పెద్దవాడవుతాడు. శివుడు ఆ పట్టణంలోనే చాలా పవర్ ఫుల్ మరియు మంచి వ్యక్తిగా ఎదుగుతాడు. ఓరోజు శాంతి(కాజల్ అగర్వాల్)ను చూసి శక్తి ప్రేమలో పడతాడు. ఇదిలా వుండగా శివుడిని ఓరోజు ఓ పోలీస్ ఆఫీసర్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు కానీ క్షణాల్లోనే శక్తి మళ్లీ ఇంటికి తీసుకొచ్చేస్తాడు.

ఎవరో బయటివాడు పోలీస్ అవడం వల్ల తమను అరెస్టు చేసే అవకాశం వుందని, అందుకే తమలోనే ఎవరో ఒకరు పోలీస్ అయితే ఎలాంటి సమస్య వుండదని శక్తిని పోలీస్ ఆఫీసర్ ను చేయాలని శివుడు నిర్ణయించుకుంటాడు. చివరకు శక్తి కూడా పోలీస్ ఆఫీసర్ అవుతాడు. కానీ ఈ పోలీస్ ఉద్యోగాన్ని ఆడుతూపాడుతూ ఏదో సరదాగా చేసే శక్తికి ఓ సంఘటన చాలా మార్పును తీసుకొస్తుంది. ఇంతకీ ఆ సంఘటన ఏంటి? ఆ సంఘటన వల్ల శక్తి ఏం చేసాడు? శక్తిలో వచ్చిన మార్పు వల్ల ఏం జరిగింది? ఆ సంఘటనకు కారణమైన వారిని శక్తి ఎలా ఢీకొన్నాడు? అనే పలు ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవాలంటే వెండితెర మీద ‘జిల్లా’ చిత్రం చూడాల్సిందే.

cinima-reviews
జిల్లా

తమిళంలో ఘనవిజయం సాధించిన ‘జిల్లా’ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో ఈనెల 24న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. తమిళ స్టార్ హీరో ఇలయథలపతి విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా, ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి.చౌదరి సమర్పణలో శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాతలు తమటం కుమార్ రెడ్డి, ప్రసాద్ సన్నితి ప్రతిష్టాత్మకంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే తెలుగులో విడుదల చేసారు. తెలుగులో విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. మరి ఈ చిత్రం తెలుగులో ఎలాంటి విజయం సాధించనుందో ఒకసారి చూద్దామా!

Cinema Review

ప్లస్ పాయింట్స్:

‘జిల్లా’ సినిమాకు ఇద్దరు మేజర్ ప్లస్ పాయింట్స్ మోహన్ లాల్, విజయ్. ఇద్దరూ కూడా పవర్ ఫుల్ పాత్రలలో నటించారు. మొదటగా హీరోగా నటించిన విజయ్ ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలిచాడు. విజయ్ యాక్టింగ్ సూపర్బ్. యాక్షన్ సీన్లలో చింపేసాడు. లవ్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలలో విజయ్ అద్భుతంగా నటించాడు. ఆవారా పాత్ర నుంచి పోలీస్ ఆఫీసర్ పాత్రకు విజయ్ చక్కనైనా వేరియేషన్ చూపించాడు. ఇక మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ తన పాత్రకు అద్భుతంగా న్యాయం చేసాడు. ఈ పాత్రకు మోహన్ లాల్ తప్ప మరెవరూ న్యాయం చేయలేరు అని అనిపించే విధంగా నటించాడు. ముఖ్యంగా విజయ్, మోహన్ లాల్ ల మధ్య వచ్చే పలు సన్నివేశాలు చాలా బాగున్నాయి.

ఇక హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ యాక్టింగ్ బాగుంది. తన గ్లామర్ తో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్, కాజల్ ల మధ్య వచ్చే లవ్, కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్:

ఫస్ట్ హాఫ్ కామెడీ ఎంటర్ టైనర్ గా సాగినప్పటికీ, సెకండ్ హాఫ్ మాత్రం ఎంటర్ టైన్మెంట్ మిస్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల ప్రేక్షకులకు బోర్ ను కలిగిస్తుంది. కానీ ఈ సినిమా చూస్తే తెలుగులో ఇప్పటివరకే ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చాయనే ఆలోచన కలుగుతుంది.

సాంకేతికవర్గ పనితీరు:

సింపుల్ స్టోరీ లైన్ ను స్ర్కీన్ ప్లే పరంగా అద్భుతంగా చూపించారు. దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసాడు. ముఖ్యంగా మోహన్ లాల్, విజయ్ ల మధ్య వచ్చే పలు సన్నివేశాలను చాలా పవర్ ఫుల్ చూపించాడు. గణేష్ రాజవేలు అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. సాంగ్స్ లలో అందమైన లోకేషన్లను మరింత అందంగా చూపించారు. అలాగే విజయ్, మోహన్ లాల్ ల హీరోయిజంను చాలా స్టైలిష్ గా చూపించారు. డి. ఇమాన్ అందించిన సంగీతం సూపర్బ్. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
జిల్లా: యాక్షన్ ఎంటర్ టైనర్