The Telugu Review Of Tiger Movie | Sundeep Kishan | Rahul Ravindran | Seerath Kapoor | Telugu Reviews

Teluguwishesh టైగర్ టైగర్ Tiger Telugu Movie Review Sundeep Kishan Rahul Ravindran Seerath Kapoor : The Full Telugu Review Of Tiger Movie In Which Sundeep Kishan Is Playing In Leading Role And Rahul Ravindran, Seerath Kapoor Co-Actors. Product #: 65585 3 stars, based on 1 reviews
 • చిత్రం  :

  టైగర్

 • బ్యానర్  :

  ఎన్.వి.ఆర్. సినిమా

 • దర్శకుడు  :

  వి.ఐ. ఆనంద్

 • నిర్మాత  :

  ఎన్వీ ప్రసాద్

 • సంగీతం  :

  థమన్

 • సినిమా రేటింగ్  :

  333  3

 • ఛాయాగ్రహణం  :

  ఛోటా కె.నాయుడు

 • ఎడిటర్  :

  ఛోటా కె.ప్రసాద్

 • నటినటులు  :

  సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ తదితరులు

Tiger Telugu Movie Review Sundeep Kishan Rahul Ravindran Seerath Kapoor

విడుదల తేది :

2015-06-26

Cinema Story

టైగర్(సందీప్ కిషన్), విష్ణు(రాహుల్ రవీంద్రన్) ఇద్దరూ రాజమండ్రిలోని ఓ అనాధ ఆశ్రమంలో పెరుగుతారు. చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ గా వుండే వీరిద్దరూ ప్రాణమిత్రులుగా మారుతారు. టైగర్ కి విష్ణు అంటే ప్రాణం. అతనికి ఏ కష్టం రాకుండా చూసుకుంటుంటాడు. అతనికోసం ఎంత రిస్క్ తీసుకోవడానికి టైగర్ సిద్ధపడతాడు. కొంతకాలం తర్వాత విష్ణును ఓ జంట దత్తత తీసుకుంటారు. దీంతో విష్ణు, టైగర్ మధ్య దూరం పెరుగుతుంది. అయినప్పటికీ  వారి స్నేహం అలాగే కొనసాగుతుంది.

కట్ చేస్తే.. విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగే ఈవెంట్ లో పాల్గొనేందుకు గంగ (సీరత్ కపూర్) కాశీ నుంచి వస్తుంది. అక్కడ గంగతో విష్ణుకి పరిచయం ఏర్పడుతుంది. అది కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారుతుంది. విష్ణు ప్రేమలో పడ్డాడన్న విషయం తెలుసుకున్న టైగర్.. గంగ విషయంలో అతనితో గొడవ పడతాడు. ఆ గొడవ వల్ల విష్ణు, టైగర్ ఇద్దరూ విడిపోతారు. కట్ చేస్తే.. కొన్ని సంఘటనల తర్వాత కాశీలో విష్ణు చావు బతుకుల మధ్య వుంటాడు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.

విష్ణు కాశీకి ఎందుకు వెళ్లాడు? విష్ణు చావు బతుకుల మధ్య ఎందుకున్నాడు? ఇంతకీ గంగ ఎవరు? విష్ణు చావుబతుకుల మధ్య వున్నాడని టైగర్ కు ఎలా తెలిసింది? విష్ణుని టైగర్ కాపాడుకున్నాడా లేదా? చివరికి ఏమవుతుంది? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే వెండితెర మీద ‘టైగర్’ సినిమా చూడాల్సిందే.

cinima-reviews
టైగర్

వారణాసి నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో సందీప్ కిషన్ హీరోగా రూపొందిన చిత్రం తాజా చిత్రం ‘టైగర్’., రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రాన్ని ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై ఎన్వీ ప్రసాద్ నిర్మించారు. గతకొన్నాళ్ల నుంచి వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీని ఈనెల 26న విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో తెలుసుకుందాం..

Cinema Review

ప్లస్ పాయింట్స్:

సినిమా విషయానికొస్తే... సింపుల్ కథ అయినప్పటికీ, కథ-కథనం చాలా బాగుంది. ‘టైగర్’ సినిమా స్టోరీ లైన్ బాగుంది. స్నేహం, ప్రేమ, సామాజిక అంశం అనే మూడు విషయాలను ఒకే స్టోరీ ద్వారా అద్భుతంగా చూపించారు. ఈ సినిమాకు స్ర్కీన్ ప్లే అద్భుతం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ‘టైగర్’ సినిమా చాబా బాగుందని చెప్పుకోవచ్చు.

నటీనటుల విషయానికొస్తే... ‘టైగర్’ పాత్రలో సందీప్ కిషన్ అదరగొట్టేసాడని చెప్పుకోవాలి. మాస్ హీరోగా, ఫ్రెండ్ కోసం ఏమైనా చేసే వ్యక్తిగా సందీప్ నటించిన తీరు బాగుంది. ఇప్పటి వరకు సందీప్ చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో నటుడిగా సందీప్ కొంచెం ఎదిగాడని చెప్పుకోవచ్చు. ఇక రాహుల్ రవీంద్రన్ అటు సీరియస్, ఇటు రొమాంటిక్ సన్నీవేశాలలో బాగా నటించాడు. ముఖ్యంగా అతని డైలాగ్ డెలివరీ బాగుంది. ఇక హీరోయిన్ గా సీరత్ కపూర్ పర్వాలేదనిపించింది. మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేరకు బాగా నటించారు.

‘టైగర్’ సినిమా ఓవరాల్ చూస్కుంటే... చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సరద సరదాగా సాగిపోతూ, అక్కడక్కడ సస్పెన్స్ తో నడుస్తోంది. ఇక సెకండ్ హఫ్ లో బావోద్వేగమైన సన్నీవేశాలతో ప్రేక్షకులను కట్టిపాడేశారు. అసలు కథాంశం సెకండ్ హాఫ్ లోనే చూపించి అద్భుతంగా తెరకెక్కించారు.

మైనస్ పాయింట్స్:

ఇందులో పెద్దగా మైనస్ పాయింట్స్ అంతగా ఏమి లేవనే చెప్పుకోవచ్చు. రెగ్యులర్ ఫార్ములా కథ వలె అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదసరదాగా సాగిపోతుంది కానీ సెకండ్ హాఫ్ లో ఆ ఎంటర్ టైన్మెంట్ తగ్గుతుంది. ఇక హీరోయిన్ సీరత్ కపూర్ పాత్రకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేరని అనిపిస్తోంది. ఎంటర్ టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు కాస్త నిరాశకు గురవుతారు.

సాంకేతికవర్గ పనితీరు:

‘టైగర్’ సినిమా కథ, స్ర్కీన్ ప్లేను దర్శకుడు విఐ ఆనంద్ అద్భుతంగా తీర్చిదిద్ది మంచి మార్కులే కొట్టేసాడు. సరైన సస్పెన్స్ ఎలిమెంట్స్ ను జోడించి ‘టైగర్’ను చాలా చక్కగా చూపించాడు. ఇక ఛోటా కె.నాయుడు అందించిన సినిమాటోగ్రఫి చాలా హెల్ప్ అయ్యింది. ప్రతి సన్నీవేశాన్ని అద్భుతంగా చూపించారు. ఇక థమన్ సంగీతం అందించిన పాటల పర్వాలేదు కానీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. డైలాగ్స్ సూపర్బ్. ఎడిటింగ్ చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా గ్రాండ్ గా వున్నాయి.

చివరగా:
టైగర్ : ఈసారి సందీప్ ‘టైగర్’ బాగానే గర్జించింది.