Full telugu review of charmme starrer jyothi lakshmi movie | director puri jagannadh | Charmi Kaur

Teluguwishesh జ్యోతిలక్ష్మీ జ్యోతిలక్ష్మీ jyothi lakshmi movie review charmme kaur puri jagannadh : The Full Telugu Review Of Jyothi Lakshmi Movie in which charmme kaur starrer in leading role and directed by puri jagannadh. Product #: 65125 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    జ్యోతిలక్ష్మీ

  • బ్యానర్  :

    సి.కె.ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి., శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్

  • దర్శకుడు  :

    పూరీ జగన్నాథ్

  • నిర్మాత  :

    శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు

  • సంగీతం  :

    సునీల్ కశ్యప్

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    పి.జి.విందా

  • నటినటులు  :

    ఛార్మి, సత్య తదితరులు

Jyothi Lakshmi Movie Review Charmme Kaur Puri Jagannadh

విడుదల తేది :

2015-06-12

Cinema Story

సత్య (సత్య దేవ) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్... ఓ వేశ్యను ప్రేమించి, పెళ్ళి చేసుకోవాలనే ఆలోచనలో వుంటాడు. ఈ క్రమంలోనే అతనికి జ్యోతిలక్ష్మీ (ఛార్మీ) కనిపిస్తుంది. ఆమెను చూసిన అతగాడు మొదటిచూపులోనే ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. దీంతో ఆమె ఎక్కడుంటుంది.. ఏం చేస్తుంది.. అనే వివరాలు తెలుసుకుని చివరికి కలుస్తాడు. తన ప్రేమను తెలియజేసి.. చివరికి జ్యోతిలక్ష్మీని పెళ్ళికి ఒప్పిస్తాడు. జ్యోతిలక్ష్మీని పెళ్ళి చేసుకొని సత్య తనతోపాటు తీసుకెళతాడు.

అయితే.. ఇంతలోనే సత్య – జ్యోతిలక్ష్మీల జీవితంలో అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితులే వారిద్దరికీ ఎన్నో సమస్యలను తెచ్చిపెడతాయి. ఈ సమస్యలతోపాటు సమాజంలో కొన్నేళ్ళుగా వేళ్ళూనుకుపోయి ఉన్న సామాజిక సమస్యపై జ్యోతిలక్ష్మీ అన్నీ తానై పోరాటం చేయాల్సి వస్తుంది. అసలు జ్యోతిలక్ష్మీకి ఎదురైన ఆ ఇబ్బందికర పరిస్థితులేంటి? ఆ సామాజికి సమస్య ఏమిటి? ఈ సమస్యలపై జ్యోతిలక్ష్మీ చేసిన పోరాటం ఫలించిందా? అన్నది సినిమా కథ.

cinima-reviews
జ్యోతిలక్ష్మీ

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. ఛార్మీకౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి., శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్ బ్యానర్స్ పై శ్వేతలానా, వరుణ్, తేజ్, సి.వి.రావు సంయుక్తంగా నిర్మించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో ఛార్మి హాట్ పాత్రలో తన అందాలను ఆరబోయడమే కాకుండా ఓ పవర్ ఫుల్ లేడిగా నటించింది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూన్ 12న గ్రాండ్ గా విడుదల చేశారు. మరి.. ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుందో చూద్దామా..

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ‘బలమైన కథాంశం’ గురించే చెప్పుకోవాలి. ఆడవాళ్ళంటే అమితమైన గౌరవముండే ఓ వ్యక్తి వేశ్యను పెళ్ళి చేసుకోవాలనుకోవడం, సత్య ప్రేమను జ్యోతిలక్ష్మీ అర్థం చేసుకోవడం, చివరికి ఓ సమస్యపై పోరాడడం.. ఇలా ఓ బలమైన కథకు కావాల్సిన అంశాలు ఈ కథలో చాలా ఉన్నాయి.

ఇక హీరో హీరోయిన్ల విషయానికొస్తే.. జ్యోతిలక్ష్మీగా ఛార్మీ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయి నటించింది. సత్య దేవ తన పాత్రను అద్భుతంగా పోషించాడు. నిలకడైన ఎక్స్‌ప్రెషన్‌తో తన క్యారెక్టర్‌ను చాలా బాగా క్యారీ చేశాడు. మిగతావారంతా తమ పరిధిమేరకు బాగానే నటించారు.

సినిమా పరంగా చూసుకుంటే.. ఫస్టాఫ్‌ హీరో హీరోయిన్లు కలుసుకోవడం, పూరీ స్టైల్లో ఫన్నీగా సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే మేజర్ హైలైట్. సెకండాఫ్‌లో జ్యోతిలక్ష్మీ పాత్ర తనను తాను అర్థం చేసుకోవడం అనే యాంగిల్‌లో సాగిపోతూ ఎమోషనల్‌గా ఓ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ ‘పూరీ స్పీడే’ అని చెప్పాలి. ఒక ఎమోషన్ నుంచి ఇంకో ఎమోషన్‌కు మారిపోయే సన్నివేశాలు స్పీడ్ గా మారిపోతుంటాయి. సినిమాకు ప్రాణమైన జ్యోతిలక్ష్మీ క్యారెక్టరైజేషన్‌ లో ఛార్మీతో అనవసరంగా డైలాగులను జొప్పించడం మరో మైనస్. జ్యోతిలక్ష్మీ క్యారెక్టరైజేషన్ నాంాతద ఉన్నా, ఆమె పరిస్థితులను అర్థం చేసుకుంటూ మారిపోవడం చిన్న చిన్న సన్నివేశాలతో తేల్చేయడం బాలేదు.

ఇక పాటలు అసందర్భంగా వస్తూ సినిమా మూడ్‌ను చెడగొట్టాయి. చివర్లో వచ్చే ఐటెమ్ సాంగ్ లాంటిది ఒక్కసారిగా జ్యోతిలక్ష్మీ పోరాటాన్ని దారి తప్పించింది. క్లైమాక్స్ మరీ సినిమాటిగ్గా ఉంది. పోరాటమంటే దానికో పరిష్కారం ఉండి తీరాలన్న ఆలోచనలో క్లైమాక్స్‌ను తేల్చేసినట్టు స్పష్టమవుతుంది. బ్రహ్మనందం కామెడీ ట్రాక్ కథలోనిదే అయినా అతికించినట్టు కనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు చాలా బోరింగ్ గా కొసాగుతాయి.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి చెప్పుకుంటే.. ఓ బలమైన కథాంశాన్ని తన ఫార్మాట్‌లో చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో చేశారు. కొన్ని సినిమాటిక్ సన్నివేశాలను పక్కనపెడితే.. అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో పూరీ జగన్నాథ్ చాలా వరకు విజయం సాధించారు. దర్శకుడిగా పూరీ తన పంథా ఏమీ మార్చకుండానే ఓ మెసేజ్ చెప్పే ప్రయత్నం చేశారు.

ఇక టెక్నికల్ విభాగానికొస్తే.. సునీల్ కశ్యప్ అందించిన సంగీతం బాగుంది. పాటలు వినడానికి బాగానే ఉన్నా సినిమాలో అసందర్భంగా వచ్చాయి. పీజీ విందా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఫస్టాఫ్‌లో ఫన్ మూడ్‌ను, సెకండాఫ్‌లో సీరియస్ మూడ్‌ను సినిమాటోగ్రాఫర్ పీజీ విందా సరిగ్గా క్యారీ చేశారు. ఎడిటర్ కాస్త శ్రద్ధ తీసుకుని వుండుంటే బాగుండేది. నిర్మాణ విలువలు భారీగానే వున్నాయి.

చివరగా :

జ్యోతిలక్ష్మీ : సమాజానికి ఓ బలమైన మెసేజ్ ఇచ్చిన లేడీ ఓరియెంటెడ్ సినిమా!