Ganga Telugu Movie Review | Raghava Lawrence | Taapsee Pannu

Teluguwishesh గంగ గంగ Get information about Ganga Telugu Movie Review, Ganga Movie Review, Taapsee Ganga Movie Review, Ganga Movie Review And Rating, Ganga Telugu Movie Talk, Ganga Telugu Movie Teaser, Ganga Telugu Movie Trailer, Ganga Telugu Movie Gallery and more Product #: 63538 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    గంగ

  • బ్యానర్  :

    శ్రీలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    రాఘవ లారెన్స్

  • నిర్మాత  :

    బెల్లంకొండ గణేష్ బాబు

  • సంగీతం  :

    థమన్

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    రాజవెల్ ఒలివిరన్

  • నటినటులు  :

    లారెన్స్, తాప్సీ, నిత్యామీనన్, కోవై సరళ తదితరులు

Ganga Movie Review
Cinema Story

గ్రీన్ టివి ఛానెల్లో కెమెరా మెన్ గా పనిచేస్తుంటాడు రాఘవ(రాఘవ లారెన్స్). ఒకప్పుడు టాప్ 1 స్థానంలో వున్న ఈ ఛానెల్ రెండవ స్థానానికి పడిపోతుంది. దీంతో ఎలాగైనా ఈ తమ ఛానెల్ ను మళ్లీ మొదటి స్థానానికి తీసుకురావాలని ఓనర్ సుహాసిని చానెల్ యూనిట్ తో కలిసి ఓ మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇదే ఛానెల్లో ప్రోగ్రాం డైరెక్టర్ గా పనిచేసే నందిని(తాప్సీ) ఓ సలహా ఇస్తుంది. అదేంటంటే... పక్క ఛానెల్ వారు దేవుడి కార్యక్రమం చేసి మొదటి స్థానం దక్కించుకున్నారు కాబట్టి.. మనం దయ్యం గురించి ఓ ప్రోగ్రాం చేద్దాం... ఆ భయాన్ని సృష్టించి మన టీవి టిఆర్పీ రేటింగ్ లను పెంచుకోవాలని చెబుతోంది.

తన ఆలోచన ప్రకారమే నందిని తన టీంతో కలిసి భీమిలిలోని ఒక బీచ్ దగ్గర వున్న పాడుబడ్డ ఇంట్లో షూటింగ్ చేయాలని వెళ్తారు. ఆ షూటింగ్ సమయంలో అనుకోకుండా నందినికి ఒక తాళి దొరుకుతుంది. ఇక అప్పటి నుంచి వారికి సమస్యలు మొదలవుతాయి. అసలు ఆ తాళి ఎవరిది? వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఆ ఇంటికి, తాళికి వున్న సంబంధం ఏంటి? ఇంతకీ గంగ ఎవరు? అనే ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెండితెరమీద ‘గంగ’ సినిమా చూడాల్సిందే.

cinima-reviews
గంగ

రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘గంగ’. గతంలో వచ్చిన ‘ముని’, ‘కాంచన’ చిత్రాలకు సీక్వెల్ ఇది. తాప్సీ, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. శ్రీలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్లో బెల్లంకొండ సురేష్ సమర్పణలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. తమిళంలో ‘కాంచన2’గా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తో దూసుకుపోతుంది. తెలుగులో ‘గంగ’ పేరుతో నేడు(మే1) ప్రేక్షకుల ముందుకొచ్చింది. అన్ని అడ్డంకులు దాటుకొని విడుదలైన ఈ ‘గంగ’ ఎలా వుందో ఒకసారి చూద్దామా!

Cinema Review

ప్లస్ పాయింట్స్:
రాఘవ లారెన్స్ ఇందులో రాఘవ, శివ అనే రెండు పాత్రలలో నటించాడు. పాత్ర మేరకు లారెన్స్ పర్వాలేదనిపించాడు. గతంలో వచ్చిన ‘ముని’, ‘కాంచన’ తరహాలోనే లారెన్స్ భయస్తుడిగా బాగా నటించాడు. ఇక తాప్సీ కేవలం అందాల ఆరబోతకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలో నటించి మెప్పించింది. అంగవైకల్యం గల అమ్మాయిగా నిత్యామీనన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక కోవైసరళ మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు.

ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్లు, థ్రిల్లింగ్ సీన్స్ అద్భుతంగా వున్నాయి. నిత్యామీనన్, తాప్సీల క్యారెక్టర్లు బాగున్నాయి. కొన్ని అక్కడక్కడ భయపెట్టే సన్నీవేశాలు పర్వాలేదనిపించాయి.

మైనస్ పాయింట్స్:
సినిమాకు లారెన్స్ ఓవరాక్షన్ బాగా మైనస్ అనిచెప్పుకోవచ్చు. గతంలో ‘ముని’, ‘కాంచన’ సినిమాల్లో తన నటనకు మంచి మార్కులు పడ్డాయని... ఈసారి మరింత డోస్ ఎక్కువగా పెంచేసి పలు పాత్రల్లో నటించేసాడు. చేసే ఒక్క పాత్రనైనా చాలా చక్కగా చేసుంటే బాగుండేది. ఇందులో ఇతని అతి ఎక్కువగానే కనిపిస్తూ వుంటుంది.

తాప్సీ ఇప్పటివరకు చేయని పాత్రలో నటించి... పూర్తి న్యాయం చేయడానికి ప్రయత్నించింది. ఇక కోవై సరళతో పాటు మిగతా నటీనటుల యాక్టింగ్ అబ్బో అనిపించేలా వుంటుంది. పావలా యాక్షన్ కు రూపాయి ఓవరాక్షన్ చేశారు. కథలో పెద్దగా కొత్తదనం ఏం కనిపించలేదు. కథనంలో కూడా కొత్తగా ఏం లేదు. దర్శకుడు లారెన్స్ మరింత జాగ్రత్తగా కథను రాసుకొని వుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ కాస్త పర్వాలేదనిపించినా... సెకండ్ హాఫ్ మాత్రం బాగా సాగదీసినట్లుగా అనిపిస్తూ వుంటుంది.

సాంకేతికవర్గ పనితీరు:
లారెన్స్ దర్శకుడిగా పర్వాలేదనిపించాడు. కథ, కథనంలో మాత్రం మరింత జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. ఇక ఎడిటింగ్ అస్సలు బాగోలేదు. సెకండ్ హాఫ్ నుంచి బాబోయ్ అనిపించేలా వుంది. విజువల్ ఎఫెక్ట్స్ పర్వాలేదు. సినిమాటోగ్రఫి బాగుంది. ఇక థమన్ సంగీతం పర్వాలేదు కానీ... రీరికార్డింగ్ మాత్రం మరి దారుణంగా, భీభత్సమైన సౌండ్ ఎఫెక్ట్ లతో చంపేసాడు. నిర్మాణ విలువలు పర్వాలేదు.

చివరగా:
గంగ: ఈ దెయ్యం అంతగా భయపెట్టించలేదు.