Dochey Movie Review | Naga Chaitanya New Movie | Kriti Sanon

Teluguwishesh దోచేయ్ దోచేయ్ dochey movie telugu review : The Review Of Naga Chaitanya Latest Flick Dochey Which Released On 24 April. In This Movie kriti Sanon Pair With Chaitu Product #: 63307 3 stars, based on 1 reviews
 • చిత్రం  :

  దోచేయ్

 • బ్యానర్  :

  వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

 • దర్శకుడు  :

  సుధీర్ వర్మ

 • నిర్మాత  :

  బివిఎస్ఎన్ ప్రసాద్

 • సంగీతం  :

  సన్నీ

 • సినిమా రేటింగ్  :

  333  3

 • ఛాయాగ్రహణం  :

  రిచర్డ్ ప్రసాద్

 • ఎడిటర్  :

  కార్తీక్ శ్రీనివాస్

 • నటినటులు  :

  నాగచైతన్య, కృతిసనన్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేష్

Dochey Movie Telugu Review

విడుదల తేది :

2015-04-24

Cinema Story

చందు(నాగ చైతన్య) తన ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ లైఫ్ ని గడుపుతుంటాడు. తానెలాగో దొంగగా మారాడు కాబట్టి.. తన చెల్లిల్ని డాక్టర్ చేద్దామన్న ఉద్దేశంతో చెల్లెల్ని డాక్టర్ చదివిస్తుంటాడు. అయితే.. చందు తండ్రి సీతారాం(రావు రమేష్) మాత్రం ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని జైలులో శిక్ష అనుభావిస్తుంటాడు. ఇలా అనేక సమస్యలతో సాగిపోతున్న చందు లైఫ్ లో ఓ రోజు మీరా(కృతి సనన్) ఎంటరవుతుంది. ఆమెను చూసి చందు ప్రేమలో పడతాడు. కొద్ది రోజులకి వీరిద్దరూ ప్రేమికులవుతారు. అంతా సవ్యంగా జరుగుతున్న నేపథ్యంలోనే చందుకి 2 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది.

కట్ చేస్తే.. పిక్ పాకెటర్ నుంచి బ్యాంకు దొంగతనాలు చేసే రేంజ్ కి ఎదిగిన మాణిక్యం(పోసాని కృష్ణ మురళి).. తన గ్యాంగ్ తో ప్లాన్ చేసి ఓ బ్యాంకులో 2.5 కోట్లు దొంగతనం చేస్తారు. అయితే ఆ గ్యాంగ్ లో ఇద్దరూ మాణిక్యంకి హ్యాండ్ ఇచ్చి ఆ డబ్బు తో పారిపోవాలని అనుకుంటారు. కానీ.. వారిద్దరి మధ్య గొడవ జరిగి.. ఒకరినొకరు కాల్చుకొని చనిపోతారు. అదే టైంలో అక్కడున్న చందు ఆ డబ్బును అనే దోచేస్తాడు. కొద్దిరోజులకి మాణిక్యంకి ఆ డబ్బులు చందునే కాజేసాడని తెలియడంతో.. అతనికి సంబంధించిన వాళ్ళని కిడ్నాప్ చేసి.. తన డబ్బు తనకి ఇమ్మంటాడు. వీరి గొడవ మధ్య పోలీస్ ఆఫీసర్ రిచర్డ్(రవిబాబు), టెంప్టింగ్ స్టార్ బుల్లెట్ బాబు(బ్రహ్మనందం) ఎంటరవుతారు. ఇక అక్కడి నుంచి అసలు సినిమా మొదలవుతుంది.

మాణిక్యం నుంచి తనవాళ్ళని రక్షించుకోవడానికి చందు ఏం చేసాడు.? చందు నుంచి మనీ రాబట్టుకోవడం కోసం మాణిక్యం అసలు ఎవర్ని కిడ్నాప్ చేసాడు.? మాణిక్యం నుంచి తప్పించు కోవడానికి చందు పోలీస్ ఆఫీసర్ రిచర్డ్(రవిబాబు), టెంప్టింగ్ స్టార్ బుల్లెట్ బాబు(బ్రహ్మనందం)ని ఎలా వాడు కున్నాడు.? ఫైనల్ గా మాణిక్యంకి చందు డబ్బు ఇచ్చాడా.? లేదా.? అసలు చందు ఫాదర్ సీతారాం జైల్లో ఉండడానికి కారణమైన మర్డర్ వెనుక కథ ఏంటి.? అన్నది తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే!

cinima-reviews
దోచేయ్

రొమాంటిక్ హీరోగా పేరొందిన నాగ చైతన్య తొలిసారిగా దర్శకుడు సుధీర్ వర్మతో కలిసి ఓ కొత్త ప్రయోగం చేశాడు. వీరిద్దరి కాంబోలో తాజాగా తెరకెక్కిన క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘దోచేయ్’. ఇందులో చైతూ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీతో చైతూ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడో తెలుసుకుందామా..

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

ఈ మూవీకి మేజర్ హైలైట్ చివరి 30 నిమిషాలు. సెకండాఫ్ లో టెంప్టింగ్ స్టార్ బుల్లెట్ బాబుగా బ్రహ్మానందం పరిచయం అయినప్పటి నుంచీ సినిమా వేగంగా నడుస్తుంది. అక్కడి నుంచి చివరి దాకా ఆడియన్స్ ని బాగా నవ్విస్తూ ఉంటుంది. ఇక చివర్లో రెండు సీన్స్ లో వచ్చే తాగుబోతు రమేష్, సప్తగిరిలు తమ కామెడీతో ఈ మూవీకి తారాస్థాయికి తీసుకెళ్ళారు.

ఇక నటీనటుల విషయానికొస్తే.. నాగ చైతన్య గత సినిమాలకంటే డిఫరెంట్ లుక్ లో ఇందులో కనిపించాడు. ముఖ్యంగా ఓ దొంగ పాత్రలో ఉండాల్సిన కాన్ఫిడెంట్ ఎక్స్ ప్రెషన్స్ ని బాగా పలికించాడు. కృతి సనన్ లుక్ చాలా స్టైలిష్ గా ఉంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో సూపర్బ్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. చైతూ–కృతి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే కుదిరింది. మాణిక్యం పాత్రలో పోసాని కృష్ణ మురళి.. అతని పక్కనే వుండే లంబు – జంబు(వైవ హర్ష)లు బాగా నవ్వించారు. మిగతా నటీనటులు తమతమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు.

ఇక సినిమా ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్ గా ఉంటుంది. నాగ చైతన్య చేసే మోసాలు, ఇతని – కృతి రొమాంటిక్ ట్రాక్ బాగుంటుంది. నాగ చైతన్య పై కంపోజ్ చేసిన ఓ చేజ్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. మధురిమ ఐటెం సాంగ్ మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మంచి మంచి సీన్స్ వున్నా.. ఓవరాల్ గా చూస్తే కథ అంత ఇంప్రెసివ్ గా వుండదు. దర్శకుడు సుధీర్ వర్మ కథలో ఇంకాస్త స్ట్రాంగ్ పాయింట్ జోడించి వుండుంటే బాగుండేది. ఇక కథనం కూడా సెకండాఫ్ లో కాస్త స్లో అయ్యి ప్రీ క్లైమాక్స్ దగ్గర వేగంవంతం అవుతుంది. దాంతో బ్రహ్మానందం వచ్చే వరకూ సెకండాఫ్ బోరింగ్ గా ఉంటుంది. కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయితే, కొన్ని చోట్ల పాత్రలకి సరైన ముగింపు లేదు.

హీరోని ఎలివేట్ చెయ్యాలి అన్నప్పుడు విలన్ పాత్ర స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ లో నటించిన పోసాని కృష్ణ మురళి, రవిబాబు పాత్రలు అంత స్ట్రాంగ్ గా అనిపించవు. పాటలను షూట్ చేసిన విధానం బాగానే వుంది కానీ అవి వచ్చిన ఒక్క సందర్భం కూడా సరిగా సెట్ అవ్వలేదు. ఈ సినిమా రన్ టైం తక్కువ అయినప్పటికీ.. కొన్ని సాగదీసిన సీన్స్ ని కట్ చేసి వుండుంటే బాగుండేది. మాస్ కమర్షియల్ సినిమాల్లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ ఇందులో మిస్ అయ్యాయి.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకి రిచర్డ్ ప్రసాద్ అందించిన సినిమాటోగ్రఫీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. విజువల్స్ చాలా రిచ్ లుక్ ని ఇవ్వడమే కాకుండా చాలా కలర్ఫుల్ గా ఉంటాయి. అలాగే నటీనటుల్ని చూపిన విధానం కూడా బాగుంది. సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్ జస్ట్ ఓకే. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీ గా ఉండాల్సింది. సెకండాఫ్ స్టార్టింగ్ లో బోరింగ్ సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది. నారాయణరెడ్డి ఆర్ట్ వర్క్ మాత్రం చాలా బాగుంది. పాటల కోసం వేసిన సెట్స్ బాలీవుడ్ స్థాయిని తలపిస్తాయి.

ఇక దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాలో కూడా కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వంని డీల్ చేసాడు. కథ – చాలా సింపుల్ అండ్ రొటీన్. స్క్రీన్ ప్లే – ఫస్ట్ హాఫ్, క్లైమాక్స్ లో బాగుంది. దర్శకత్వం – ఈ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది అతని టేకింగ్ మాత్రమే. ముఖ్యంగా ఆకట్టుకునేలా రాసుకున్న కొన్ని సీన్స్, సందర్భానుసారంగా వచ్చే కామెడీ, బ్రహ్మానందం ఎపిసోడ్, క్లైమాక్స్ ట్విస్ట్ లలో తన టాలెంట్ చూపించాడు. కథ లైట్ గా, స్క్రీన్ ప్లే పెద్దగా లేకపోయినా ఈ విషయాలే సినిమాకి హెల్ప్ అయ్యాయి. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

చివరగా :
‘దోచేయ్’.. ఈ క్లాసికల్ దొంగ బాగానే దోచేశాడు!