Budugu Telugu Movie Review | Manchu Lakshmi Movie updates | Horror Telugu Movies

Teluguwishesh బుడుగు బుడుగు Get information about Budugu Telugu Movie Review, Budugu Movie Review, Lakshmi Manchu Budugu Movie Review, Budugu Movie Review And Rating, Budugu Telugu Movie Talk, Budugu Telugu Movie Teaser, Budugu Telugu Movie Trailer, Budugu Telugu Movie Gallery and more Product #: 63051 2.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    బుడుగు

  • బ్యానర్  :

    హైదరాబాద్‌ ఇన్నోవేటీస్‌ ప్రై. లిమిటెడ్‌

  • దర్శకుడు  :

    మన్‌మోహన్‌

  • నిర్మాత  :

    భాస్కర్‌, సారికా శ్రీనివాస్‌

  • సంగీతం  :

    సాయికార్తీక్

  • సినిమా రేటింగ్  :

    2.252.25  2.25

  • ఛాయాగ్రహణం  :

    సురేష్‌ రఘుతు

  • ఎడిటర్  :

    శ్యామ్‌ మేనగ

  • నటినటులు  :

    లక్ష్మీ మంచు, ఇంద్రజ, శ్రీధర్‌రావు, మాస్టర్‌ ప్రేమ్‌బాబు, బేబీ డాలీ, సన, ఇందు ఆనంద్‌, శైలజావాణి, అల్తాఫ్‌ తదితరులు

Budugu Telugu Movie Review

విడుదల తేది :

2015-04-17

Cinema Story

పూజ(లక్ష్మీ మంచు) – రాహుల్(శ్రీధర్ రావు) దంపతులకు బన్ని(మాస్టర్ ప్రేమ్ బాబు), విద్య (బేబీ డాలీ) అనే ఇద్దరు పిల్లలు వుంటారు. రాహుల్ తన ఉద్యోగరీత్యా పిల్లలతో సరిగా స్పెండ్ చెయ్యడు. ఈ గ్యాప్ వల్ల బన్ని సరిగా ఉండడం లేదని, అతను అల్లరి ఎక్కువ చేస్తున్నాడని తండ్రి రాహుల్ తనని బోర్డింగ్ స్కూల్ లో చేరుస్తాడు. కానీ అక్కడ బన్ని చేసిన కొన్ని సంఘటనల వలన స్కూల్ లో వాళ్ళందరూ భయపడి తనని అక్కడి నుంచి తిరిగి ఇంటికి పంపేస్తారు. ఇంటికి తిరిగొచ్చిన అనంతరం బన్ని చాలా డిఫరెంట్ గా ప్రవర్తిస్తుంటాడు. అర్ధరాత్రిళ్ళు దెయ్యం వస్తోందని, అలాగే చనిపోయిన దియా తనకు కనపడుతోందని భయపడుతుంటాడు.

ఒక రోజు పూజ కూడా ఇంట్లో ఇలాంటి సంఘటన ఎదుర్కోవాల్సి రావడంతో తెగ భయపడిపోతుంది. దాంతో బన్నిని పూజ చిల్డ్రన్స్ సైకాలజిస్ట్ గీత రెడ్డి(ఇంద్రజ) దగ్గరికి తీసుకెళ్తుంది. ఆమె ఓ కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత బన్ని ఓ సమస్యతో బాధపడుతున్నాడని.. దానివల్లే అతడు వింతగా ప్రవర్తిస్తున్నాడని ఆమె చెబుతుంది. అసలు బన్నికి ఉన్న సమస్య ఏమిటి.? ఎందుకలా అలా బిహేవ్ చేస్తుంటాడు.? అసలు దియా ఎవరు.? దియానే ఎందుకు బన్నికి కనపడుతుంది.? బన్నికి దియాకి ఉన్న రిలేషన్ ఏంటి.? అన్నది తెలియాలంటే వెండితెరపై బుడుగు చూడాల్సిందే!

cinima-reviews
బుడుగు

మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘బుడుగు’. మాస్టర్ ప్రేమ్ బాబు కీ రోల్ చేసిన ఈ సినిమా ద్వారా మన్మోహన్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఒక కుటుంబ నేపథ్యంలో జరిగే ఇబ్బందుల వల్ల పిల్లల మానసిక పరిస్థితులు ఎలా మారతాయి అనే పాయింట్ ఈ సినిమాలో చూపించారు. భాస్కర్, సారిక శ్రీనివాస్ నిర్మించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు థ్రిల్ చేసిందో చూద్దాం..

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

నేటితరం తల్లి తండ్రులకు, పిల్లలకు మధ్య సంబంధం ఎలా వుండాలి..? అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. లక్ష్మీ మంచు ఇందులో ఓ భాద్యతాయుతమైన భార్యగా, పిల్లలను ప్రేమించే తల్లి పాత్రల్లో కనిపించి, మెప్పించింది. ఇప్పటి వరకూ హర్రర్ సీన్స్ చెయ్యని లక్ష్మీ ఈ సినిమాలో సస్పెన్స్, హర్రర్ ఎలిమెంట్స్ ఉన్న సీన్స్ లో చాలా బాగా చేసింది. ఇక మాస్టర్ ప్రేమ్ బాబు సైకలాజికల్ గా వచ్చే ఇబ్బందులను చూపించే పిల్లాడి పాత్రలో ఆడియన్స్ ని భయపెట్టడంలో సక్సెస్ అయ్యాడు.

బేబీ డాలీ చూడటానికి క్యూట్ గా ఉండటమే కాకుండా మూగ పాత్రలో చాలా బాగా చేసింది. శ్రీధర్ రావు తన పాత్రకి న్యాయం చేసాడు. ఇంద్రజ డాక్టర్ పాత్రలో సినిమాలో చాలా కీ రోల్ చేసింది. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకుంటే.. మూవీ మొదలైన 10 నిమిషాలు చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కాస్త ఆడియన్స్ లో సస్పెన్స్ ని రేకెత్తిస్తుంది. ఆ ఊపుతో సాగే సెకండాఫ్ ఆసక్తికరంగా మొదలవుతుంది. సెకండాఫ్ లో వచ్చే కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మేజర్ మైనస్ పాయింట్ డైరెక్టర్ అనుకున్న కాన్సెప్ట్ ని సరిగా చెప్పలకేపోవడం. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్, బ్యాక్ డ్రాప్ బాగున్నా తీయడంలోకాస్త తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ లో మొదటి 5 నిమిషాలు, ఇంటర్వెల్ బ్లాక్ 5 నిమిషాలు తీసేస్తే మిగతా 50 నిమిషాలు చాలా బోరింగ్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా థ్రిల్లింగ్ మోమెంట్స్ ఏమీ లేవు.

ఇక స్క్రీన్ ప్లే బాలేదు. థ్రిల్లర్ సినిమా అంటే స్క్రీన్ ప్లే చాలా టఫ్ గా చూసే ఆడియన్స్ సీటు అంచున కూర్చొని చూసేలా చెయ్యాలి.. కానీ అలాంటి సీన్స్ సినిమాలో రెండు మూడు తప్ప ఎక్కువ లేకపోవడం ఈ సినిమాకి మైనస్. ఇక క్లైమాక్స్ ని సరిగా రివీల్ చేయలేదు. కనీసం క్లైమాక్స్ అన్నా చాలా గ్రిప్పింగ్ గా చెప్పగలిగి ఉంటే ఇంకాస్త బెటర్ గా ఉండేది. ఎడిటింగ్ అస్సలు బాలేదని చెప్పాలి. సెకండాఫ్ లో జస్ట్ థ్రిల్స్ ఉన్నాయి, కానీ లాజికల్ పరంగా చాలా మిస్ అవుతుంటాం.

సాంకేతిక విభాగం :

ఈ మూవీకి సురేష్ రగుటు అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ గ్రాండ్ గా ఉండడమే కాకుండా ఒక థ్రిల్లర్ సినిమాకి ఉండాల్సిన ఎఫెక్ట్స్ ని ఎక్కడా మిస్ కాలేదు. సాయి కార్తీక్ అందించిన మ్యూజిక్ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. శ్యామ్ మెంగ ఎడిటింగ్ జస్ట్ ఓకే.. ఫస్ట్ హాఫ్ పరంగా ఇంకాస్త బెటర్ ఎడిటింగ్ ఉండాల్సింది. రామ్ ఆర్ట్ డైరెక్షన్ సూపర్బ్. ఇక ఈ సినిమాకి మన్మోహన్ కర్త, కర్మ, క్రియ అయిన కథ–కథనం–దర్శకత్వ విభాగాలను డీల్ చేసాడు. కథ – కాన్సెప్ట్ బాగుంది, కానీ కథా విస్తరణ ఆకట్టుకునేలా లేదు. ఇక దర్శకత్వం – పెర్ఫార్మన్స్ లు బాగా చేయించాడు, కానీ ఆడియన్స్ ని ఆద్యంతం అలరించలేకపోయాడు. భాస్కర్, సారిక శ్రీనివాస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా :

బుడుగు : ప్రేక్షకులకు థ్రిల్లింగ్ పరీక్ష!