jil movie review | Gopichand | Rashi Khanna

Teluguwishesh జిల్ జిల్ Jil Movie Telugu Review gopichand rashi khanna : Tollywood macho man gopichand and rashi khanna latest flick Jil movie telugu review which is directed by Radha krishna. Vamsi Krishna Reddy and Pramod Uppalapati Produced this Film under UV creations Production House. Product #: 62175 3.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    జిల్

  • బ్యానర్  :

    UV క్రియేషన్స్

  • దర్శకుడు  :

    రాధాకృష్ణ

  • నిర్మాత  :

    వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి

  • సంగీతం  :

    మొహమ్మద్ గిబ్రాన్

  • సినిమా రేటింగ్  :

    3.53.53.5  3.5

  • ఛాయాగ్రహణం  :

    శక్తి శరవణన్

  • ఎడిటర్  :

    కోటగిరి వెంకటేశ్వరరావు

  • నటినటులు  :

    గోపీచంద్, రాశిఖన్నా, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస అవసరాల

Jil Movie Telugu Review Gopichand Rashi Khanna
Cinema Story

జై(గోపిచంద్) ఒక పవర్ ఫుల్ ఫైర్ ఆఫీసర్. ప్రమాదంలో వున్నవారిని కాపాడటానికి ఎంతటి రిస్క్ చేయడానికైనా వెనుకాడడు. ఇదే సమయంలో ఓసారి సావిత్రి(రాశిఖన్నా)తో పరిచయమై, ఆమెతో ప్రేమలో పడతాడు. సీన్ కట్ చేస్తే... ముంబైలో ఓ పేరుమోసిన మాఫియా డాన్ ఛోటా నాయక్(కబీర్)... తన అనుచరుడు రాధాకృష్ణ(బ్రహ్మాజీ) చేతిలో మోసపోయి జైలుకు వెళతాడు. కానీ జైలు నుంచి పారిపోయి వచ్చి.. రాధాకృష్ణ కోసం వెతుకుతుంటాడు ఛోటా నాయక్.

ఇదే క్రమంలో రాధాకృష్ణను పలుసార్లు జై ఆపద నుంచి కాపాడుతాడు. దీంతో జై పై ఛోటానాయక్ గ్రూప్ అనుమానిస్తుంది. అనుకోకుండా ఓ భారీ అగ్నిప్రమాదంలో రాధాకృష్ణ చిక్కుకుంటాడు. అప్పుడు ఇతనిని కాపాడటం కోసం జై ప్రయత్నిస్తాడు. కానీ.. చావుబతుకుల మధ్య వున్న రాధాకృష్ణ.. జైకి ఓ విషయం చెప్పాలని ప్రయత్నించి పూర్తిగా చెప్పలేకపోతాడు. అయితే జై ఆ విషయం ఎలా తెలుసుకున్నాడు? ఛోటా నాయక్ గ్యాంగ్ జై వెంట ఎందుకు పడ్డారు? ఛోటా నాయక్ గ్యాంగ్ ను జై ఎలా ఎదుర్కొన్నాడు? అసలు ఛోటా నాయక్ దేనికోసం వెదుకుతున్నాడు? రాధాకృష్ణ చెప్పాలనుకున్న విషయం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే వెండితెరపై ‘జిల్’ సినిమా చూడాల్సిందే.

cinima-reviews
జిల్

గోపిచంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జిల్’. UV క్రియేషన్స్ బ్యానర్లో ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత ప్రముఖ నిర్మాత వంశీ, ప్రమోద్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. గోపిచంద్ సరసన తొలిసారిగా రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది.

గిబ్రాన్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. కమర్షియల్ యాక్షన్, ఎంటర్ టైనర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (మార్చి 27) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో ఒకసారి చూద్దామా!

Cinema Review

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గోపిచంద్. గత చిత్రాలకంటే ఇందులో గోపీచంద్ చాలా స్టైలిష్ గా, కొత్తలుక్ లో కనిపించాడు. ఫైర్ మెన్ ఆఫీసర్ గా గోపిచంద్ నటన అద్భుతం. ఇప్పటికే మాస్ యాక్షన్ హీరోగా పేరుగాంచిన గోపీ.. ఈ సినిమాతో మరోసారి ఆ క్రేజ్ ను మరింతగా పెరిగేలా చేసేసాడు. ఓ పవర్ ఫుల్ ఫైర్ మెన్ ఆఫీసర్ గా కనిపిస్తూనే, లవర్ బాయ్ గా గోపిచంద్ అద్భుతంగా నటించాడు.

ఇక మొదటిసారిగా గోపిచంద్ తో జతకట్టిన రాశిఖన్నా... సినిమాకు గ్లామర్ డోస్ ను తెచ్చిపెట్టిందనే చెప్పుకోవాలి. రాశిఖన్నా ఇప్పటి వరకు నటించిన సినిమాల కంటే ఈ సినిమాలోని నటన కాస్త బాగుందనే చెప్పుకోవాలి. తన క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. ఇక రాశిఖన్నా అందాల ఆరబోత ప్రేక్షకులకు మతిపోగోడుతుంది. గోపిచంద్, రాశిఖన్నాల కెమిస్ట్రీ బాగుంది.

ఇక సినిమాలో మెయిన్ విలన్ చోటా నాయక్ గా నటించిన కబీర్... చాలా అద్భుతంగా నటించాడు. విలన్ పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. విలన్ పాత్ర కూడా చాలా స్టైలిష్ గా డిజైన్ చేసాడు దర్శకుడు రాధాకృష్ణ. గోపిచంద్ ను ఢీ కొట్టాలంటే కబీర్ లాంటివాడే కావాలనే వుద్దేశ్యంతో సరైన వ్యక్తినే విలన్ గా తీసుకున్నారు. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.

మైనస్ పాయింట్స్:

‘జిల్’ సినిమాలో భారీ యాక్షన్ సన్నీవేశాలున్నాయి. ఈ సీన్లు మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి కానీ ఫ్యామిలీ ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇక కథలో కొత్తదనం వున్నప్పటికి.. ఏదైనా ప్రధాన పాయింట్ గా తీసుకొని ‘జిల్’ ను తెరకెక్కించారో... ఆ పాయింట్ ను మరింత బాగా చూపించి వుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది.

సాంకేతికవర్గ పనితీరు:

దర్శకుడిగా రాధాకృష్ణ మంచి మార్కులు కొట్టేసాడని చెప్పుకోవచ్చు. మాములు కథను చాలా స్టైలిష్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించడంలో రాధాకృష్ణ సక్సెస్ అయ్యాడు. కానీ స్ర్కీన్ ప్లేలో మరింత జాగ్రత్తలు తీసుకొని వుంటే బాగుండేది. శక్తి శరవణన్ సినిమాటోగ్రఫి సూపర్బ్. ప్రతి ఫ్రేంను చాలా గ్రాండ్ ను తెరకెక్కించారు.

గిబ్రాన్ సంగీతం అందించిన పాటలు విజువల్స్ పరంగా చాలా బాగున్నాయి. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది. కానీ మరికాస్త జాగ్రత్తపడివుంటే ఇంకా బాగుండేది. అనల్ అరసు అందించిన యాక్షన్ సన్నీవేశాలు చాలా బాగున్నాయి. ఇక యువి క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు చాలా గ్రాండ్ గా వున్నాయి. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించినట్లుగా భారీగా వున్నాయి.

చివరగా:
‘జిల్’మనిపించే స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ