Teluguwishesh ఐస్ క్రీమ్2 ఐస్ క్రీమ్2 ice cream2 movie review : tollywood latest erotic thriller movie ramgopal varma's ice cream2 releases by 21st november 2014. ice cream2 movie acted lead roles nandu, naveena and jd chakravarthy looks horror with trailors and looks hot with latest song released by movie unit ram gopal varma faces problems for this movie this is produced by thumallapalli sathya narayana Product #: 58196 2 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఐస్ క్రీమ్2

  • బ్యానర్  :

    భీమవరం టాకీస్

  • దర్శకుడు  :

    రామ్ గోపాల్ వర్మ

  • నిర్మాత  :

    తుమ్మలపల్లి రామసత్యానారాయణ

  • సంగీతం  :

    సత్య కశ్యప్

  • సినిమా రేటింగ్  :

    22  2

  • ఛాయాగ్రహణం  :

    అంజి

  • ఎడిటర్  :

    నాగేంద్ర వర ప్రసాద్ అడప

  • నటినటులు  :

    నందు(హీరో), నవీన (హీరోయిన్), జె.డి.చక్రవర్తి, తణికెళ్ళ భరణి, ధన్ రాజ్, జీవా తదితరులు

Ice Cream2 Movie Review

విడుదల తేది :

2014-11-21

Cinema Story

కొందరు స్నేహితులు కలిసి ఓ షార్ట్ ఫిలిం తీసేందుకు ఓ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్తారు. అక్కడ కొన్ని అనుకోని సంఘటనలు ఎదుర్కుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అని కారణాలు వెతికే సమయంలోనే స్నేహితుల బృందాన్ని సిక్క (జే.డి.చక్రవర్తి) గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. గతంలో వీరు బ్యాంకులు రాబరీ చేసే వారు. అయితే ఆశ్చర్యకరంగా కిడ్నాప్ గ్యాంగ్ లో ఒక్కొక్కరూ వరుసగా చనిపోతుంటారు. దీంతో అడవిలో ఏదో జరుగుతుందని అంతా భయపడిపోతారు. వీరందర్నీ చంపుతున్నది ఎవరు?... చివరకు స్నేహితుల బృందం, కిడ్నాప్ గ్యాంగ్ ఏమయింది, ఎవరు మిగిలారు వంటి ప్రశ్నలకు థియేటర్ కు వెళ్తే సమాధానం దొరుకుతుంది.

cinima-reviews
ఐస్ క్రీమ్2

తెలుగు హర్రర్, థ్రిల్లర్ సినిమాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘ఐస్ క్రీమ్2’ విడుదల అయింది. ఐస్ క్రీమ్ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీలో కూడ వర్మ మార్కు హర్రర్, ట్విస్టులు ఉంటాయని స్పష్టం అవుతోంది. కొత్త నటి నవీన ప్రధాన ఆకర్షణగా తెరకెక్కిన సినిమాలో నందు, జెడి చక్రవర్తి ప్రధాన పాత్రలు పోషించారు. తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించగా సత్య కశ్యప్ సంగీతం అందించాడు. తొలి సినిమా ఫ్లాప్ అయినా.., దానికే సీక్వెల్ తీసి డేరింగ్ డైరెక్టర్ అన్పించుకున్నాడు. నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎంతవరకు భయపెడుతుందో ఇప్పుడు చూద్దాం.

ప్లస్ పాయింట్లు

ముందుగా ఈ సినిమా గురించి ఒక ప్లస్ పాయింట్ ఖచ్చితంగా చెప్పాలి. అదేమంటే గతంలో వచ్చిన మూవీ కంటే సీక్వెల్ కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. జే.డి.చక్రవర్తి నటన అద్బుతంగా ఉంది. తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సీరియస్ గా ఉండటమే కాకుండా సినిమాలో కామెడిని కూడా పండించాడు. అటు నందు, ధనరాజ్ మిగతా నటులు కూడా తమవంతు న్యాయం చేశారు. హాట్ అందాలతో హీటెక్కించిన నవీన కూడా పర్వాలేదు అన్పించింది.

మైనస్ పాయింట్లు

ఇతరుల డైరెక్షన్ పై విమర్శలు చేసే రామ్ గోపాల్ వర్మ కూడా ఇక్కడ విఫలం అయ్యాడు. కేవలం ఒకే అంశాన్ని లీడ్ గా చేసుకుని దానిపైనే శ్రద్ద పెట్టి సినిమా తీశాడు. అంతా వరుసగా చనిపోతున్నా ఎవరు ఇదంతా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనే అంశం చాలా సస్పెన్స్ గా పెట్టి ప్రేక్షకులకు ఇరిటేషన్ తెప్పించాడు. ఫస్ట్ ఆఫ్ అంతా ఉత్తుత్తి. చెప్పుకోవటానికి కథలో ఏమి లేదు. వర్మ మార్కు వల్గారిటి.., కొన్ని సీన్ల ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇక సెకండ్ ఆఫ్ ఫుల్ హర్రర్ గా ఉంటుంది. గతంలో మాదిరిగానే క్లైమాక్స్ వేగంగా పూర్తి చేశాడు. సినిమాకు సరైన కన్ క్లూజన్ ఇవ్వలేదు.

Cinema Review

డైరెక్టర్ గురించి ఎలాగూ పైన చెప్పుకున్నాం కాబట్టి ఇతర కళాకారుల గురించి చూద్దాం. ముందుగా కెమెరామెన్ విషయానికి వస్తే.., సన్నివేశాలు యావరేజ్ గా ఉన్నాయి అని చెప్పాలి. ఫ్లో కెమెరాను ఈ మూవీ కంటే ఐస్ క్రీమ్ లోనే చాలాబాగా ఉపయోగించారు. స్ర్కీన్ ప్లే సరిగా లేదు. చాలా పాత్రలను పూర్తిగా ఉపయోగించుకోకుండా అన్యాయం చేశారు. ఇక మ్యూజిక్ ఓకే.., బ్యాగ్రౌండ్ మ్యూజిక్ భయపెడుతుంది. సినిమా తీయటమే సరిగా లేదు కాబట్టి.., ఎడిటింగ్ బాగుంటుందని ఎలా అనుకోగలం.

చివరగా : బెటర్ దెన్ ఫస్ట్.. బట్ నాట్ బెస్ట్.

కార్తిక్

Movie TRAILERS

ఐస్ క్రీమ్2

play