Teluguwishesh పాఠశాల పాఠశాల telugu latest movie Paatashala released on 10th october movie review available : nandu and anupriya latest movie Paatashala Telugu Movie Review Product #: 56790 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    పాఠశాల

  • బ్యానర్  :

    మూన్ వాటర్ పిక్చర్స్

  • దర్శకుడు  :

    మహి వి.రాఘవ్

  • నిర్మాత  :

    రాకేష్ మహంకాళి, పవన్ కుమార్ రెడ్డి

  • సంగీతం  :

    రాహుల్ రాజ్

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    సుధీర్ సురేంధ్రన్

  • ఎడిటర్  :

    సుధీర్ సురేంధ్రన్

  • నటినటులు  :

    నందు, అనుప్రియ, సాయిరోనక్, శిరీష, హమూద్, శశాంక్ తదితరులు....

Paatashala Movie Review

విడుదల తేది :

2014-10-10

Cinema Story

సూర్య(శివ), సాల్మా(శిరీష), సంధ్య(అనుప్రియ), రాజు(నందు), ఆది(సాయి కిరణ్) ఈ ఐదుగురు స్నేహితులు. ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే మంచి ఫ్రెండ్స్ గా మారారు. అందరూ చదువు పూర్తి చేసుకున్నారు కాని ప్రస్తుతం బయట ప్రపంచంలో బీటెక్ బాబుల లాగే చదువయ్యాక ఏం చేయాలో తెలియక వీరూ ఆలోచనలో పడతారు. అప్పుడే వారి కాలేజి ప్రొఫెసర్ సొంతూరుకు వెళ్ళిరండి అని సలహా ఇస్తారు. ఇదేదో బాగుంది కదా అని అంతా కలిసి టూర్ కు వెళ్తారు. ఈ సమయంలోనే ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన వస్తుంది. ఒకరు ఊళ్ళో డైరీ ఫాం మొదలు పెడతానని చెప్తే.. కాదు అమెరికా వెళ్లాలని మరొకరు అంటారు. మంచి మ్యుజీషియన్ కావాలని ఒకరి మనస్సులో ఉంటుంది. ఇలా ఎవరి ఆలోచనలు, అభిప్రాయాల్లో వారుండగా ప్రయాణం మద్యలో వీరికి ఓ అపరిచితుడు కలుస్తాడు. ఎవరా అపరిచితుడు.., అతడి వల్ల ఏం జరిగింది వంటి అంశాలను సినిమా స్ర్కీన్ పై చూస్తేనే బాగుంటుంది.

cinima-reviews
పాఠశాల

విశ్లేషణ

కాలేజి స్టూడెంట్స్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చి చాలా రోజులు అవుతున్న తరుణంలో.., విడదలైన సినిమా ‘పాఠశాల’. ఐదుగురు స్నేహితులు సరదా ట్రిప్ కు వెళ్ళినపుడు కలిగిన అనుభవాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. ‘వినాయకుడు’ సినిమాకు రచయితగా ఇండస్ర్టీకి వచ్చి‘విలేజ్ లో వినాయకుడు’, ‘కుదిరితే కప్పు కాఫీ’ సినిమాలను నిర్మించిన మహి.వి. రాఘవ్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. ఆయన పనిచేసిన గత సినిమాల లాగే ఇది కూడా యూత్ ఎంటర్ టైనర్ అనే ఉద్దేశ్యంతో విడుదల అయింది. ఈ సినిమా రివ్యూ మీకోసం.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ఐదుగురు ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఐదుగురిలో ప్రతి ఒక్కరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. వారి ఆలోచనలు, జర్నీ అంతా సహజంగా కన్పిస్తుంటుంది. పాత్రలు కూడా వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు కన్పిస్తాయి. ఇక ఆరవ వ్యక్తిగా పరిచయం అయ్యే శశాంక్ సినిమాకు కీ రోల్ అని చెప్పాలి. ఎందుకంటే శశాంక్ వచ్చాక కధకు కొత్తదనం వస్తుంది. సినిమాలో యూత్ అంశాలతో పాటు.., ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇక సినిమాతో పాటు కన్పించే ప్రకృతి అందాలు ప్రేక్షకులకు ఒక అనుభూతిని కల్గిస్తాయి. సినిమాకు సంగీతం.. విజువల్స్ అదనపు ప్లస్ పాయింట్లు.
 
మైనస్ పాయింట్స్ :

దాదాపు ఇప్పుడు వస్తున్న అన్ని సినిమాలకు మాదిరే ఇది కూడా గతంలో వచ్చిన ఓ పాత సినిమాను తలపిస్తుంటుంది. అందులో ఇద్దరు హీరోలుంటే ఇక్కడ ఐదుగురు ఉన్నారు. ఈ మద్య ప్రేక్షకులు ఎక్కువగా కోరుకుంటున్న కామెడి ఇందులో పెద్దగా లేదు. అంతేకాకుండా మాస్ పాటలు, ఫైట్లు కూడా లేకపోవటం వల్ల వాటికోసం థియేటర్ కు వచ్చే ప్రేక్షకులు నిరాశ చెందుతారు. ఇక సినిమాలో గెస్ట్ రోల్ చేసిన శశాంక్ పాత్రబాగున్నా.., మరికొంచెం మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది. స్క్రీన్ ప్లే విషయంలో కూడా మరిన్ని జాగ్రత్తలు అవసరం.

సాంకేతిక విభాగం :

డైరెక్టర్ మహి మంచి కధను ఎంపిక చేసుకున్నారు. అందుకు తగ్గట్టు పనిచేశారని తెలుస్తోంది. అయితే స్క్రీన్ ప్లే విషయానికి వచ్చే సరికి సినిమాను సరిగా చూపించలేకపోయారు. ఎడిటింగ్ కూడా శ్రవణ్ మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అన్పిస్తుంది. కొన్ని సీన్లు కధ అవసరానికి మించి ఎక్కువగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు వేయక తప్పదు. ఎందుకంటే సహజమైన లొకేషన్లను చాలా అందంగా చూపించారు. అంతేకాకుండా ప్రతి సన్నివేశాన్ని దాదాపుగా పూర్తిగా కవర్ చేసే ప్రయత్నం చేశారు. ‘పాఠశాల’కు సంగీతం కూడా సాయం చేసింది. రాహుల్ రాజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి హెల్ప్ చేసింది. మాటలు కూడా బాగున్నాయి. అయితే చాలా అని చెప్పలేము.

ఒక్కమాటలో...

పేరు పాఠశాల అయినా... చూపించింది కాలేజి రోజులను. ఈ సినిమా చూస్తే దాదాపు ప్రతి ఒక్కరికి వారి విద్యార్ధి జీవితం గుర్తుకు వస్తుంది.

Movie TRAILERS

పాఠశాల

play