Teluguwishesh దిక్కులు చూడకు రామయ్య దిక్కులు చూడకు రామయ్య telugu latest movie dikkulu chudaku ramayya movie review available : dikkulu chudaku ramayya movie come with diferent story this movie rating and review is online Product #: 56776 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    దిక్కలు చూడకు రామయ్య

  • బ్యానర్  :

    వారాహి చలనచిత్రం

  • దర్శకుడు  :

    త్రికోఠి

  • నిర్మాత  :

    రజిని కొర్రపాటి

  • సంగీతం  :

    కీరవాణి

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    బి.వి. అమర్ నాధ్

  • ఎడిటర్  :

    తమ్మిరాజు

  • నటినటులు  :

    నాగశౌర్య (హీరో) , సనా మక్బుల్ ( హీరోయిన్) , అజయ్, ఇంద్రజ, బ్రహ్మాజి, అలీ, పోసాని, ఝాన్సి, నాగినీడు, 30ఇయర్స్ పృథ్వి తదితరులు

Dikkulu Chudaku Ramayya Movie Review

విడుదల తేది :

2014-10-10

Cinema Story

క్రిష్ (అజయ్) అనే బ్యాంకు ఉద్యోగికి ఇద్దరు అబ్బాయిలు. అందులో ఒకరు మధు ( నాగశౌర్య). అమ్మాయిలపై ఆసక్తి ఉండే క్రిష్ ఓ సారి సంహిత (సనా మక్బూల్) ను చూసి ఇష్టపడతాడు. తన వయస్సు కాదు అని తెలిసి కూడా ఆమెను కోరుకుంటాడు. పెళ్ళి చేసుకుంటాను అని వెంట పడతాడు. ఈ విషయం మధుకు తెలుస్తుంది. తన తండ్రి చెడు మార్గంలో వెళ్తున్నాడు అని తెలుసుకుని ఆయన్ను సరిచేయాలని డిసైడ్ అవుతాడు. ఇందుకోసం మధు ఏం చేశాడు.., సంహితతో ఎలా ప్రేమలో పడతాడు.. చివరకు కధ ఏమవుతుంది అనేది వెండితెరపై చూస్తే బాగుంటుంది.

cinima-reviews
దిక్కులు చూడకు రామయ్య

విశ్లేషణ

‘ఊహలు గుసగుసలాడే’ హిట్ తో మంచి జోష్ మీద ఉన్న నాగ శౌర్య తాజా సినిమా ‘దిక్కులు చూడకు రామయ్య’ విడుదల అయింది. చిన్న హీరో, కొత్త హీరోయిన్ అయినా... బ్యానర్ పెద్దది కావటంతో సినిమాపై అంచనాలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. ఈ మూవీతో కొత్తగా సనా మక్బూల్ అనే హీరోయిన్ తెరకు పరిచయం అయింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి దగ్గర పనిచేసిన త్రికోఠి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. సాయి కొర్రపాటి బ్యానర్ అయిన వారాహి చలన చిత్రం సంస్థ ఆద్వర్యంలో వచ్చిన ఈ మూవీకి రజిని కొర్రపాటి నిర్మాతగా ఉంది. కీరవాణి సంగీతం అందించారు. వెరైటి స్టోరీతో వచ్చిన సినిమాగా ప్రచారంలో ఉన్న ‘దిక్కులు చూడకు రామయ్య’ రివ్యూ ఇప్పుడు చూద్దాం.


ప్లస్ పాయింట్స్

ముందుగా చెప్పుకున్నట్లుగానే ఈ సినిమా కధ కాస్త వెరైటీగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సినిమాలతో పోలిస్తే కాస్త డిఫరెంట్ గా కధ ఉంటుంది. తండ్రి, కొడుకుల మద్య అనుబంధంతో పాటు కొత్తగా కొడుకు ప్రేమించే అమ్మాయిని తండ్రి ప్రేమించటం ఈ విషయం కొడుకుకు తెలియటం అనే కాన్సెప్టుతో సినిమా రావటంతో ఇదేమిటో తెలుసుకునేందుకు ప్రేక్షకులు సినిమా థియేటర్ కు వస్తారు. సినిమా మొదటి భాగంలో ఉన్న కామెడి ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. ఇక హీరోయిన్ హీరో మద్య జరిగే సన్నివేశాలతో పాటు తండ్రి తో వీరిద్దరూ ఉన్నపుడు జరిగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. అదే విధంగా సినిమా మొదటి భాగంలో బోరింగ్ అనే ఫీల్ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో సినిమా చూసే ప్రేక్షకులకు కధపై ఆసక్తి పెరుగుతుంది. పాటలు కూడా బాగుండటం ఈ సినిమాకు అదనంగా కలిసివచ్చే అంశం.

మైనస్ పాయింట్లు

కధ కాస్త కొత్తదే అయినా.., సినిమాలో కొన్ని పాత అంశాలు ఉన్నాయి. అదే హీరో హీరోయిన్ ప్రేమించుకోవటం.., చివరకు వారిద్దరూ కలవటం ఇది ఎప్పటినుంచో వస్తున్న కాన్సెప్టు. దానికే కాస్త అదనపు క్యారెక్టర్ జోడించి ఈ సినిమాను తీశారు. ఇక ఫస్ట్ ఆఫ్ కామెడి, క్యారెక్టర్లను పరిచయం చేయటానికి సమయం తీసుకోవటంతో సెకండ్ ఆఫ్ లో అసలు కధను చెప్పేస్తారు. దీంతో ముందు భాగంలో ఉన్నంత కామెడి సెకండ్ ఆఫ్ లో ఉండదు. దీంతో పాటు కధ కూడా మెల్లగా వెళ్తున్నట్లు అన్పిస్తుంది. రెండవ భాగంలో ఉన్న పాటలు వినడానికి బాగానే ఉన్నా పిక్చరైజేషన్ మాత్రం సరిగా లేదనే చెప్పాలి. కొత్త కధ అయినా చివర్లో వచ్చే సీన్లను ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ఇక క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ ముందే ఊహిస్తున్నారు.

కళాకారుల పనితీరు

ముందుగా హీరో గురించి చెప్పాలంటే నాగశౌర్య నటన చాలా చక్కగా ఉంటుంది. సన్నివేశాలకు తగ్గట్లు హావభావాలను స్పష్టంగా చూపించగలిగాడు. లవ్, ఎమోషనల్, సెంటిమెంట్, కామెడి ఇలా నాగ నటించిన అన్ని సీన్లు బాగున్నాయి. ఇక హీరోయిన్ కూడా ఏమి తక్కవ తీసిపోలేదు. తొలి సినిమానే అయినా చాలాబాగా నటించింది. ఇక ఇన్నాళ్లు విలన్ క్యారెక్టర్లు చేసి ఈ మద్యే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన అజయ్ కు ఈ సినిమాతో దశ తిరగటం ఖాయం. తండ్రి పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ఇది భవిష్యత్తులో అజయ్ కు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఇక చాలాకాలం తర్వాత తెరపైకి వచ్చిన ఇంద్రజ ఈ సినిమాకు మరో అదనపు హంగుగా చెప్పవచ్చు. ఆమె నేపథ్యంగా వచ్చే పలు సీన్లు కంటతడి పెట్టిస్తాయి.

‘దిక్కులు చూడకు రామయ్య’ కోసం డైరెక్టర్ త్రికోఠి చాలా బాగా కష్టపడ్డాడు. రాజమౌళి పేరును కాపాడేలా సినిమాను తీశాడని మెచ్చుకోక తప్పదు. డైలాగులు కూడా బాగున్నాయి. ఇకవెరైటి కధను తీసుకుని కొత్త వారికి అవకాశం ఇచ్చిన వారాహి బ్యానర్..., తమకున్న పేరుకు తగ్గట్టు సినిమాను నిర్మించింది. ఇక కీరవాణి అందించిన సంగీతం కూడా సినిమాకు కలిసి వచ్చే అంశం. పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు తగ్గట్లుగా ఉన్నాయి. అమర్ నాధ్ సినిమాటోగ్రపీకి మంచి మార్కులే పడుతున్నాయి. సన్నివేశాలను నీట్ గా ఎక్కడా డిస్టర్బెన్స్ లేకుండా తీయగలిగారు. అటు ఎడిటింగ్ పరంగా తమ్మిరాజు తన నైపుణ్యం ప్రదర్శించాడు. అయితే మరింత దృష్టిపెడితే బాగుండేది.

చివరగా

ఓ కొత్త కధతో..., ప్రయత్నించిన కొత్త వారు సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. ఫ్యామిలి అంతా కలిసి ఓ సారి వెళ్ళి చూడొచ్చు అని చెప్పగలం.

కార్తిక్

Movie TRAILERS

దిక్కులు చూడకు రామయ్య

play