Teluguwishesh అనుక్షణం అనుక్షణం manchu vishnu and ram gopal varma combination anukshanam movie has finally released Product #: 55938 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    అనుక్షణం

  • బ్యానర్  :

    ఏవీ పిక్చర్స్

  • దర్శకుడు  :

    రాంగోపాల్ వర్మ

  • నిర్మాత  :

    ఆర్. విజయ్ కుమార్, గజేంద్ర నాయుడు, పార్థసారధి నాయుడు

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • నటినటులు  :

    విష్ణు, తేజస్వీ, మధుశాలిని, నవదీప్, రేవతి తదితరులు

Anukshanam Movie Review

విడుదల తేది :

13-09-2014

Cinema Story

(రాంగోపాల్ వర్మ సినిమా కదండి..) టైం అర్థరాత్రి.. హైదరాబాద్ లోని ఓ ఏరియా.. నిర్మానుష్యంగా వున్న రోడ్లు.. ఎవ్వరులేని ఆ ప్రాంతంలో ఓ సైకో కిల్లర్ సీతారాం (సూర్య) ఓ అమ్మాయిని చంపేస్తాడు. ఇక అక్కడి నుంచి రోజూ అమ్మాయిలను చంపుకుంటూ వస్తుంటాడు. అయితే ఈ హత్యలు ఎవరుచేస్తున్నారన్న విషయం మాత్రం పోలీసులకు అంతుచిక్కుండా వుండిపోతుంది. అంతలోనే ఈ కేసును హైదరాబాద్ కి డిసిపి అయిన గౌతమ్ (మంచు విష్ణు) డీల్ చేస్తాడు. సైకో కిల్లర్ పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ.. ప్రతీసారి ఫెయిల్ అవుతూనే వుంటాడు.

అదే సమయంలో సైకో కిల్లర్స్ మీద రీసర్చ్ చేసిన శైలజ(రేవతి) ఆ కేసులో సాయం చేయడానికి గౌతమ్ ని సంప్రదిస్తుంది. అక్కడి నుంచి వారంతా కలిసి ఆ సైకో కిల్లర్ పట్టుకోగలిగారా? లేదా? ఆ సైకో కిల్లర్ అంతమంది అమ్మాయిలను ఎందుకు చంపుతున్నాడు.? ఈ సైకో కిల్లర్ ని పట్టుకునే ప్రాసెస్ లో గౌతమ్ ఏమేమి కోల్పోవలసి వచ్చింది? అనే సస్పెన్స్ ఎలిమెంట్స్ ఎంటో తెలుసుకోవాలంటే తెరమీద చూడాల్సిందే!

cinima-reviews
anukshanam movie review

ఎప్పుడూ వివాదాస్పద కథలతో కూడిన సినిమాలను చిత్రీకరించి సెన్సేషనల్ గా నిలిచిపోయే డైరెక్టర్ రాంగోపాల్ వర్మం... ఈసారి ఒక డిఫరెంట్ కథాచిత్రంతో తెరముందుకు వచ్చేశాడు. ‘‘రౌడీ’’ సినిమా తర్వాత మంచు విష్ణు - రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘అనుక్షణం’. కేవలం ఒకటిన్నర గంట నిడివి గల ఈ సినిమాను హాలీవుడ్ స్టైల్ టేకింగ్ తో తెరకెక్కించాడు వర్మ! ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ కి మంచి ఆదరణ లభించడంతో అంచనాలు బాగానే పెరిగాయి. ఎప్పటిలానే అందాలను ఆరబోసే హీరోయిన్లను, ఇంపోర్టెడ్ అమ్మాయిలనూ తీసుకోకుండా.. రేవతి, మధుశాలిని, తేజస్వి వంటి తెలుగు తారలతోపాటు సూర్య, నవదీప్ లను ఈ సినిమాలో తీసుకున్నాడు. అమ్మాయిలు జాగ్రత్త అనే క్యాప్షన్ తో సెప్టెంబర్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. ఏ మేరకు జనాలను ఆకర్షించిందో రివ్యూలో చూద్దాం...

Cinema Review

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే.. హీరో మంచు విష్ణు, సైకో కిల్లర్ గా చేసిన సూర్య, రేవతి మరియు జర్నలిస్ట్ గా చేసిన మధు శాలిని పెర్ఫార్మన్స్ అద్భుతం. ముందుగా ఇలాంటి జోనర్ సినిమాని రిస్క్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందించాలని ట్రై చేసిన మంచు విష్ణుకి హ్యాట్సాఫ్ చెప్పాలి. తన కెరీర్లో ఇప్పటి వరకూ చేసిన సినిమాలనీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక్కటే ఒక ఎత్తనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఇందులో అతను ఒక హీరోగా కంటే నటుడిగానే బాగా మెప్పించాడు. టిపికల్ పోలీస్ ఆఫీసర్ పాత్రకి విష్ణు లుక్, ఫిజిక్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. సైకో కిల్లర్ గా చేసిన సూర్య పెర్ఫార్మన్స్ ఈ మూవీకి మరో మేజర్ హైలైట్. ఇక సైకో కిల్లర్స్ పై రీసర్చ్ చేసిన శైలజగా రేవతి నటన బాగుంది. జర్నలిస్ట్ పాత్రలో మధు శాలిని ఆడియన్స్ లో టెన్షన్ క్రియేట్ చెయ్యడంలో బాగానే సక్సెస్ అయ్యింది. ఇకపోతే అతిధి పాత్రలు చేసిన తేజస్వి, నవదీప్ తమ పాత్రల పరిధిమేర నటించారు. బ్రహ్మానందం కనిపించే రెండు సీన్స్, కోట శ్రీనివాసరావు తెలంగాణ స్లాంగ్ డైలాగ్స్ నవ్విస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే... సినిమా నిడివి కేవలం 104 నిమిషాలే కావడం మరో మేజర్ ప్లస్ పాయింట్.

మైనస్ పాయింట్స్ :

యాక్షన్ తరహా సినిమాల్లో సాగాల్సిన స్ర్కీన్ ప్లేను వేగంగా సాగించడం వల్ల లాజిక్స్, లూప్ హోల్స్ మిస్ అవడం మైనస్ పాయింట్. సైకో కిల్లర్ నటన బాగానే వుంది కానీ.. ఒక్క స్మార్ట్ మూవ్ కూడా లేకుండా సాగదీశారు. ఈ సినిమాలో వుండాల్సిన థ్రిల్స్ వున్నాయి కానీ.. అదిరిపోయే రేంజిలో మాత్రం లేవనే అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

రాంగోపాల్ వర్మ తన గత సినిమాలకంటే ఈ సినిమాలో సరికొత్త యాంగిల్ లో తెరకెక్కించాడు. డైరెక్షన్ పరంగా ఎక్కడా పక్కదార్లు పోకుండా ఒకే లైన్ మీద తీసుకెళ్లాడు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. ఒక థ్రిల్లర్ సినిమాలో విజువల్స్ ఎలా వుండాలో అలా ఈ మూవీలో చాలా బాగున్నాయి. మ్యూజిక్ విషయానికి వస్తే.. సన్నివేశాలకు తగ్గట్టు సినిమలో వున్న మూడ్ కు కనెక్ట్ అయ్యేలా కంపోస్ చేశాడు. ఎడిటింగ్ విషయంలో ఓకే! స్ర్కీన్ ప్లే మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వుంటే సన్నివేశాలు ఇంకా థ్రిల్లర్ గా అనిపించేవి.

చివరగా... టైటిల్ కు తగ్గట్టే క్షణం క్షణం టెన్షన్ తోనే సినిమా సాగి.. టెన్షన్ పెట్టేస్తుంది.