Teluguwishesh ఆటోనగర్ సూర్య ఆటోనగర్ సూర్య Autonagar Surya Review, Autonagar Surya Telugu Movie Review, Autonagar Surya Movie Review and Rating, Telugu Autonagar Surya Review, Autonagar Surya Movie Stills, Autonagar Surya Movie Trailer, Videos, Gallery, Wallpapers and more on Teluguwishesh.com Product #: 53859 2.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఆటోనగర్ సూర్య

  • బ్యానర్  :

    మాక్స్ ఇండియా ప్రాడక్షన్స్

  • దర్శకుడు  :

    దేవా కట్టా

  • నిర్మాత  :

    అచ్చిరెడ్డి

  • సంగీతం  :

    అనూప్ రూబెన్స్

  • సినిమా రేటింగ్  :

    2.52.5  2.5

  • ఛాయాగ్రహణం  :

    శ్రీకాంత్ నీరాజ్

  • ఎడిటర్  :

    గౌతంరాజు

  • నటినటులు  :

    నాగా చైతన్య, సమంతా, రాకూల్ ప్రీతి సింగ్, తదితరులు

Autonagar Surya Movie Review

విడుదల తేది :

27-06-2014

Cinema Story

ఒక బాంబ్ బ్లాస్ట్ తో సినిమా స్టోరీని మొదలుపెట్టి... అక్కడి నుంచి కట్ చేసి తిరిగి 1973 ఫ్యాష్ బ్యాక్ కి తీసుకెళతాడు. సూర్య (నాగచైతన్య) తన తల్లిదండ్రులతో కలిసి రైలులో ప్రయాణం చేస్తుండగా... ఆ ట్రైన్ లోనే వున్న కోటలింగం అనే వ్యక్తి గుర్తు తెలియని అమ్మాయిని రేప్ చేయబోగా.. దానిని ఆపడానికి సూర్య తండ్రి అతనిని అడ్డుకుంటాడు.

దాంతో కోటలింగం అతనిని, అతని భార్యని చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. చిన్నతనంలోనే తన అమ్మానాన్నలకు కోల్పోయిన సూర్య ఆటోనగర్ లో వున్న తన మావయ్య (సాయికుమార్) ఇంటికి చేరుకుంటాడు. మావయ్య కూడా తనను ఇంటినుంచి గెంటేయడంతో ఆ ఆటోనగర్ లోనే మెకానిక్ గా పనిచేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తాడు.

సూర్యకు 16 సంవత్సరాల వయస్సు వున్నప్పుడు.. గతంలో తన ఫ్రెండ్ ని ఎవరో చంపారన్న నెపంతో ఓ రౌడీని చంపి ఐదు సంవత్సరాల వరకు జైలుకెళ్తాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత తిరిగి ఆటోనగర్ ప్రాంతానికి చేరుకోగా... అక్కడ స్థితిగతులన్నీ మారిపోయి వుంటాయి.

ఆ ఆటోనగర్ ప్రాంతమంతా ఇంద్రన్న (జయప్రకాష్ రెడ్డి), మేయర్ అలియాస్ (ట్రెయిన్ లో సూర్య తల్లిదండ్రుల్ని చంపిన) కోటలింగం (మధు) అధీనంలో వుంటుంది. అది చూసి ఓర్చుకోలేని సూర్య, జయప్రకాష్ రెడ్డిపై తిరగబడతాడు. ఆ ప్రాంత జనాలందరినీ భరోసాని కల్పించి... గూండాలు, వడ్డీ వ్యాపార్తుల, రాజకీయ నాయకుల మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేయిస్తాడు.

దీంతో సూర్య ఆటోనగర్ లో ప్రజల మనిషిగా ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న మేయర్ (కోటలింగం), సూర్యను ఎదురించేందుకు రంగంలోకి దిగుతాడు. ఆ తరువాత సూర్యను వాళ్లను ఎలా ఎదుర్కుంటాడు. తన తల్లిదండ్రుల్ని చంపింది మేయరేనని తెలుసుకుంటాడా..? వారి మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడు అన్న దానిపై కథ మొత్తం నడస్తుంది.

cinima-reviews
ఆటోనగర్ సూర్య

‘‘ప్రస్థానం’’ వంటి కమర్షియల్ మూవీని తెరకెక్కించిన దేవాకట్టా... ఆ సినిమా అంతగా హిట్ కాకపోయినా, అతనికి మాత్రం మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈసారి కూడా అదే స్టోరీలైన్ తో కూడిన ఒక సీరియస్ సినిమాను కమర్షియలైజ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ... అది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అక్కడక్కడా కొన్ని పంచ్ డైలాగులతో మెప్పించినా.. అప్పుడప్పుడు కొంతవరకు బాగానే బోర్ కొట్టించాడు. చాలావరకు కథ మొత్తం ఔట్ డేటెడ్ లా అనిపిస్తుంది.

సినిమాలో అక్కడక్కడా అద్భుతమైన భారీ డైలాగులు, కొన్ని బలమైన సన్నివేశాలు వున్నా... సినిమా మొత్తాన్ని మూడ గంటల వరకు గొడవలు, ఫైటింగులతో నడిపి చాలా పెద్ద తప్పు చేశాడు దర్శకుడు. ఎక్కువగా విజయవాడ రౌడీయిజం - రాజకీయ నేపథ్యంలో కథను నడిపి అందరినీ బోర్ కొట్టేలా చేశాడు. అప్పుడప్పుడు కాస్త నవ్వుకునే సన్నివేశాలైనా వున్నాయా అంటే.... బ్రహ్మి క్యారెక్టర్ టోటల్ గా డిజాస్టర్! చైతూ - సమంతల లవ్ ట్రాక్ కొద్దిసేపటి వరకు బాగానే నడిపి... ఆ తరువాత పక్కన బెట్టేశారు.

మొదట్లో కథ నెమ్మదిగా సాగి... ఆ తరువాత యాక్షన్ సన్నివేశాలతో వేగం పుంజుకుంటుంది. ఈ సినిమాలో యూనియన్ ఆఫీస్ సీన్ ఒక పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఆ సీన్ లో దేవా కట్టా రాసిన డైలాగులు బాగానే పేలాయి. ఈ సినిమాలో చాలావరకు దేవాకట్టా రాసిన డైలాగులే సూపర్. దర్శకుడి కంటే రైటర్ గానే మంచి మార్కులు వేయించుకున్నాడు. అందులో ‘‘నేను తలపడేదెప్పుడూ నాతోనే. శవాలతో కాదు. నా దృష్టిలో భయపెట్టేవాడు, భయపడేవాడు ఇద్దరూ శవాలే’’ నన్న డైలాగ్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేసింది. అయితే కొన్ని డైలాగులు నాగచైతన్య కు సరిపోలేదనే చెప్పుకోవచ్చు.

ఇంటర్వెల్ తరువాత సినిమాలో ఆశించిన స్థాయికి చేరకపోగా... లెంగ్త్ ఎక్కువగా పెంచేశారు. క్లైమాక్స్ లో కూడా హీరో విలన్ చాలా సింపుల్ గానే చంపేస్తాడు. విలన్ క్యారెక్టర్ ని అవసరమైన దానికంటే ఓవర్ బిల్డప్ గా చూపించి, మైనస్ మార్కులు వేయించుకున్నాడు డైరెక్టర్. ఒక్క ఐటమ్ సాంగ్ మిగతా పాటలన్నీ అంతగా ఆకర్షించలేకపోయాయి.

Cinema Review


ప్లస్ పాయింట్స్ : నాగచైతన్య మొదటిసారిగా పక్కా మాస్ పాత్రను పోషించి, ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఇతని క్యారక్టరే. నటనలోనూ, డైలాగ్ డెలీవరిలోనూ చైతన్య అద్భుతమైన మెచ్యూరిటీని కనబరిచాడు. ముఖ్యంగా యూనియన్ ఎపిసోడ్ లో చైతన్య పర్ ఫెర్మాన్స్, డైలాగ్స్ సూపర్బ్. ఇక సమంత పాత్ర చాలా చిన్నదే అయినా.. తన లుక్స్ అండ్ పెర్ ఫార్మెన్స్ ఆడియెన్స్ ని మెప్పించింది. సమంత - చైతన్య మధ్య వున్న లవ్ సీన్స్ కూడా చాలా బాగానే వచ్చాయి. ఇక చైతన్య ఫ్రెండ్ గా నటించిన ఈ సినిమాలో నందు కూడా తన ముఖ్యమైన పాత్రలో బాగానే ప్రదర్శించాడు. సాయికుమార్ కూడా అమాయకుడిలా అందరిని మెప్పించాడు. మెయిన్ విలన్ గా మధు తన పర్ ఫెర్మాన్స్ తో హీరోకు గట్టి పోటీనే ఇచ్చాడు. ఇక జయప్రకాష్ రెడ్డి, అజయ్, ఇంకా తదితరులు తమతమ పాత్రలకు సరియైన న్యాయం చేశారు. ఇంటర్వెల్ కు 20 నిముషాల ముందు, క్లైమాక్స్ సమయాల్లో కొన్ని కామెడీ సీన్స్ అందరినీ బాగానే నవ్వించాయి.

మైనస్ పాయింట్స్ : దేవాకట్టా రాసుకున్న కంటెంట్ లో హీరోని అంతగా ఎలివేట్ చేయలేకపోయాయి. ఫస్ట్ హాఫ్ చూడటానికి మోస్తరుగా బాగున్నా... సెకాండాఫ్ లో స్టోరీ పెద్ద బోర్ కొట్టడమే కాకుండా పాటలు కూడా విసుగు తెప్పిస్తాయి. ఏదో కామెడీ పండించాలని బ్రహ్మానందం, వేణుమాధవ్ లను పెట్టివా... వారి మేజిక్ కూడా ఏమీ లేదు. రన్ టైమ్ బాగా పొడిగించేసి, ప్రేక్షకులకు సహన పరీక్ష పెట్టారు. ఇక స్ర్కీన్ ప్లే కూడా ఊహాజనితంగా వుంటుంది.

 

సాంకేతిక వర్గం పనితీరు:

అనూప్ రూబెన్స్ పాటలు ఈ సినిమాలో అంతగా బాగలేకపోయినా... రీరికార్డింగ్ విషయంలో, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో బాగానే అలరించాడు. శ్రీకాంత్ నరోజ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు అంతగా హెల్ప్ అవ్వలేదు. ఎడిటింగ్ విషయంలో గౌతంరాజు కూడా బాగానే విఫలం అయ్యాడు. దేవాకట్టా డైలాగులతో మాటలతూటాలు పేల్చినా... కొన్ని చోట్లా విఫలమయ్యాయి. నిర్మాణానికి ఎటువంటి ఢోకా లేకుండా బాగానే ఖర్చు చేశారు.

చివరగా :

సినిమాలో యాక్షన్లతో కూడిన మంచి సన్నివేశాలు ఎక్కువగా వున్నాయి కాబట్టి మాస్ ప్రేక్షకులకు బాగానే నచ్చుతుంది. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలావరకు బోర్ కొట్టిస్తాయి. ఏదేమైనా నాగచైతన్య ఆటో రివర్స్ గేర్ లో పడిపోయినట్టే!