Teluguwishesh అనామిక అనామిక Get Information on Anamika Telugu Movie Review, Anaamika Review, Anamika Movie Review, Anaamika Rating, Directed by Sekhar Kammula, Starring Nayantara, Vaibhav Reddy, Anamika Movie Stills, Anamika Trailer, Videos and more. Product #: 52295 2.75/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    అనామిక

  • బ్యానర్  :

    ఎండేమోల్ ఇండియా లాగ్ లైన్ ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    శేఖర్ కమ్ముల

  • సంగీతం  :

    ఎం.ఎం. కీరవాణి

  • సినిమా రేటింగ్  :

    2.75/52.75/5  2.75/5

  • ఛాయాగ్రహణం  :

    విజయ్ సి. కుమార్

  • ఎడిటర్  :

    మార్తాండ్ కె. వెంకటేష్

  • నటినటులు  :

    నయనతార, పశుపతి, హర్షవర్దన్ రానె

Anaamika Movie Review

విడుదల తేది :

మే 1 2014

Cinema Story

అనామిక (నయనతార) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కొన్ని రోజుల క్రితం తన భర్త అజయ్ శాస్త్రి (హర్షవర్థన్ రాణె ) తప్పిపోవడంతో అతన్ని వెతుక్కుంటూ అమెరికాలో ఉన్న ఆమె ఇండియాకు వచ్చి, తన భర్త ఆచూకీ తెలియడం లేదని పాతబస్తీలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుంది. అజయ్ శాస్త్రి ఆచూకీ తెలుసుకోవడానికి ఎస్..గా పనిచేసే సారథి (వైభవ్ ) సాయ పడుతుంటాడు. కానీ తన భర్తకు తీవ్రవాదులతో సంబంధం ఉందని ఉన్నతాధికారి అయిన (పశుపతి) ఆరోపిస్తాడు. తన భర్తకు ఏ పాపం తెలియదని, అతనికి ఎవరితో సంబంధం లేదని నిరూపించడానికి నానా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి ? చివరకి అజయ్ శాస్త్రి ని అనామిక కలుస్తుందా ? లేదా అన్నదే ఈ చిత్రం కథ.

cinima-reviews
అనామిక

ఇప్పటి వరకు తెలుగులో స్ట్రయిట్ ఫార్వర్డ్ యూత్ ఫుల్ చిత్రాలు తెరకెక్కించిన శేఖర్ కమ్ముల మొదటి సారిగా హిందీ లో మంచి విజయాన్ని సాధించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కహానీ ’ చిత్రాన్ని ఎంతో సాహసం చేసి కథలో చాలా మార్పులు చేసి తెరక్కించాడు. హిందీలో విద్యాబాలన్ విర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా అవార్డులు కూడా సంపాదించుకున్న ఈచిత్రంలో నయనతార కీలక పాత్ర పోషించింది. నయనతార నటన, శేఖర్ కమ్ముల దర్శకత్వం తెలుగు ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకుందో ఈ చిత్రం రివ్యూ ద్వారా తెలుసుకుందాం

ఎప్పుడు సొంత కథలతోనే డైరెక్ట్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల బాలీవుడ్ ‘కహానీ ’ చిత్రాన్ని ఎంతో సాహసం చేసి తీసినా, హిందీ చిత్రాన్ని చూసిన వారు రకరకాల పోలికలు పోల్చడం సహజం. కహానీ చిత్రాన్ని పూర్తిగా మరచిపోయి ‘అనామిక ’ ను చూద్దామన్న సాధ్యపడదు. ఎందుకంటే విద్యాబాలన్ నటన, సస్పెన్స్, కొన్ని సన్నివేశాలు ఆ చిత్రాన్ని అంత తొందరగా మరచిపోలేనివ్వవు. విద్యాబాలన్ గర్భవతిగా నటిస్తే... అనామికలో నయనతార కష్టాల్లో ఉన్న ఓ యువతి పాత్రలో నటించింది. అయితే విద్యాబాలన్ పాత్రపై కలిగే సానుభూతిని తెరమీద అనామిక పాత్రకు కల్పించడంలో దర్శకులు కొంత సఫలం కాలేదనే చెప్పవచ్చు.

తొలిభాగం కథను చాలా నెమ్మదిగా నడిపించిన శేఖర్ కమ్ముల.. క్లైమాక్స్ లో విజృంభించాడనే చెప్పవచ్చు. థ్రిల్లర్ సినిమాలో ఉండే పక్కా స్క్రీన్ ప్లే, ఇంట్రస్ట్ కలిగించే సన్నివేశాలు.. ఏం జరుగబోతుందనే టెన్సన్ ను కలిగించడంలో దర్శకుడు కొంత తడబాటుకు గురయ్యాడు. కొన్ని పాత్రల విషయంలో అనేక సందేహాలను రేకేత్తించారు. కహానీ కథలో మార్పులు చేసినా కానీ అవి మరీ ఆ చిత్రాన్ని మరిపించే స్థాయిలో అయితే లేవు. ఆ సినిమాలో మాదిరిగా ఇందులోను ఏదో ఒక ట్విస్ట్‌ ఉంటుందనేది ముందే ఊహించవచ్చు.

ఇది వరకు కహాని చూడని ప్రేక్షకుడు అనామికను చూస్తే ఓ డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది. కహాని చూసిన వారికి మాత్రం ఆ సినిమా అంత థ్రిల్ అనిపించకపోవచ్చు. కానీ సదరు తెలుగు ప్రేక్షకుడికి రొటీన్ సినిమాలకు భిన్నమైన సినిమా చూశామనే ఫీల్ కలుగుతుందని మాత్రం చెప్పవచ్చు.

Cinema Review

నయనతార చాలా సీనియర్ మోస్ట్ నటి. ఎలాంటి పాత్రల్ని అయినా సులభంగా, పాత్రకు తగ్గట్లు పోషించే ఆమె అనామికగా చాలా బాగా నటించింది. ఇప్పటి వరకు ఆమె పోషించిన పాత్రల్లో ఇదో భిన్నమైన పాత్ర. ఈ సినిమాలో ఆమె నటనకు ఎలాంటి వంకలు పెట్టలేము. భర్త కోసం వెతుక్కుంటూ వచ్చే ఓ మహిళ పడే మానసిక సంఘర్షణ కళ్ళకు కట్టింది. ఇక అనామికకు సహాయపడే పాత్రలో వైభవ్ చాలా సింపుల్ గా నటించి మెప్పించాడు. సినిమా మొత్తానికి నయనతారే ప్రధానం కావడంతో మిగతా నటీనటులు వారి పాత్రలకు తగ్గట్లు పోషించి ఫర్వాలేదనిపించారు.

కళాకారుల పనితీరు

యాక్షన్ , థ్రిల్లర్ సినిమా అనగానే మనకు గుర్తొచ్చేది బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఫుల్ లెన్త్ పాటులు లేని ఈ సినిమాలో కీరవాణి ఎఫర్ట్ మొత్తం బ్యాక్ గ్రౌండ్ స్కోరుకే పెట్టాడని చెప్పవచ్చు. చిన్న చిన్న సన్నివేశాలను కూడా చాలా ఎలిమినేట్ చేసి చూపించాడు. సినిమాటోగ్రఫీ విషయంలో విజయ్ కుమార్ తన స్మార్ట్ వర్క్ తో ఆకట్టుకున్నాడు. ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా చూపించాడు. ఇక ఎడిటింగ్ కి సెకండాఫ్ లో పని చెప్పి, ఓ టెంపో మెయింటేన్ చేసిన మార్తాండ్ వెకంటేష్ ఫస్టాఫ్ విషయంలో  అది మెయింటేన్ చేయలేక పోయాడు.

ఇక ప్రముఖ రచయిత యండమూరి, దర్శకుడు శేఖర్ కమ్ముల కలిసి ఓ సూపర్ డూపర్ హిట్ హిట్ సినిమా కథను తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లు మార్పి, కొత్త ట్విస్టులు ఇవ్వాలనుకోవడం పెద్ద సాహసమే అవుతుంది. కథలో కొత్త ట్విస్టులు ఏమీ ఇవ్వకపోయినా, రొమాంటిక్ యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కించడంలో కొంత వరకు సఫలం అయ్యాడనే చెప్పవచ్చు. స్టోరీ పరంగా ఫస్టాఫ్ ను నత్త నడకన నడిపించిన ఆయన ద్వియార్థం మాత్రం ఉత్కంఠ కలిగించే విధంగా, కథలో వేగం పెంచి తన ప్రతిభను చాటుకున్నాడు.