Teluguwishesh లడ్డూ బాబు లడ్డూ బాబు Laddu Babu Telugu Movie Review, Laddu Babu Review, Laddu Babu Movie Review, Allari Naresh Laddu Babu Review, Laddu Babu Rating, Laddu Babu Movie Review and Rating, Laddu Babu Movie Stills, Laddu Babu Movie Trailer, Teaser, Videos, Laddu Babu Movie Gallery, Laddu Babu Movie Songs, Laddu Babu Movie Talk, Laddu Babu Movie Directed by Ravi Babu, Starring Allari Naresh, Bhoomika Chawla. Product #: 51801 2.25./5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    లడ్డూ బాబు

  • బ్యానర్  :

    మహారథి ఫిల్మ్స్

  • దర్శకుడు  :

    రవి బాబు

  • నిర్మాత  :

    రాజేంద్ర

  • సంగీతం  :

    చక్రీ

  • సినిమా రేటింగ్  :

    2.25./52.25./5  2.25./5

  • నటినటులు  :

    అల్లరి నరేష్ , భూమిక చావ్లా

Laddu Babu Movie Review

విడుదల తేది :

ఏప్రిల్ 18, 2014

Cinema Story

లడ్డూ బాబు (అల్లరి నరేష్) మామూలు మనిషిలా సన్నగానే ఉండేవాడు. కానీ అతనికి ఆప్రికాకు చెందిన ఓ దోమ కుట్టడం వల్ల లావుగా తయారవుతాడు. ముష్టి కిష్ణయ్య ( కోట శ్రీనివాసరావు) లడ్డూ బాబుకు పెళ్లి చేసి, తన పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తిని అమ్మేసి గోవా చెక్కేసి అక్కడ స్థిర పడాలనుకుంటాడు. అందుకోసం ముష్టి కిష్ణయ్య  చాలా పెళ్లి సంబధాలు చూసినా ఏం లాభం ఉండదు. ఓ రోజు లడ్డూబాబు (పూర్ణ) మాయను చూసి ప్రేమలో పడతాడు. కొడుకుకు పెళ్లి చేయాలని చేసిన ప్రయత్నాలన్ని బెడిసి కొట్టడంతో విసిగిపోయిన కిష్ణయ్య.. లడ్డూని ఇంట్లోంచి తరిమివేస్తాడు. ఇంట్లోంచి వీధిలోకి వచ్చిన లడ్డుబాబుని మూర్తి (అతుల్) అనే పది పన్నెండేళ్ల మధ్య వయస్సు ఉన్న కుర్రాడు చేరదీసి.. తన ఇంటికి తీసుకుపోతాడు. మూర్తి తల్లి (భూమిక) తో లడ్డూ బాబు బాగా కలిసి పోతాడు. ఈ నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనతో ఆ కుటుంబానికి దూరం అవుతాడు. లడ్డూబాబు ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు ?  కిష్ణయ్య తన ఆస్తిని అమ్ముకుంటాడా ? అన్నది తెర మీద చూడాల్సిందే.

cinima-reviews
లడ్డూ బాబు

అప్పుడెప్పుడో వచ్చిన అల్లరి సినిమాతో హీరోగా నరేష్, దర్శకుడిగా రవిబాబు ఎంట్రీ ఇచ్చి, ఆ సినిమాతో తమకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న వీరిద్దరు చాలా రోజుల తరువాత మళ్ళీ జత కట్టారు. రవిబాబు ఆ సినిమా తరువాత కామెడీ జోనర్ నుండి థ్రిల్లర్ సినిమాల వైపు వెళ్లి వాటిని హలీవుడ్ స్టైల్లో తీసి సక్సెస్ అయ్యాడు. అల్లరి నరేష్ పూర్తి స్థాయి కామెడీ చిత్రాలతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ చాలా రోజు నుండి సరైన హిట్టు లేక సతమతం అవుతున్న నరేష్, ‘అవును ’ సినిమా తరువాత ఆశించినంత ఫలితాన్ని రాబట్టుకోలేక పోతున్న రవిబాబు పూర్తి స్ధాయి కామెడీ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సారి రవిబాబు చేసిన ప్రయోగం ఏ మాత్రం ఫలితాన్ని ఇచ్చిందో ఈ సినిమా రివ్వూ ద్వారా చూద్దాం.


రవి బాబు గత చిత్రాల్లో చిన్న పాయింట్ నే తీసుకొని దాన్ని ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకులకు చూపించే ఆయన, ఈ సారి సిల్లీ పాయింట్ ని తీసుకొని నవ్వించాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. పూర్తి స్థాయి కామెడీ చిత్రంగా మొదటి నుండి చెప్పుకొస్తున్న దర్శకుడు ఓవో కొన్ని సీన్స్ ని పెట్టి సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ చేసుకున్నాడు తప్పితే... ఆ సినిమాలో అస్సలు కామెడీనే లేదు. నాసిరకం రచయితతో సంభాషణలు రాయించి, నరేష్ భారీ కాయంతోనే సినిమాను నడిపించేయాలనున్న రవిబాబు పని తనం చూస్తే ఈ సినిమా పై ఏ మాత్రం మనస్సు పెట్టలేదని తెలుస్తుంది. 

ఏదైనా కష్టం వచ్చినప్పుడు కళ్లు మూసుకుని మనకి జరిగిన మంచిని తలచుకుంటే మనసు ప్రశాంతంగా అయిపోతుందని ఇందులో చెప్పారు. మీరు గనుక సినిమాకు వెళితే... అల్లరి నరేష్ గత సినిమాల కామెడీనీ ఊహించుకొని బయటకు వచ్చేయండి.  లడ్డుబాబుని చూసి నవ్వుకుందామని థియేటర్ కు వెళ్లిన కామెడికి బదులు ఎక్కువ మోతాదులో విషాదానే పంచాడని చెప్పవచ్చు.

Cinema Review

ప్రతి పాత్రను ఎంతో సునాయాసంగా పాత్రకు తగ్గట్లు పోషించే అల్లరి నరేష్ ఈ చిత్రం మేకప్ కోసం చాలా కష్టపడ్టట్లున్నాడు. మేకప్ లో భాగంగా ముఖాన్ని మొత్తం సీల్ చేసేసిన దర్శకుడు, దాని వెనక నరేష్ ఎలాంటి హావ భావాలు పలికించాడనేది ప్రేక్షకులకు అస్సలు తెలియలేదు. దీంతో నరేష్ నవ్వించాలన్న ప్రయత్నం వ్రుధా అయిపోయింది. చాలా రోజుల తరువాత వెండితెర పై ఓ విడో క్యారెక్టర్ లో నటించిన భూమిక తన వయస్సుకు తగ్గ పాత్రలో కనిపించి ఫర్వాలేదనిపించింది.

మరో హీరోయిన్ పూర్ణ పెద్దగా చేసింది ఏమీ లేదు. లడ్డూబాబుకి తండ్రి పాత్ర పోషించిన కోటా శ్రీనివాసరావు గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంది. గతంలో పోషించిన పిసినారి నటనతో ప్రేక్షకుల్ని కుడుపుబ్బా నవ్వించిన ఆయనతో దర్శక, రచయితలు నవ్వించలేక పోయారంటే... వారి పనితీరుకే వదిలేయాలి. మిగతా వారి గురించి పెద్దగా మాట్లాడుకోవాల్పింది ఏమీ లేదు.

సాంకేతిక విభాగం :

మెలోడీ సాంగ్స్ ని బాగా అందించే చక్రీ ఈ సినిమాకు అందించిన సంగీతం వినసొంపుగా లేదు. నేపధ్య సంగీతం కూడా అస్సలు బాగో లేదు. ఇక ఆయన పాడిన పాట చక్రీ పాడిన ఓ పాట విసుగు తెప్పించేలా ఉంది. పాట చిత్రీకరణలో రవిబాబు తన స్పెషాలిటీని చాటుకోవాలని చూసినా సంగీతం అడ్డుగా నిలిచింది. ఛాయా గ్రహణం ఓ మాదిరిగా ఉండి, ఫర్వాలేదనిపిస్తుంది.

లడ్డూబాబుకు శరీరంలో ఎంత వేస్టేజ్ ఉందో అంత ఈ సినిమాలో అనవసరపు సీన్లు ఉన్నాయి. ఎటిటర్ వాటిని ఎడిట్ చేయకుండా వదిలేసి, తన పని ఇంతే అని చేతులు దులిపేసుకున్నాడు. కథలో బలం లేకపోవడం, కథనం పేలవంగా ఉండటంతో రవిబాబు ఎంత కామెడీ చేద్దామని ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. హాలీవుడ్ హంగులద్ది ఢిపరెంట్ సినిమాలు తీసే రవిబాబు...ఈ సినిమా ఆయన అట్టర్ ప్లాప్ లిస్టులో చేరిపోతుంది.