Teluguwishesh రేసు గుర్రం రేసు గుర్రం Race Gurram Telugu Movie Review, Race Gurram Review, Race Gurram Rating, Race Gurram Movie Review, Race Gurram Movie Review and Rating, Allu Arjun Race Gurram Review, Race Gurram Movie Directed by Surender Reddy, Starring Allu Arjun, Shruti Haasan, Race Gurram Movie Stills, Race Gurram Movie Posters, Race Gurram Movie Gallery, Race Gurram Movie Trailers, Videos, Teasers and more on teluguwishesh.com Product #: 51627 3.25/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రేసు గుర్రం

  • బ్యానర్  :

    శ్రీ లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    సురేందర్ రెడ్డి

  • నిర్మాత  :

    నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జీ)

  • సంగీతం  :

    ఎస్.ఎస్. థమన్

  • సినిమా రేటింగ్  :

    3.25/53.25/53.25/5  3.25/5

  • ఛాయాగ్రహణం  :

    మనోజ్ పరమహంస

  • ఎడిటర్  :

    గౌతమ్ రాజ్

  • నటినటులు  :

    అల్లు అర్జున్ , శ్రుతిహాసన్, శ్యామ్, సలోని తదితరులు

Race Gurram Movie Review

విడుదల తేది :

ఏప్రిల్ 4, 2014

Cinema Story

లక్కీ(అల్లు అర్జున్ ) జాబ్ లేకుండా జులాయిగా తిరుగుతూ అమెరికా వెళ్లడానికి వీసా కోసం వెయిట్ చేస్తుంటాడు.  అతని అన్న రామ్ (కిక్ శ్యామ్ ) పోలీస్ ఆఫీసర్. ఈ ఇద్దరన్నదమ్ములు క్షణం కూడా కలిసి ఉండరు. చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతుంటారు. ఓ రోజు లక్కీ స్పందన (శ్రుతి హాసన్ ) ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అనుకోని విధంగా అన్నకి మినిస్టర్ (రవికిషన్ ) నుంచి థ్రెట్ ఎదురు అవుతుంది. అప్పుడు తన అన్నని తన తెలివితో ఆ సమస్య నుంచి ఎలా బయిటపడేసాడన్నదే ఈ రేసుగుర్రం కథ.

cinima-reviews
రేసు గుర్రం

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రేసుగుర్రం ’ సినిమాను  ఇప్పటికే పలుమార్లు  వాయిదా వేసి, ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘కిక్, ఊసరవెల్లి ’ చిత్రాలతో స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు ఓ భారీ హిట్టు కోసం ప్రయత్నించిన సినిమా ‘రేసుగుర్రం ’. ఇద్దరమ్మాయిలతో సినిమా అంతంత మాత్రంగానే ఆడటం, దర్శకుడిగా ‘ఊసరవెల్లి ’ సినిమా అనుకున్న ఫలితాన్ని సాధించక పోవడంతో ఇద్దరు ఎంతో కసితో ఈ సినిమాను చేశారు.

ఫన్, స్టైల్, యాక్షన్ కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చెప్పుకొస్తున్న దర్శకుడు సురేందర్ రెడ్డి ఆ మాటలను ఎంత వరకు నిజం చేశాడు. ఈ సినిమాను వెండి తెర పై రేసులో ఉన్న గుర్రంలా పరిగెత్తించాడా లేదా అన్నది ఈ సినిమా రివ్వూ ద్వారా చూద్దాం.

Cinema Review

టాలీవుడ్ లో స్టైలిష్ట్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ నటన గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కథను అంతా బన్నీ తన భుజాల పై వేసుకొని లాక్కొచ్చాడు. కామెడీ, యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు. ప్రతి సీన్ లో పూర్తి ఎనర్జీని ఉపయోగించి చేశాడు. పాత్ర, ఎమోషన్స్ లో చాలా చక్కగా చేశాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కొద్దిసేపు కనిపించినా సూపర్బ్ గా చేశాడు.

అల్లు అర్జున్ చేసే అల్లరి మన ఇంట్లో చిన్న పిల్లల అల్లరి గుర్తుకు తెస్తుంది. అల్లు అర్జున్ సరసన తొలిసారి నటించిన శ్రుతి హాసన్ స్పందనగా...ఎమోషన్స్ ని ఓపెన్ గా చెప్పని పాత్రలో శృతి హాసన్ బాగా నటించింది. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ తన గ్లామర్ ని వెండి తెరపై శ్రుతి మించి  ప్రవహింపజేసింది. కామెడీ పాత్రల్లో బ్రహ్మానందం, అలీ మరోసారి తమ విశ్వరూపం చూపించారు.

సెకండాప్ లో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. కిల్ బిల్ పాండేగా దాదాపు ఇరవై నిముషాలు పాటు థియేటర్లో నవ్వులు కురిపించాడు. భోజపురి సూపర్ స్టార్ రవికిషన్ ఈ చిత్రంతో విలన్ గా పరిచయమయ్యాడు. శివారెడ్డి గా ఆయన ఫెరఫెక్ట్ గా మాచ్ అయ్యాడు.

సినిమాలోని మిగతా పాత్రల్లో తణికెళ్ల భరణి, ప్రగతి,ఎమ్ఎస్ నారాయణ, పవిత్ర, రఘుబాబు వంటి వారు ప్రత్యేకంగా చేసిందేమీ లేకపోయినా,తాము చేసిన పాత్రకు న్యాయం చేసారు. సలోని గురించి పెద్ద చెప్పుకోవటానికి ఏమీ లేదు. పోసాని పాత్రకు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. సురేంద్ర రెడ్డి మరోసారి తనలోని కామెడీ పంచ్ ఈ సినిమా ద్వారా రుచి చూపించారు.

సాంకేతిక విభాగం :

తొలిసారి అల్లు అర్జున్ సినిమాకు సంగీతం అందించిన థమన్ మాస్ పాటలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. కొన్ని పాటలు వినసొంపుగా లేదు. ఆడియో కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదర గొట్టాడు. థమన్ మాస్ బీట్ కి బన్నీ అదిరే స్టెప్టులు వేశాడు. కొరియోగ్రఫీ బాగుంది. ఇక ఈ సినిమాకు ఛాయగ్రహాణం అందించిన మనోజ్ పరమహంస చాలా క్లాస్ గా రిచ్ గా ఉంది. ఒకరకంగా సినిమాకు ఇది చాలా ప్లస్ పాయింట్. ప్రతి సీన్ ని, సాంగ్ ని బాగా చూపించాడు. ఎడిటింగ్ ఫస్టాఫ్ లో కంటే సెకండాఫ్ షార్ప్ గా ఉంది. పంచ్ డైలాగులు, కామెడీ పంచ్ లు బాగా పేలాయి.