Teluguwishesh హార్ట్ ఎటాక్ హార్ట్ ఎటాక్ Heart Attack Telugu Movie Review, Heart Attack Movie Review, Heart Attack Movie Review and Rating, Puri Jagannadh Heart Attack Review, Telugu Heart Attack Movie Review, Heart Attack Review, Heart Attack Movie Stills, Heart Attack Movie Wallpapers, Heart Attack Movie Posters, Heart Attack Movie Trailers, Videos, Heart Attack Audio Songs, Heart Attack Telugu Review and more on teluguwishesh.com Product #: 49875 2.75/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    హార్ట్ ఎటాక్

  • బ్యానర్  :

    పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్

  • దర్శకుడు  :

    పూరీ జగన్నాథ్

  • నిర్మాత  :

    పూరీ జగన్నాథ్

  • సంగీతం  :

    అనూప్ రూబెన్స్

  • సినిమా రేటింగ్  :

    2.75/52.75/5  2.75/5

  • ఛాయాగ్రహణం  :

    అమూల్ రాథోడ్

  • ఎడిటర్  :

    ఎస్.ఆర్. శేఖర్

  • నటినటులు  :

    నితిన్, ఆదా శర్మ

Heart Attack Telugu Movie Review

విడుదల తేది :

జనవరి 31 2014

Cinema Story

వరుణ్ ( నితిన్ ) ఓ ట్రావెలర్. తనవాళ్ళంటూ ఎవరు ఉండకపోవడంతో సరదా కోసం దేశ విదేశాలు తిరుగుతుంటారు. జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా ఎంజాయ్ చేస్తున్న ఇతను ఓ సారి స్పెయిన్ వెళతాడు. అక్కడ హయావతి (ఆదాశర్మ) ను చూసి ఇష్టపడతాడు. ఆమెను ప్రేమించకుండా ఓ ముద్దు ఇమ్మంటూ వెంట పడుతూ ఉంటాడు. వరుణ్ బాధ పరించలేక ఛీ కొడుతుంది. కానీ ఓ చిన్న సంఘటనతో హయావతి మనస్సు గెలుచుకొకుంటాడు. అప్పటి నుండి వరుణ్ ని గాఢంగా ప్రేమిస్తుంది. వ‌రుణ్ కోరుకొన్న ముద్దు ఇచ్చేసి - ఇంకెప్పుడూ నాకు క‌నిపించ‌కు.. పో అంటుంది. వ‌రుణ్ కూడా మ‌రో చోటికి వెళ్లిపోతాడు. . కానీ ఆమెని తాను ప్రేమించిన విషయాన్ని తెలుసుకుని వరుణ్‌ వచ్చేలోగా ఆమెకి వేరే వాడితో పెళ్లి ఫిక్స్‌ అవుతుంది. చివరికి వీరిద్దరు ఎలా కలుస్తారనేది తెర పైన చూడాల్సిందే.

cinima-reviews
హార్ట్ ఎటాక్

ప్రముఖ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ రీసెంట్ సినిమాల హిట్ గ్రాఫ్ ఏమీ లేదు. అయినా ఈ దర్శకుడు అంటేనే ఓ క్రేజ్. అలాంటి దర్శకుడు గత రెండు చిత్రాలతో ఫాస్ట్ ట్రాక్ లోకి వచ్చిన నితిన్ తో ‘హార్ట్ ఎటాక్ ’ సినిమా చేశాడు. ఈ సినిమాతో నితిన్ హ్యాట్రిక్ కొట్టాలనే ఆశతో ఉంటే, ఈ చిత్రంతోనైనా విజయ పథంలోకి రావాలని చూశాడు పూరీ. ఒకరు ప్లాప్ లో, మరొకరు ఫామ్ లో ఉన్న వీరిద్దరి కాంబినేషనల్లో వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ‘హార్ట్ ’ పై ఎటాక్ చేసిందో  ఈ రివ్యూ ద్వారా చూద్దాం.

పూరీ జగన్నాథ్ సినిమా అంటే ఒకప్పుడు ఎక్స్ పెక్ట్ చేయని కథలు, ఎంటర్ టైన్ మెంట్ ఉండేవి. కానీ గత కొంత కాలం నుండి సాదా సీదా కథలు రాసుకుంటూ తనకు ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీసి జనాల పై వదులుతున్నాడు.  దాంతో అతని ట్రాక్ రికార్డ్ గ్రాఫ్ వెనక్కి వెళ్ళినా, అతని సినిమాలంటే ఇప్పటికీ ఎక్జయిట్ మెంట్ ఉంటుంది జనాల్లో. ‘ఇద్దరమ్మాయిల ’తో తరువాత కాస్తంత టైం తీసుకొని హిట్టు కొట్టాలని మంచి ఫాంలో ఉన్న నితిన్ తో సినిమా చేశాడు. కానీ సాదాసీదా స్టోరీలైన్ తో తనదైన శైలిలో చూపించాడంతే.

కానీ హీరో, హీరోయిన్ ఎంట్రీ, లవ్ స్టోరీ మాత్రం మరీ మూస ధోరణిలో కాకుండా, బోర్ కొట్టకుండా చూపించాడు. ఫస్టాఫ్ లో భారీ యాక్షన్ సీన్స్, కాస్తంత కామెడీ ట్రాక్,  కాస్తంత లవ్ స్టోరీ పెట్టి ముగించాడు. సెకండాఫ్ లో అయినా ట్విస్టులు ఏమైనా ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తాడని అనుకుంటే రొటీన్ గా ఊహించినట్టుగానే హీరో తనకి హీరోయిన్‌పై ఉన్న లవ్‌ని రియలైజ్‌ కావడం, అతను ఆమెని వెతుక్కుని వచ్చేసరికి విలన్‌ ఎదురవడం జరిగిపోతాయి. అలాంటి గంద‌ర‌గోళాల జోలికి వెళ్లకుండా కథను సాదా సీదాగా నడిపించాడు.

Cinema Review

గత రెండు చిత్రాల హిట్ జోష్ లో ఉన్న హీరో నితిన్ పూరీ సినిమాలో క్యారెక్టర్ ని ఈజీగా చేశాడు. ట్రావెలర్ గా నితిన్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో, జుట్టు పిలకతో ఢిపరెంటుగా కనిపించి అలరించాడు. చేసే ప్రతి సీన్ చాలా కాన్ఫిడెంట్ గా చేశాడు. డాన్సులు వేసే అవ‌కాశం పెద్దగా రాలేదు. మొత్తంగా చూస్తే నితిన్ కొత్తగా ఫర్వాలేదనిపించాడు. అదా శర్మ పర్‌ఫార్మెన్స్‌ బాగుంది.  అందంగా క‌నిపించింది. ఎప్పుడూ సీరియ‌స్ లుక్ లోనే ద‌ర్శన‌మిస్తుంది. ఎమోష‌న్స్ సీన్స్ లో ఓకే. ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమా హీరోయిన్ కి కావ‌ల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి.

విలన్‌ రోల్‌ చేసిన ఖాన్‌ పెద్దగా నటించినట్లు అనిపించదు. బ్రహ్మానందం అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. అలీ క్యారెక్టర్‌ కథలో రోల్‌ ప్లే చేసినా గత చిత్రాల్లో లాగా ఇందులో కామెడీకి పెద్ద స్కోప్ ఇవ్వలేదు. ఎప్పుడు బ్రహ్మీని, ఆలీని ఫుల్లుగా వాడుకునే పూరీ ఇందులో వారికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మిగిలిన నటులంతా ఎవరి పరిధిలో వారు చేసి మమా అనిపించారు.

సాంకేతిక విభాగం :

నితిన్ గత రెండు చిత్రాలకు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి వాటంత రేంజ్ లో ఇవ్వలేడని చెప్పవచ్చు. రెండు పాటలు మాత్రమే వినడానికి బాగున్నాయి. మిగతావి సో..సోగా ఉన్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ ఫర్వాలేదనిపిస్తుంది. అమూల్ రాథోడ్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్ ని చాలా రిచ్ గా చూపించడంతో సక్సెస్ అయ్యాడు. శేఖర్ ఎడిటింగ్ విషయంలో వందకు వంద శాతం మార్కులు కొట్టేశాడు. స్పెయిన్ లో చిత్రీకణ జరుపుకున్న ఈ చిత్రంలోని సీన్స్ చాలా కొత్తగా అనిపిస్తాయి.

తన సొంత బ్యానర్ లో సినిమాను నిర్మించిన పూరీ క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. స్ర్కీన్ ప్లే రోటీన్ గా ఉన్నా,  కథ, డైలాగుల విషయంలో పూరీ తన పూర్తి స్థాయి మార్కును అందులోక పోయాడు. కథలో డెప్త్ లేకుండా తన దర్శకత్వంతో లాగించేయాలని చూశాడు. అందులో సక్సెస్ కాలేదనే చెప్పాలి. దర్శకుడు. పాట‌ల్ని చిత్రీక‌రించిన విధానంలో పూరి మార్క్ క‌నిపించింది. యాక్ష‌న్స్ సీన్స్ కూడా ఆక‌ట్టుకొంటాయి.