Teluguwishesh ఎవడు ఎవడు Yevadu Telugu Movie Review, Yevadu Movie Review, Ram Charan Yevadu Movie Review, Yevadu Movie Review and Rating, Yevadu Movie Release Date, Yevadu Movie Stills, Yevadu Movie Working Stills, Yevadu Movie Trailer, Yevadu Movie Gallery, Yevadu Movie Wallpapers and more in Teluguwishesh.com Product #: 49493 3.25/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఎవడు

  • బ్యానర్  :

    శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్

  • దర్శకుడు  :

    వంశీ పైడిపల్లి

  • నిర్మాత  :

    దిల్ రాజు

  • సంగీతం  :

    దేవి శ్రీ ప్రసాద్

  • సినిమా రేటింగ్  :

    3.25/53.25/53.25/5  3.25/5

  • ఛాయాగ్రహణం  :

    శ్యామ్ కె. నాయుడు

  • ఎడిటర్  :

    మార్తాండ్‌ కె. వెంకటేష్‌

  • నటినటులు  :

    రామ్ చరణ్, శ్రుతి హాసన్, అమీ జాక్సన్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్

Yevadu Telugu Movie Review

విడుదల తేది :

జనవరి 12, 2014

Cinema Story

చరణ్ (రామ్ చరణ్) ఓ కాలేజీ స్టూడెంట్. సరదాగా అలా సాగుతున్న జీవితంలో తన స్నేహితుడు ఉండే కాలనీకి సంబంధించిన భూమిని ధర్మ(సాయి కుమార్) కబ్జా చేయాలని చూస్తాడు. దానికి సంబంధించిన గొడవల్లో తన స్నేహితుడు చనిపోతే ధర్మను ఎదిరించడానికి రంగంలోకి దిగుతాడు. తనకు అడ్డు వస్తున్నాడని రామ్ ని చంపేస్తాడు ధర్మ. సత్య(అల్లు అర్జున్), దీప్తీ (కాజల్) ప్రేమికులు. ధీరూభాయ్(రాహుల్ దేవ్) గూండా దీప్తిని ఇష్టపడతాడు. దీప్తిని దక్కించుకోవాలనే క్రమంలో ధీరుభాయ్ మనుషులు చేసిన ఎటాక్‌లో దీప్తి చనిపోగా, ముఖం కాలిపోయి, తీవ్ర గాయాలతో కొన ఊపిరితో ఉంటే చరణ్ తల్లి (జయసుధ) తన కొడుకును చూసుకోవడానికి సత్య ముఖానికి చరణ్ రూపురేఖల్ని అమర్చుతుంది. అలా జనాల్లోకి రామ్ గా బయటకు వచ్చిన సత్య దీప్తిని చంపిన వారిని మట్టుపెడుతంటాడు. దీంతో కథ సుఖాంతం అయిందనున్న తరుణంలో రామ్ ని చంపడానికి ప్రయత్నిస్తారు. అసలు చరణ్ ఎవరు ? చరణ్ గతం ఏమిటి ? రామ్ గా బయటకు వచ్చిన చరణ్ తన స్నేహితుడి కాలనీ వాసుల సమస్యను ఎలా తీర్చుతాడు అనేది తెరపైనే చూడాలి.

cinima-reviews
ఎవడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఎన్నో ఆశలతో బాలీవుడ్ లో అడుగు పెట్టి అదే సినిమాను ‘తుఫాన్ ’ గా తెలుగు లో రిలీజ్ చేసి పెద్ద పరాజయాన్ని ఎదురు చూసిన తరువాత తెలుగు ప్రేక్షకుల ముదుకు ‘ఎవడు ’గా వచ్చాడు. ఈ సినిమా గత సంవత్సరమే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన రాష్ట్రంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టేకలకు సంక్రాంతి రేసులో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్‌ చరణ్‌ హీరోగా, బృందావనం దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ ప్రత్యేక పాత్రతో మినీ మల్టీస్టారర్ గా రూపొందిన ఈ చిత్రంలో మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. మరి లేట్ గా వచ్చిన ఈ చిత్రం లేటెస్ట్ గా ప్రేక్షకుల్ని అలరించిదా ? లేదో ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం.


టాలీవుడ్ నమ్ముకున్న మాస్ ఎంటర్ టైనర్ నే దర్శకుడు వంశీ పైడిపల్లి నమ్ముకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.  బ్రుందావనం లాంటి క్లాస్ అండ్ రొమాంటిక్ చిత్రాన్ని తెరకెక్కించిన తరువాత తెలుగు సినిమాకు ఫర్ ఫెక్ట్ గా సరిపోయే రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాతో తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. ఆంగ్ల చిత్రం నుంచి ఇన్‌స్పయిర్‌ చక్కటి స్క్రీన్‌ప్లేతో పరిగెత్తించాడు. తొలి భాగంలో లాజిక్కుల దూరంగా.. రెండవ భాగంలో హింస మితిమీరినట్టు అనిపించినా, సినిమాని ఎక్కడ పైకి లేపాలో వంశీపైడిప‌ల్లి కనిపెట్టాడు. ఇద్దరున్నా వాళ్లు కేవ‌లం నామ‌మాత్ర‌మే శ్రుతిహాస‌న్ కంటే అమీజాక్సనే కాస్త బెట‌ర్ అనిపించింది. సాయికుమార్‌ని మ‌న‌వాళ్లు ఎందుకు వాడుకోలేక‌ పోతున్నారో అర్థం కావ‌డం లేదు. సంక్రాంతి సీజన్‌లో మాస్‌ జనం కోరుకునే అంశాలు ఉండడం, దీనితో పాటు వన్ సినిమా డివైడ్ టాక్ రావడంతో ఎవడు సినిమాకు కలెక్షన్ల విషయంలో ఢోకా లేదు. భారీ బడ్జెట్ తో తెర కెక్కించిన సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లడం ఖాయం అనిపిస్తుంది.

Cinema Review

రామ్ చరణ్ రచ్చ, నాయక్ సినిమాతో మాస్, యాక్షన్ హీరోగా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. దీంతో మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథలనే ఎంచుకుంటూ సేఫ్ జోన్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా మాస్ అండ్ యాక్షన్ తో మరోసారి ప్రేక్షకుల ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన స్టామినాని నిరూపించుకున్నాడు. ఇక డాన్స్ లు, ఎమోషన్స్ సీన్స్, ఫైట్స్  లో బాగా నటించాడు. గత రెండు సినిమాల్లో ఒకే ఫార్ములాను ఎంచుకున్న చరణ్ వీటి నుండి బయటకు వస్తే మంచిది. సత్య, చరణ్ పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు.

అల్లు అర్జున్ ఉన్నది కాసేపయినా ప్రేక్షకులను అలరించి మెప్పించాడు. శ్రీహరి స్థానంలో రీప్లేస్ అయిన సాయి కుమార్ విలన్ పాత్రలో బాగానే నటించిన కాస్తంత ఎక్జయిట్ అయ్యి చేశాడనిపించింది. కోట శ్రీనివాస్‌లు ఈచిత్రానికి మూలస్థంభాల్లా నిలిచారు. హీరో పాత్రను ఇమేజ్‌ను పెంచడానికి రాహుల్ దేవ్ బాగా సహకరించాడు. కారెక్టర్ ఆరిస్టుల్లో ఎల్‌బి శ్రీరాం మరోసారి గుర్తుండిపోయే పాత్రను చేశారు. దీప్తిగా కాజల్‌ది అతిధి పాత్ర అయినా.. మరికొంత సేపు కనిపిస్తే బాగుండేదనే ఫీలింగ్‌ను కలిగించింది. అతిధి పాత్రలో కాజల్ గ్లామరస్‌గా కనిపించింది. ఎమీ జాక్సన్ అందాల ఆరబోతకు పనికి వచ్చింది. ఇక చిత్ర సెకాండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చే శృతిహాసన్‌కు గ్లామర్‌తోపాటు యాక్టింగ్‌కు స్కోప్ ఉండే పాత్ర లభించింది. తన పాత్ర పరిధి మేరకు శృతిహాసన్ వందశాతం న్యాయం చేసింది. జయసుధ ఈ చిత్రానికి హైలైట్స్‌లో ఒకరిగా నిలిచారు.

 

కళాకారుల పనితీరు

ఈ సినిమాకు సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి మెగా హీరోలకు ఏ రేంజ్ లో సంగీతం అందిస్తాడో అదే రేంజ్ లో అందించి ప్రాణం పోశాడు. ముఖ్యంగా మూడు పాటలకు అదిరిపోయే సంగీతం అందించడమే కాకుండా, బ్యాక్ గ్రౌండ్ స్కోరు తో కవర్ చేశాడు. మెలోడి సాంగ్స్ బాగా కంపోజ్ చేసే దేవీ శ్రీ మాస్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోరులో తన పవన్ చూపించాడు.  కీలక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టెంపోను పెంచి సీన్స్ పై ఆసక్తి పెంచాడు. సినిమాలో చరణ్ డైలాగులు బాగా పేలాయి. అబ్బూరి రవి రాసిన సంభాషణలు కొన్ని బాగా పేలాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ కూడా ఓకే.  ఫోటోగ్రఫీ, ఫైట్స్ చిత్రానికి అదనపు ఆకర్షణ. బ్రుందావనం తరువాత మాస్ సినిమాను వంశీ పైడిపల్లి బాగానే హ్యాండిల్ చేశాడు. కథలో వేగం తగ్గకుండా, చక్కటి స్క్రీన్‌ప్లేతో పరిగెత్తించాడు.  ’ఎవడు’ చిత్రంలో అన్ని విభాగాలను బాలెన్స్ చేయడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.  ఇక దిల్ రాజు తన బ్యానర్ లో నిర్మించి సినిమాల విషయంలో ఎక్కడ రాజీ పడడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

 

more