Teluguwishesh బిరియాని బిరియాని Biriyani Telugu Movie Review, Karthi Biriyani Telugu Movie Review, Biriyani Telugu Movie Review and Rating, Biriyani Telugu Movie Songs, Biriyani Telugu Movie Stills, Biriyani Telugu Movie Trailers, Biriyani Telugu Movie Wallpapers and more on Teluguwishesh.com Product #: 49233 2.25/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    బిరియాని

  • బ్యానర్  :

    స్టూడియో గ్రీన్‌

  • దర్శకుడు  :

    వెంకట్‌ ప్రభు

  • నిర్మాత  :

    కె.ఈ. జ్ఞానవేల్‌రాజా

  • సంగీతం  :

    యువన్‌ శంకర్‌ రాజా

  • సినిమా రేటింగ్  :

    2.25/52.25/5  2.25/5

  • ఛాయాగ్రహణం  :

    శక్తి శరవణన్‌

  • ఎడిటర్  :

    ప్రవీణ్‌ కె.ఎల్‌, ఎన్‌.బి. శ్రీకాంత్‌

  • నటినటులు  :

    కార్తీ, హన్సిక, ప్రేమ్‌జీ, నాజర్‌, సంపత్‌, మధుమిత, రాంకీ తదితరులు

Biriyani Telugu Movie Review

విడుదల తేది :

డిసెంబర్‌ 20, 2013

Cinema Story

తమిళంలో, తెలుగులో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న సూర్య తమ్ముడు కార్తీ అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యాడు. తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్న కార్తీ తమిళంలో తాను నటించిన ప్రతి సినిమాను తెలుగులో విడుదల చేసి మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. కానీ గత కొంత కాలంగా ఈయన సినిమాలు తెలుగు ప్రేక్షకులను అంతగా అలరించలేకపోతున్నాయి. కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఈయన తాజాగా ప్రేక్షకుల ముందుకు ‘బిర్యాని ’ వడ్డించడానికి వచ్చాడు. మరి ఆ బిర్యానీలో అన్ని సమపాళ్ళలో కుదిరాయో లేదో ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం.

cinima-reviews
బిరియాని

తమిళంలో, తెలుగులో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న సూర్య తమ్ముడు కార్తీ అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యాడు. తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్న కార్తీ తమిళంలో తాను నటించిన ప్రతి సినిమాను తెలుగులో విడుదల చేసి మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. కానీ గత కొంత కాలంగా ఈయన సినిమాలు తెలుగు ప్రేక్షకులను అంతగా అలరించలేకపోతున్నాయి. కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఈయన తాజాగా ప్రేక్షకుల ముందుకు ‘బిర్యాని ’ వడ్డించడానికి వచ్చాడు. మరి ఆ బిర్యానీలో అన్ని సమపాళ్ళలో కుదిరాయో లేదో ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం.


వెంకట్ ప్రభు చిత్రాలు ఎలాగుంటాయో ప్రేక్షకులకు బాగా తెలుసు. కార్తీ, ప్రేమ్ జీ తెర పై బాగా చూపించాడు. ప్రేమ్‌జీని పరిచయం చేసినట్లు, కార్తీని ఇలా పాత్రల్ని పరిచయం చేయడం కొత్తగా ఉంది. సినిమా ప్రారంభం నుండి కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నాడు. సినిమా ఫస్టాఫ్ కాసేపు బోర్‌ కొడుతుంది. కానీ ఇంటర్వెల్‌ టైమ్‌కి కాస్త  రసకందాయంలో వస్తుంది. సెకండాఫ్‌లో ట్విస్ట్‌ను రకరకాలుగా చూపించి కన్‌ఫ్యూజ్‌ చేశాడు.

ఎప్పుడో చనిపోయిన వాడిని తర్వాత చనిపోయాడని దర్శకుడు నిజంగా తెలివితేటలు ప్రదర్శించాల్సిన చోట మరీ కామెడీగా సీన్స్‌ కన్సీవ్‌ చేశాడు. లాజిక్‌ గురించి ఆలోచించకుండా సినిమా చూస్తే ఓకే కానీ ఒక్కసారి అటుగా ఆలోచన వెళితే మాత్రం దీనిని చివరి వరకు ఎంజాయ్‌ చేయడం కష్టం. బిరియానీ కోసం ధాబాకు వెళి బాగా తినాలని అనుకుంటాం... కానీ టేస్ట్ సరిగా లేకపోతే బిర్యానీ తిన్న ఫీల్ రాదు. ఈ సినిమా కూడా బిర్యానీలా ఉంది కానీ బిర్యానీ తిన్ని ఫీల్ రాదు.

Cinema Review

ఈ సినిమాలో కార్తీ నటన చాలా సింపుల్ గా హడావుడి లేకుండా చేశాడు. అతని స్నేహితుడిగా ప్రేమ్‌జీ నవ్విస్తాడు. కార్తీ ఫ్రెండ్ గా వెంకట్ ప్రభుకి సమానమైన పాత్ర దొరికింది. కొన్ని మంచి జోక్స్‌తో ప్రేమ్‌జీ నవ్వులు పూయించాడు. ఇక హన్సిక పాత్ర టీవీ రిపోర్టర్‌. ఆమెను ప్రేమించే సన్నివేశాలు, ఎడబాట్లు వంటివి బాగా పండాయి. అయితే చివర్లో హీరోయిన్‌ పాత్రకు అంత ప్రాధాన్యత కన్పించదు. ఏదో హీరోయిన్ ఉండాలి కదా అన్నట్లు మాత్రమే ఉంది. రాంకీ ఓకే అనిపించాడు. నాజర్‌ది రొటీన్‌ పాత్రే. పంజాబీ మాండీ తన సెక్సీఅప్పీల్‌తో అలరించింది. ఇక మిగిలిన పాత్రలన్నీ మామూలేగానే ఉన్నాయి.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ చిత్రానికి సంగీతం అందించిన యువన్ శంకర్ రాజాకి వందవ చిత్రం. తన కెరియర్ లో లాండ్ మార్క్ గా నిలిచే చిత్రానికి అందించాల్సినంతగా మ్యూజిక్ ఇవ్వలేదు. పాటలన్నీ సో సోగా ఉన్నాయి. బ్యాంక్‌గ్రౌండ్‌ ఫర్వాలేదు. కెమెరా ఫర్వాలేదు. ఎడిటింగ్‌ కాస్త కన్‌ఫ్యూజ్‌గా ఉంది. మొదటి భాగంలో విషయం లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ బెటర్‌గా ఉండాల్సింది. రెండో భాగంలో ట్విస్ట్‌లు, అనుమానాలతో కాస్త గందరగోళపర్చాడు. దాన్ని మరింతగా ఎడిట్‌ చేస్తే బాగుండేది. నిర్మాతగా జ్ఞానవేల్‌ రాజా విలువలు బాగానే ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిస్‌ కాకుండా సస్పెన్స్‌, క్రైమ్‌ ఎలిమెంట్స్‌తో థ్రిల్‌ చేయాలని చూశాడు. అయితే అతను ఈ ప్రయత్నంలో కొంత వరకు సక్సెస్ అయ్యాడు. కామెడీని కూడా బ్యాలెన్స్ చేయాలని చూసినా అది కుదరలేదు.

more