Teluguwishesh తుఫాన్ తుఫాన్ Toofan - Toofan Telugu Movie Review, Toofan 2013 Movie Review, Toofan Movie Rating, Ram Charan Toofan Movie Review, Toofan Movie Review, Directed by Apoorva Lakhia, Starring Ram charan , Priyanka Chopra, Atul Kulkarni, Srihari, Videos, Stills, Wallpapers Toofan Review and more on teluguwishesh.com. Product #: 47153 2.75/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    తుఫాన్

  • బ్యానర్  :

    రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్

  • దర్శకుడు  :

    అపూర్వ లిఖియా

  • నిర్మాత  :

    పునీత్ ప్రకాష్ మెహ్రా

  • సంగీతం  :

    చిరాంతన్ భట్, మీట్ బ్రాస్ అంజన్, ఆనంద్ రాజ్ ఆనంద్

  • సినిమా రేటింగ్  :

    2.75/52.75/5  2.75/5

  • ఛాయాగ్రహణం  :

    గురురాజ్ ఆర్

  • ఎడిటర్  :

    చింతు సింగ్

  • నటినటులు  :

    రామ్ చరణ్, ప్రియాంక చోప్రా, శ్రీహరి, ప్రకాష్ రాజ్

Toofan Telugu Movie Review

విడుదల తేది :

06 సెప్టెంబర్ 2013

Cinema Story

నీతి నిజాయితీలు ఉన్న పోలీస్ ఆఫీసర్లను ఒక్కదగ్గరా కుదురుగా పనిచేయనీయరు. విజయ్ (రామ్ చరణ్ ) నిజాయితీగా ఉండే ఏసిపి. ఇతను దేనికి భయపడకుండా తన పని తాను చేసుకొని పోతుంటాడు. ఇతని పై అధికారులు కూడా ఇతన్ని ట్రాన్స్ ఫర్ల మీద టాన్స్ ఫర్లు చేస్తుంటాడు. చివరికి ఇతన్ని హైదరాబాద్ నుండి ముంబయికి ట్రాన్స్ ఫర్ చేస్తాడు. అక్కడ డిప్యూటి కలెక్టర్ హత్యకి సంబంధించిన కేసును డీల్ చేయాల్సి వస్తుంది. ఆ కేసులో కీలక సాక్షిగా మాయ(ప్రియాంక చోప్రా) ఉండటంతో ఆమెతో స్నేహం చేసి కేసుకు సంబంధించి పలు విషయాలు తెలుసుకుంటాడు. దీని వెనుక ఆయిల్ మాఫియా డాన్ రుద్ర ప్రతాప్ తేజ(ప్రకాష్ రాజ్ ) హస్తం ఉందని తెలుసుకొని ఆయిల్ మాఫియాను అంతం చేయడానికి ఎత్తుకు పై ఎత్తులు వేసి చివరకు దాన్ని ఎలా అంతం చేస్తాడు ? ఈ ఆపరేషన్ లో విజయ్ కి సహాయ పడిన షేర్ ఖాన్ (శ్రీహరి) కి ఏసీపీకి సంబంధం ఏమిటి ? ప్రియాంక చోప్రా ప్రేమను గెలుస్తాడా ? లేదా ? అన్నది తెర పై చూడాలి.

cinima-reviews
తుఫాన్

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా తెరంగ్రేటం చేసి, టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకొని మెగా పవర్ స్టార్ గా వెలుగొందుతున్న రామ్ చరణ్ తొలిసారిగా బాలీవుడ్ తెరకు బిగ్ బి అమితాబ్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన ‘జంజీర్ ’ సినిమా రీమేక్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో అక్కడి స్టార్ హీరోలు అయిన ఖాన్ ల హవా నడుస్తు టైంలో సౌత్ నుండి వెళ్ళిన చరణ్ బాలీవుడ్ జనాల్ని ఏమాత్రం మెప్పించాడో, అలాగే తొలిసారి హిందీ రీమేక్ తెలుగు వెర్షన్లో నటించిన ఆయన అమితాబ్ నటనను ఎంత వరకు అందుకున్నాడు ? జనాలు ఈయన్ను ఆదరిస్తారా లేదా అనేది ఈ సినిమా రివ్యూ ద్వారా చూద్దాం.

జంజీర్ సినిమా రీమేక్ చేయబోతున్నామని ప్రకటించినప్పుటి నుండి ఫ్యాన్స్ లో మొదలైన ఆసక్తి మధ్యలో ఎన్ని వివాదాలు, వాయిదాలు పడినా అది కించుతు కూడా తగ్గలేదు. ఎప్పుడో నైంటీన్ సెవెంటీస్ లో వచ్చిన ఈ సినిమా ఆ తరం ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. అదే పాత చింతకాయ పచ్చడి స్టోరీతో ఈ తరం ప్రేక్షకులన్ని అలరించాలని చూశాడు దర్శకుడు. ఇప్పుడు వచ్చిన ఈ సినిమాను ఆ సినిమాతో పోల్చిచూసుకున్న వారికి ఏ మాత్రం నచ్చదు. ఎందుకంటే అప్పటి వారిని ఆకట్టుకున్నంతగా ఈ సినిమా ఇప్పుడు లేదు కాబట్టి. ఏ మాత్రం ఎంటర్ టైన్ మెంట్ లేని ఈ సినిమాలో ఉన్న ఐటెం సాంగ్స్ తప్ప వేరేవి ఏమీ ఆకట్టుకునే లేకపోవడంతో ప్రేక్షకులు ఆ అయిదు నిమిషాల సమయాన్నైనా కాస్తంత ఎంజాయ్ చేస్తారు. ఇక ముఖ్యంగా హీరో, హీరోయిన్ మద్య కెమిస్ట్రీ కుదిరితే చిన్న చిన్నలోపాల పై ప్రేక్షకుడు మనస్సు పెట్టడు. ఇందులో రామ్ చరణ్ , ప్రియాంక మధ్య కెమిస్ట్రీ లేకపోగా వారిద్దరి మధ్య జరిగే రొమాన్స్ సన్నివేశం కూడా తేలిపోయింది. ఎంతో ముఖ్యమైన షేర్ ఖాన్ పాత్రకు, హీరో పాత్ర ట్రాక్ లు చాలా వీక్ గా ఉన్నాయి. పాటలు, రొమాన్స్ సీన్ల కంటే విలన్ , వ్యాంపు మధ్య వచ్చే సీన్లే కాస్తంత బెటర్ అనిపిస్తాయంటే కథనం ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు.  మొత్తంగా తొలిసారి బాలీవుడ్ లో నటించిన చరణ్ కి ఈ సినిమా కెరియర్ పరంగా ఏ మాత్రం ఉపయోగడదనిచెప్పవచ్చు. అత్యధిక సంఖ్య ప్రింట్లతో, భారీ పబ్లిసిటీ చేసి వదిలిన ఈ సినిమాకు తొలిరోజు కలెక్షన్లు బాగానే వచ్చినా, ఎంతో ఎక్స్ పెక్టేషన్స్ తో సినిమాకు వెళ్ళే చరణ్ అభిమానులకు కూడా ‘తుఫాన్ ’ తన వేగాన్ని చూపించలేకపోవచ్చు.

Cinema Review

బాలీవుడ్ యాంగ్రీ హీరోగా పేరు తెచ్చుకున్న అమితాబ్ నటించిన పాత్రలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన రామ్ చరణ్ చూడటానికి బాగున్నాడు. కానీ నటన విషయానికి వచ్చేసరికి కొన్ని సన్నివేశాల్లో అక్కడక్కడ తేలిపోయాడు. తెలుగులో మాస్, యాక్షన్ సన్నివేశాల్లో కాస్తంత ఇరగదీసే చరణ్ బాలీవుడ్ లో కూడా ఇరగదీశాడు. మొత్తంగా చూస్తే మాత్రం రామ్ చరణ్ తొలిసారి బాలీవుడ్ లో నటించినా బాలీవుడ్ హీరోలను తలపించాడు. ఇక ఈ చిత్రంలో నటించిన ప్రియాంక చోప్రాకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర లభించక పోయినా తన పాత్రమేరకు తాను నటించింది. ఇక షేర్ ఖాన్ పాత్రలో మగధీర రేంజ్ లో ఇరగదీయక పోయినా తన పాత్ర మేరకు నటించాడు. ఇక ఈ మధ్యలో తెలుగు తెర పై కనిపించి కనిపించనట్లు నటిస్తున్న ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎప్పటిలానే చేశాడు. ఆయన గురించి వేరే చెప్పుకోవాల్సిన పనిలేదు. తనికెళ్ళ భరణి పాత్ర నివిడి తక్కువే అయినా ఉన్నంతలో బాగా చేశాడు. ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించిన మహిగిల్ అందాలను ఆరబోసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

సాంకేతిక వర్గం

ఏ దర్శకుడు అయినా పాత హిట్ చిత్రాల్ని రీమేక్ చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఒక స్టార్ సినిమా రీమేక్ చేస్తున్నప్పుడు అప్పటి ఫీల్ మిస్సయ్యేలా చేయకూడదు. స్ర్కిప్టు పకడ్బందీగా ఉన్నప్పుడు స్క్రీన్ ప్లేను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇక అప్పుడెప్పుడో వచ్చిన జంజీర్ చిత్రాన్ని ఈతరం నేటివిటీకి తగ్గట్లు తీద్దామనే ధైర్యం చేసిన అపూర్వ లిఖియాకు ముందుగా మనం హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక హాలీవుడ్ రేంజ్ చిత్రాల్లాగా రెండు సంవత్సరాలకోసారి ఓ సినిమా తీసి నేను ఉన్నాను అని చెప్పుకునే ఈయన పాత జంజీర్ ఫీల్ ని మిస్ చేశాడు. ఏదో అమితాబ్ చిత్రం కదా రీమేక్ చేసి నాలుగు డబ్బులు జేబులో వేసుకుందాని అనుకున్న దర్శకుడి ప్లాన్ ఫెయిల్ అయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన కామెడీ మిస్సయింది. ఇక ఈ సినిమాకు సంగీతాన్ని ముగ్గురు అందించిన వినసొంపుగా ఏమీ లేదు. మాస్ సినిమాకు బ్యాక్ స్కోర్ చాలా కీలకం. అదే మిస్సయింది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపిస్తుంది. ఎడిటర్ సినిమాను వేగంగా పరిగెత్తించాడు తప్పితే ఆయన పెద్దగా చేసిందేమీ లేదన్నట్లు కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ దర్శకుడు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీశాడు.

more