Teluguwishesh రొమాన్స్ రివ్యూ రొమాన్స్ రివ్యూ Romance Telugu Movie Review, Romance Movie Review, Romance Movie Rating, A Maruthi Film, Romance Review, Romance Telugu Movie Rating, Romance Movie Trailers, Videos, Romance Movie Wallpapers, Romance Movie Working Stills, Romance Movie Gallery, Romance Movie Teasers, Star casting, Director Swamy, Prince, Manasa, Maruthi, Romance Movie Story, Romance Movie Movie Posters, Romance Movie Release Date, Romance Movie Auido Release and more. Product #: 46471 1.75/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    రొమాన్స్

  • బ్యానర్  :

    గుడ్ సినిమా గ్రూప్

  • దర్శకుడు  :

    డార్లింగ్ స్వామి

  • నిర్మాత  :

    జి. శ్రీనివారావు, ఎస్.కె.ఎస్

  • సంగీతం  :

    సాయి కార్తీక్

  • సినిమా రేటింగ్  :

    1.75/5  1.75/5

  • ఛాయాగ్రహణం  :

    జె. ప్రభాకర్ రెడ్డి

  • ఎడిటర్  :

    ఎస్.బి. ఉద్దవ్

  • నటినటులు  :

    ప్రిన్స్ ,డింపుల్ , మానస, సాయికుమార్ తదితరులు

Romance Telugu Movie Review

విడుదల తేది :

02 ఆగష్టు 2013

Cinema Story

కృష్ణ (ప్రిన్స్) ప్రేమలోగానీ, మరేదాంట్లో గానీ అనుభవం లేని అమ్మాయిని ప్రేమించాలనే లక్ష్యంగా పెట్టుకొంటాడు. మొదట లలిత (మానస)ను ప్రేమిస్తాడు. కొంత కాలం ఆమెతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరిగి చివరకు ఆమె తనకు ఫర్ ఫెక్ట్ కాదని తెలుసుకొని మరో అమ్మాయి అనురాధ (డింపుల్ ) ని ప్రేమిస్తాడు. ఈమెకు అన్నీ పరీక్షలు పెట్టిన అనంతరం తనకు ఈమె ఫర్ ఫెక్ట్ అనుకొంటాడు. కానీ కృష్ణ క్యారెక్టర్ నచ్చక డింపుల్ అతన్ని ఛీ కొట్టి వెళ్లిపోతుంది. ఇప్పుడు మొదట ప్రేమించిన అమ్మాయి లలిత మళ్ళీ కృష్ణ జీవితంలోకి ఎలా వచ్చింది ? చివరికి తన ప్రేమను ఏ విదంగా తిరిగి పొందుతాడు అన్న అంశాలను తెర మీద చూడాల్సిందే..

cinima-reviews
రొమాన్స్ రివ్యూ

‘ఈ రోజుల్లో ’ సినిమా  ద్వా రా  తెలుగు ప్రేక్షకులకు  దర్శకుడిగా  పరిచయం అయిన మారుతి  ఆ తరువాత  ‘బస్ ప్టాప్ ’ సినిమాతో ఫేం అయ్యి , ఆయన సినిమాలు అంటేనే అడల్ట్ చిత్రాలు అనే బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆయన టీంలో మెంబర్ అయిన ‘డార్లింగ్ స్వామి ’ అదే అడల్ట్ ని నమ్ముకొని యూత్ ని కనెక్టేయ్యేలా ‘రొమాన్స్ ’ అనే టైటిల్ పెట్టి, దానికి ‘ఎర్విబడీ వాంట్స్ ’ రొమాన్స్ అనే ట్యాగ్ లైన్ని తగిలించి మారుతి సినిమా బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి తెర పై చేసే ఈ రొమాన్స్ ప్రేక్షకుల్ని ఎంత వరకు రీచ్ అయ్యిందో ఈ సినిమా రివ్వూ ద్వారా చూద్దాం.

Cinema Review

గత చిత్రాల్లో కన్నా ఈ చిత్రంలో ప్రిన్స్ నటన పరంగా చాలా కాన్ఫిడెన్స్ గా కనిపించాడు. ఇప్పటి వరకు యూత్ ని బేస్ చేసుకొని తీసిన చిత్రాల్లోనే నటించాడు కాబట్టి ఈజీగా చేయగలుగుతున్నాడు. చిత్రంలో ప్రిన్స్ కామెడీ సీన్లలో హావ భావాల ఇంకా చక్కగా పలికించాల్సి ఉండేది. ఈ చిత్రంతో తెరకు పరిచయమయిన కథానాయిక డింపుల్ అందంగానూ అభినయపరంగా కూడా బాగుంది. మారుతీ మార్క్ ఉన్న పాత్ర లో పరవాలేదు అనిపించేసింది.  రెండవ కధానాయిక నటన పరంగా కాస్తంత ఎక్కువే చేసింది. మారుతీ సినిమాల్లో మాత్రమే కనపడే కమెడియన్ సాయి కుమార్ పంచ్ డైలాగులు అప్పుడప్పుడు మాత్రమే పండాయి. ఇక మిగతా నటుల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

సాంకేతిక వర్గం పనితీరు

ఈ సినిమాకు సాయి కార్తీక్ అందించిన సంగీతం మళ్లీ మళ్లీ వినాలనిపించేది గా లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా ఆకట్టుకునే విధంగా లేదు. జస్ట్ ఓకే. ఇక తొలిసారిగా అన్నీతానై మారుతి బాటలోనే నడిచి యూత్ బేస్ చేసుకొని అడల్ట్ సినిమా తీస్తే జనాలు చూసేస్తారనుకున్నాడు. పేరు మారుతి సినిమాగా ప్రచారం చేసుకున్నా ఇందులో వేలు పెట్టలేదు. గతంలో తనదైన మాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న డార్లింగ్ స్వామి ఈ చిత్రంలో తనదైన డైలాగులతో అలరించాలని అనుకొని మారుతి లాగా అనతి కాలంలోనే పేరు తెచ్చుకోవాలని చూసిన డార్లింగ్ స్వామి ప్లాన్ విఫలం అయింది. అడల్డ్ చిత్రాలను కూడా తీసి మెప్పించడం అంటే అంత ఈజీ కాదని ఈ సినిమాను చూస్తే అర్థం అవుతుంది. మారుతి లాగా అడల్ట్ కి కావాల్సిన బూతును మాత్రమే జోడించి, కామెడీ చేయాలని చూశాడు. కథ, కథనం, స్ర్కీన్ ప్లే ఇన్ని విభాగాల్లో విఫలం అయ్యాడు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఈ చిత్రంలో అనవసరమై సీన్లు చాలా వరకు కత్తిరించకుండా అలానే ఉంచారు. వీటన్నింటిని తగ్గిస్తే సినిమా నివిడిని రెండు గంటలకు తగ్గించుకోవచ్చు. క్వాలిటీ పరంగా బాగానే తెరకెక్కించారు.