Teluguwishesh ఓం 3డి ఓం 3డి OM 3D Telugu Movie Review, OM 3D Movie Review, Kalyan Ram OM 3D Rating, OM 3D Review, OM 3D Cinema Review, Kalyan Ram OM 3D Review, Telugu Movie Reviews , Movie Reviews, Cinema Reviews, Ratings, Movie Release Dates, Public Talk, Story, Director, cast and crew, Teasers, OM 3D Wallpapers, Auido Releases, Videos, Movie Trailers, Gallery, Photos and more.... Product #: 46186 2.75/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఓం 3డి

  • బ్యానర్  :

    ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌

  • దర్శకుడు  :

    సునీల్‌రెడ్డి

  • నిర్మాత  :

    కళ్యాణ్ రామ్

  • సంగీతం  :

    అచ్చు, సాయికార్తీక్‌

  • సినిమా రేటింగ్  :

    2.75/52.75/5  2.75/5

  • ఛాయాగ్రహణం  :

    అజయన్ జోసఫ్ విన్సెంట్,

  • ఎడిటర్  :

    గౌతంరాజు

  • నటినటులు  :

    కళ్యాణ్ రామ్, కృతి కర్బందా, నికీషా పటేల్‌, కార్తీక్‌ తదితరులు

Om 3d Telugu Movie Review

విడుదల తేది :

19 జూలై 2013

Cinema Story

అర్జున్ (కళ్యాణ్ రామ్), హరిశ్చంద్ర ప్రసాద్(కార్తీక్ ) వీరిద్దరు తండ్రీ కొడుకులు. వీరిద్దరి మధ్య ఎనలేని ప్రేమానురాగాలు ఉంటాయి. హరిశ్చంద్ర ప్రసాద్ కి , బైరెడ్డి (రావు రమేష్ ) కి మధ్య వైరం ఉంటుంది. హరిశ్చంద్ర ప్రసాద్ వలన బైరెడ్డి పదవి పోవడంతో ఆయన్ను ఎలాగైనా మట్టుబెట్టాలని అనుకుంటాడు. కానీ తన తండ్రిని అనునిత్యం కాపాడుకుంటూ ఉంటాడు కళ్యాణ్ రామ్. కానీ భవాని శంకర్ (సంపత్ రాజ్) బైరెడ్డి కలిసి హరిశ్చంద్ర ప్రసాద్ ని చంపేస్తారు. ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రిని చంపేసిన వారిద్దరిని అర్జున్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు. భవానీ శంకర్ కి, హరిశ్చంద్ర ప్రసాద్ కి వైరం ఎక్కడ ఉంటుంది ? చివరకు తన ప్రేమను గెలుస్తాడా లేదా అనేదే మిగతా స్టోరి.

cinima-reviews
ఓం 3డి

నందమూరి వంశం నుండి హీరోగా తెరంగ్రేటం చేసిన కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు నటించిన అతనొక్కడే తప్ప మరే సినిమా కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. అప్పుడెప్పుడో ‘కత్తి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ చాలా గ్యాప్ తీసుకొని తానే నిర్మాతగా మారి అత్యాధునిక టెక్నాలజితో తొలిసారి తెలుగులో యాక్షన్ 3డి సినిమాలో నటించాడు. మరి ఎంతో ఖర్చును భరించి తీసిన ఈ చిత్రానికి పబ్లిసిటీ మాత్రం బాగానే చేశాడు. మరి కళ్యాణ్ రామ్ పడ్డ శ్రమ, పెట్టిన ఖర్చు 3డిలో స్పష్టంగా కనిపించాయా ? ఎంతో నమ్మకం పెట్టుకున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారో ఈ రివ్యూ ద్వారా చూద్దాం.

తెలుగు సినిమా ఇండస్ట్రీని కొంత పుంతలు తొక్కించాలనే కళ్యాణ్ రామ్ తపనకు మెచ్చుకోవాల్సిందే. కానీ ఇలాంటి 3డీ టెక్నాలజీకి తగ్గట్లు కథను, దర్శకుడిని ఎంచుకోవాలి. ఏదో క్రేజ్ కోసం కథా బలం లేని స్టోరీని కోట్లు తగిలేసి 3డీలో తెరకెక్కించడం వేస్ట్. ఇక్కడ అదే జరిగింది. కమర్షియల్ హంగులు లేని కథతో, కథాబలం లేని దర్శకుడితో తనకు నచ్చిన కథతో తనకు నచ్చినట్లు సినిమా తీస్తే ఫలితం ఏం ఉండదు.  ఏదో కొత్త టెక్నాలజీ పేరు చెప్పి ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేసిన ‘యాక్షన్ ’ త్రీడీ చిత్రం పరిస్థితి ఏంటో ఇప్పటికే అర్థం అయింది. అది కామెడీ కాబ్టట్టి వర్కట్ కాలేదు కానీ, ఇది యాక్షన్ కాబ్టట్టి అడ్వాంటేజ్ అవుతుందని అనుకుంటే మాత్రం మీరు పొరపాటులో కాలేసినట్లే. సినిమాకి వెళ్ళిన వారు టెక్నాలజీ ని అయితే ఆస్వాదించగలరు. ఇక ఈ సినిమాలో స్టోరీ లేకుండా కానీ ఫైట్లతో మాత్రం ఫుల్లుగా విసిగించారు. సినిమా ఉన్నది కాస్తంత నివిడే అయినా, ఎంతో పెద్ద సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. సినిమాలో కామెడీ, లవ్ ట్రాక్ లేదు. ఎప్పుడూ ఒకే మూసలో సినిమా సాగుతుంది. ఒక్క త్రీ ఎఫెక్ట్స్ మాత్రం బాగున్న ఈ సినిమాకు ఇంత తగలెయ్యాల్సిన అవసరం లేదు. బడ్జెట్ పరంగా ఈ సినిమాకు భారీ రేంజ్ లో ఖర్చుపెట్టించినా కలెక్షన్లు ఏ మాత్రం రాబడుతుందో చూడాలి. ఇప్పటికే హీరోకి కథ పరంగా గుండు కొట్టించిన దర్శకుడు కళ్యాణ్ రామ్ కి పెద్ద బొక్క పడేలా చేయడు కదా.

Cinema Review

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ పోషించిన పాత్ర ఈయన గత చిత్రాలలో  చేసిన పాత్రలాగే అనిపిస్తుంది. చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రం అయినందునో ఏమో గానీ చిత్రంలో కాలవాల్సిన దాని కన్నా ఎక్కువ ఎమోషనల్ గా నటించాడు. ఎప్పుడు ఇలాంటి పాత్రలే ఎంచుకుంటున్న కళ్యాణ్ , ఈ సినిమాలో పాత్ర రొటీగా అనిపిస్తుంది. గత చిత్రాలలో లాంటి పాత్రే కావడంతో ఈయన నటనలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. కానీ కథలో భాగంగా వచ్చే క్యారెక్టర్ కోసం ఎలాంటి గెటప్ వేసుకోవడానికి సిద్ధపడ్డ కళ్యాణ్ రామ్ గుండులో కనిపించి ప్రేక్షకులకు కొత్తగా కనిపించాడు.  ఇందులో నికీషా పటేల్, కృతి కర్బందాలకు కాస్తంత మంచి క్యారెక్టర్లే దొరికినా వాటిని సద్వినియోగం చేసుకోలేక పోయారు. నిఖిష పటేల్ పాత్ర ఉన్నదీ కొద్దిసేపే అయినా పరవాలేదనిపించింది కాని డబ్బింగ్ విషయంలో మరింత జాగ్రత్త వహించాల్సింది అసలు లిప్ సింక్ కుదరలేదు. కృతి పాత్ర కూడా బాగానే ఉన్నా నటన పరంగా ఆకట్టుకోలేక పోయింది. మొత్తంగా చూస్తే నటన వచ్చిన హీరోయిన్లు అయితే ఈ పాత్రలను బాగా చేసేవారనిపిస్తుంది. ఇక చాలా రోజుల తరువాత తెలుగు తెర పై కనిపించిన తమిళ నటుడు కార్తీక్ నటనలో వచ్చిన గ్యాప్ ని ఫిల్ చేయాలనుకున్నాడో ఏమో కానీ ఇంగ్లీష్ డైలాగులు చెబుతూ ప్రేక్షకులన్ని విసిగించాడు. విలన్ క్యారెక్టర్ లో సంపత్ రాజ్ మెప్పించలేక పోయాడు. సురేష్ కూడా క్యారెక్టర్ కి మించి నటించేశాడు. ఇక రావు రమేష్ అయితే సాధారణంగానే ప్రేక్షకుల్ని విసిగించేస్తాడు. కానీ 3డీ సినిమా కాబట్టి మరింత ఓవర్ యాక్షన్ చేశాడు. మిగత వారు కూడా రెచ్చిపోయి నటించి సినిమాను రచ్చ రచ్చ చేశాడు.

సాంకేతిక వర్గం పనితీరు :

సాంకేతికంగా తెరకెక్కిన ఈ సినిమాలో సంగీత నేపథ్యం అక్కడక్కడ బాగుంది. సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చెప్పాలంటే ఈ విజువల్ ఎఫెక్ట్సే సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు. ఎంతో ఖర్చపెట్టి ఈతీసిన ఈ చిత్రంలో కనీసం అవ్వయిన బాగున్నాయనిపిస్తుంది. విదేశీ నిపుణుల పనితనం కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. కథ, దర్శకత్వాన్ని ప్రక్కన పెడితే తెలుగు వచ్చిన ఈ చిత్రం సాంకేతికంగా మంచి పేరే తెచ్చుకుందనటంలో సందేహం లేదు. నిర్మాత కళ్యాణ్ రామే కాబట్టి క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు. సంగీతం సోసోగా అనిపిస్తుంది. దర్శకుడి విషయానికి వస్తే... పాత కథ పస లేని కథనం ఆకట్టుకొని దర్శకత్వం ఇలా అన్ని విషయాలలో దర్శకుడు ఘోరంగా విఫలం అయ్యారు. విజువల్ గా చాలా బాగా తెరకెక్కించాలన్న తాపత్రయం కథ విషయంలో ఓ పది శాతం చూపించి ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ మంచి చిత్రంగా నిలిచేది. ఈ చిత్రంలో రెండు ట్విస్టులు మినహా స్టోరీలో విషయం లేదు. మంచి కమర్షియల్ చిత్రాలు తీయాలంటే కనీసం ట్విస్ట్ మీద ట్విస్ట్ లు ఇస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి. కానీ దర్శకుడు ఆ ప్రయత్నం ఏమీ చేయలేదు. కనీసం నటీ నటుల నుండి కూడా పూర్తి స్థాయి నటనను రాబట్టుకోలేక పోయాడు. చిత్ర నిడివి రెండు గంటలే కావడంతో ఎడిటింగ్ కి ఎక్కువ అవకాశం లేదు.

chivaraga

కథ లేనప్పుడు కోట్లు తగలేయడం వేస్ట్.