Teluguwishesh సమ్ థింగ్ సమ్ థింగ్ సమ్ థింగ్ సమ్ థింగ్ Something Something Movie Review,Something Something Telugu Movie Review, Something Something Movie Rating,Something Something Telugu Movie Rating,Siddharth,Hansika, Live Updates from teluguwishesh.com. Product #: 45325 2.5/5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  సమ్ థింగ్ సమ్ థింగ్

 • బ్యానర్  :

  శ్రీ లక్ష్మీగణపతి పిక్చర్స్

 • దర్శకుడు  :

  సుందర్.సి

 • నిర్మాత  :

  బి.సుబ్రహ్మణ్యం

 • సంగీతం  :

  సత్య

 • సినిమా రేటింగ్  :

  2.5/52.5/5  2.5/5

 • ఛాయాగ్రహణం  :

  గోపీ అమర్‌నాథ్

 • ఎడిటర్  :

  గురురాజ్‌

 • నటినటులు  :

  సిద్దార్ధ, హన్సిక, బ్రహ్మానందం,సుధ

Something Something Telugu Movie Review

విడుదల తేది :

14 జూన్ 2013

Cinema Story

సాఫ్ట్ వేర్ ఉద్యోగి కుమార్ (సిద్దార్థ్) ఇంట్లో వాళ్లు తరతరాల నుండి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అదే బాటలో పయనించి చిన్నప్పటి నుంచి మూడు సార్లు ప్రేమలో పడి, ఆ విషయంలో ఫెయిల్ అయి, ప్రేమ, పెళ్లి కి దూరంగా ఉంటాడు. ఇంతలో కుమార్ పనిచేస్థున్న కంపెనీకే సంజన (హీరోయిన్ హన్సిక) ని చూసి మొదటి చూపులోనే కుమార్ ఆమె ప్రేమలో పడతాడు, కానీ ఆమెను లవ్ దించడానికి లవ్ గురూ (బ్రహ్మానందం) సలహాలు తీసుకొని ఆమెను ప్రేమలో పడేస్తాడు. కానీ అదే ప్రేమ వల్ల చిక్కుల్లో పడతాడు ? వాటి నుండి ఎలా బయటకి వస్తాడు ? ఇంతకీ కుమార్ తన ప్రేమలో సక్సెస్ అయ్యాడా ? అనేది వెండితెరపై చూడాల్సిందే.

cinima-reviews
సమ్ థింగ్ సమ్ థింగ్

తమిళ దర్శకుడు సుందర్. సి ఒక మూస ధోరణిలో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి ట్రై చేస్తూ కమర్షియల్ గా సక్సెస్ అవుతుంటాడు. తమిళ మాస్ ప్రేక్షకుల్ని థియేటర్ కి రప్పించే సినిమాలు రొటిన్ సినిమాలు చేస్తూ అందుకుతగ్గట్లు కామెడీని జోడించి ప్రేక్షకులకు మూడు గంటల పాటు వినోదాన్ని అందిస్తాడు. మరి అలాంటి దర్శకుడు తెలుగు మాస్ ప్రేక్షకుల్ని, క్లాస్ ప్రేక్షకుల్ని తన రొటీన్ స్టోరీతో ఏ మాత్రం ఆకట్టుకున్నాడో ఓ సారి రివ్యూ చూద్దాం.

ఫస్టాఫ్ కామెడీతో రక్తి కట్టించినా, సెకండాఫ్ లో సినిమా కాస్తంత డల్ అయింది. కానీ కొన్ని ట్విస్ట్ లు ఇచ్చి కథను ముందుకు నడిపాడు. బ్రహ్మానందం, సిద్దార్థ్ మద్య నడిచిన కామెడి సీన్లు తప్ప మరో ఎంటర్ టైన్ మెంట్ లేదు. ఇక ఇక్కడి బ్రహ్మానందం పాత్రను తమిళంలో సంతానం పోషించాడు. అతని కామెడీకి అక్కడ ఆ సినిమా గట్టెక్కినా, ఇక్కడ దీన్ని బ్రహ్మానందం ఎంత వరకు గట్టెక్కిస్తాడో చూడాలి. దీని పై ఏదో పెద్దగా ఎక్ప్ పెక్టేషన్స్ పెట్టుకోకుండా పోతే మూడు గంటల పాటు మాత్రం టైంపాస్ అవుతుంది.

Cinema Review

సిద్దార్థ నటన పరంగా మంచి మార్కులే వేయించుకుంటున్నా, కథ ఎంపికలో పొరపాటు చేస్తూ తరుచూ అపజయాల పాలవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయనకు చెప్పుకోదగ్గ హిట్లు కూడా లేవు. ప్రతి సినిమాకు కొత్త క్యారెక్టర్ పోషించే సిద్ధార్థ ఈ సినిమాలో కూడా ఢిఫరెంటు క్యారెక్టర్ చేశారు. యాక్షన్ రొమాన్స్ చిత్రాల్లో నటించిన ఫర్వాలేదనిపించుకున్న సిద్దార్థ ఆ మధ్య కామెడీ కూడా ట్రై చేసి ఓకే అనిపించుకున్నాడు. ఇది కూడా కామెడీకి సంబంధించిన కథ కాబట్టి, ఆయన నటన ఫర్వాలేదనిపిస్తుంది. హీరోయిన్ హన్సిక కూడా పాత్రకు తగ్గట్టుగా నటించినా ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం ఇచ్చే సీన్లు లేకపోవడంతో పూర్థిస్థాయి హన్సిక అని నటనలో అనిపించుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో హీరో తరువాత సెకండ్ హీరోగా చెప్పబడుతున్న కమేడియన్ బ్రహ్మానందం మొత్తంగా బాగానే నవ్వించినా, కొన్ని సీన్లు పండలేదు. పూర్తి స్థాయిలో కమేడియన్ స్కోపు ఉన్న ఈ పాత్రలో కాస్తంత యంగ్ కమేడియన్ అయితే ఇంకా బాగా వచ్చేదనిపిస్తుంది. కథ స్లో మోషన్ లోకి వచ్చినప్పుడు బ్రహ్మానందం తన కామెడీతో సినిమాను బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు. ఈసినిమాలో రాణా, సమంతలను అతిథి పాత్రల్లో చూపించినా వారు సో సోగానే నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమా కథకు ప్రాణం పోసేది సంగీతం. అలాంటి సంగీతంతో హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాకు సత్య అందించిన పాటలు వినసొంపుగా లేవు. మాస్ ఆడియన్స్ తో ఈలలు వేయించే సుందర్ ఇందులో కూడా అలాంటి పిచ్చిపిచ్చి సంగీతాన్ని ఏరికొని పెట్టి ప్రేక్షకుల్ని ఇరిటేట్ చేశాడు. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనిపిస్తుంది. ఫైట్స్ అసలే లేవు.ఇక టైంపాస్ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుందర్ .సి ఈ సినిమాను మొదలు పెట్టి పాత ధోరణిలో కథను నడిపించి ముగించాడు. ఈయన దర్శకత్వం పాత సినిమాలను గుర్తుకు చేస్తాయి. ఈ తరానికి తగ్గట్లు కొన్ని సీన్లు బాగానే తీసినా, కొన్ని సిల్లీ సీన్లతో ప్రేక్షకులకు చిరాకు తెప్పించాడు. తాను తీసుకున్న కథ హాలీవుడ్ స్ఫూర్తిదే అయినా, దానికి కామెడీని జోడించి ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో మెప్పించక పోయినా తన స్థాయికి తగ్గట్లు మెప్పించాడు.

chivaraga

 

సమ్ థింగ్ సమ్ థింగ్ లో ‘సమ్ సమ్ ’ మిస్సయ్యాయి