Teluguwishesh ఇద్దరమ్మాయిలతో... ఇద్దరమ్మాయిలతో... telugu allu arjun iddarammayilatho movie review Product #: 45079 3/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ఇద్దరమ్మాయిలతో

  • బ్యానర్  :

    పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్

  • దర్శకుడు  :

    పూరి జగన్నాథ్

  • నిర్మాత  :

    బండ్ల గణేష్

  • సంగీతం  :

    దేవిశ్రీ ప్రసాద్

  • సినిమా రేటింగ్  :

    3/53/53/5  3/5

  • ఛాయాగ్రహణం  :

    అమూల్ రాథోడ్

  • ఎడిటర్  :

    ఎస్.ఆర్.శేఖర్

  • నటినటులు  :

    అల్లు అర్జున్, అమలాపాల్, కేథరిన్, బ్రహ్మానందం, నాజర్, అలీ, సుబ్బరాజు, తదితరులు

Telugu Allu Arjun Iddarammayilatho Movie Review

విడుదల తేది :

31 మే, 2013

Cinema Story

కోమలి, సంజు రెడ్డి, ఆకాంక్ష, … సంజు రెడ్డి (అల్లు అర్జున్ ) పాత్రలో నటించాడు. సంజు రెడ్డి స్పెయిన్ లో టాప్ గిటారిస్ట్ గా తన మ్యూజిక్ ట్రూప్ తో కలసి బ్యాండ్ నడుపుతుంటాడు. భారతదేశంలో (రావు రమేష్) రాజకీయ మంత్రిగారి కుమార్తె అయిన (కేథరిన్) ఆకాంక్ష పై చదువుల కోసం (సైకలాజికల్ పీజి కోసం) స్పెయిన్ వెళుతుంది. అక్కడ ఆమె నివసించే ఇంట్లో ఆకాంక్ష కంటే ముందు ఆ ఇంట్లో ఉన్న వారికి సంబంధించిన ఓ అద్భుతమైన డైరీ ఆకాంక్షకు దొరుకుతుంది.

అయితే ఆ డైరీ (అమలాపాల్) కోమలి శంకరాభరణం కు సంబంధించింది. ఆ డైరీలో ఏముందో చూడాలనే కోరికతో, ఇతరల డైరీ చదవకూడదని తెలిసినప్పుటికి, ఏమిటో చూడాలనే ఆశతో ఆకాంక్ష ఆ డైరీ చదవటం ప్రారంభిస్తుంది. అయితే ఆ డైరీలో కోమలి - సంజు ల ప్రేమ కథ గురించి రాసి ఉంటుంది. ఆ డైరీ చదువుతున్న సమయంలో ఆకాంక్షకి అనుకుకోకుండా ఆ డైరీ లో ఉన్న సంజు ఎదురవుతాడు. దాంతో సంజుని ఆకాంక్ష తనకు సైకాలజీ తెలుసనీ పేస్ చూసి జాతకం చెబుతానని ఏడిపిస్తుంది.

ఓ రోజు ఆ డైరీలో ఆసక్తి కరమైన అంశం చదువుతున్న సమయంలో ఆ డైరీ పూర్తవుతుంది. ఇక ఉండబట్టలేక అసలేం జరిగిందో చెప్పమని సంజుని అడుగుతుంది. ఇక సంజు చెప్పిన కథ విని ఆకాంక్ష షాక్ అవుతుంది. ఆ తర్వాత సంజుపై ఆకాంక్ష ప్రేమ పెంచుకొని అతనిని లవ్ చేస్తుంది. అయితే ఈ క్రమమంలోని కొన్ని సంఘటనలు జరుగుతాయి? అసలు సంజు డైరీ రాయటం మధ్యలో ఎందుకు ఆపేశాడు? ఆకాంక్ష తండ్రి సంజు ను ఎందుకు ఢీ కొంటాడు అనేది వెండితెర మీద చూడాల్సిందే.

cinima-reviews
ఇద్దరమ్మాయిలతో...

ప్లస్ పాయింట్:

  • అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ కాస్ట్యూమ్స్ చాలా డిఫెరెంట్ గా ఉన్నాయి. యూత్ కు బాగా నచ్చుతుంది.
  • 'రన్ రన్' 'టాప్ లేచిపోద్ది' పాటల్లో అదిరిపోయే స్టెప్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
  • ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ లో అతని యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉన్నది.
  • అల్లు అర్జున్ తర్వాత ఈ సినిమాలో ఆకర్షణీయమైన వ్యక్తి కేథరిన్ , అమాలపాల్ అందాలతో కేక పుట్టించారు
  • టాప్ లేచిపోద్ది' అనే పాటలో కేథరిన్ అల్లు అర్జున్ తో సమానంగా డాన్స్ అందరిని మెప్పించింది.
  • దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్?
  • బ్రహ్మనందం అలీల కామెడీ చాలా బాగుంది.
  • అయితే తనికెళ్ల భరణి, నాజర్లను కూడా ఉపయోగించుకోని ఉంటే ఇంక బాగుండేది.

     

 మైనస్ పాయింట్:

  • పూరి జగన్నాథ్ ప్రతి చిత్రంలో ఉండే విధంగా హీరోయిజం పంచ్ డైలాగ్స్ ఇద్దరమ్మాయిలతో తగ్గించినట్లు అనిపించింది.
  • ఇద్దరమ్మాయిలతో మూవీ ఫస్ట్ అఫ్ తో పోల్చుకుంటే సెకండ్ అఫ్ కాస్త స్లోగా సాగింది.
  • అయితే అల్లు అర్జున్ హీరోయిజం తగ్గడమే కాక అతని సినిమా అనగానే 6 పాటల్లో సూపర్ స్టెప్స్ ఉంటాయని అతని అభిమానులు ఆశిస్తారు. కానీ సినిమాలో కేవలం 3 పాటలలోనే అదిరిపోయే స్టెప్స్ వేయడంతో అతని అభిమానులు కాస్త నిరుత్సాపడతారు.
  • ఇకపోతే బ్రహ్మనందం, అలీల కామెడీను పూరి ఎక్కువుగా వాడుకోలేకపోయాడని ప్రేక్షకులు అంటున్నారు. బ్రహ్మనందం దగ్గర ఉన్న కామెడీని పిండుకోవటంతో పూరి వెనబడిపోయాడు. అలీకి కొంచెం ఎక్కుడు కామెడీ పెడితే సినిమాకు బాగుండేది. తనికెళ్ల భరణి, నాజర్ కూడా నటనలో వెనకబడిపోయారు.

     

Cinema Review

ఇద్దరమ్మాయిలతో, మూవీలో అల్లు అర్జున్, సంజు రెడ్డి గా మునుపెన్నడూ కనిపించనంత కొత్త లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తాడు. దేవిశ్రీ అందించిన మూడు మంచి పాటలు, బ్యాగ్రౌండ్ స్కోరు.. చక్కటి ఫొటోగ్రఫీ, పాటల చిత్రీకరణ సరిగ్గా కుదిరి కాస్త ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఇక యాక్షన్ కొరియోగ్రఫీ అయితే తెలుగు తెరపై ఇంతవరకు చూడని రీతిలో, అంతర్జాతీయ స్థాయిలో ఉండి అబ్బురపరుస్తుంది. ప్రథమార్ధమంతా యూత్ కి బాగా కనెక్టయ్యేలా ఉండి వాళ్లను మెప్పిస్తుంది. ఐతే ద్వితీయార్ధం మాత్రం పూర్తిగా గాడి తప్పింది. మొదటి నుంచి ఉన్న బ్రహ్మీ, చివర్లో వచ్చిన ఆలీ సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. సంగీతమైనా, ఫొటోగ్రఫీ అయినా, స్టంట్స్ అయినా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.

అల్లు అర్జున్ చాలా ట్రెండీ లుక్ తో, అదిరిపోయే ఫైట్లతో, ఆకట్టుకునే డ్యాన్సులతో మెప్పించాడు. హీరోయిన్ అమలా పాల్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఐతే ఒక్కో సందర్భానికి ఒక్కోలా భాషను, నడవడికను మార్చుకునే ఆమె పాత్ర కొంచెం చికాకు పెట్టింది. కేథరిన్ ఈ చిత్రంలో ఎంత అందంగా ఉన్నదో ఆమె నటన ప్రతిభ కూడా అంతే అధ్బుతంగా ఉన్నది. 'ఈ సినిమాతో కేథరిన్ కు ఇకపై టాప్ హీరోయిన్ సినిమాల్లో నటించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. విలన్ కథకు అణుగుణంగా నటించాడు. పూరి జగన్నాథ్ తన శైలికి కాస్త భిన్నమైన సినిమాను ఎంచుకున్నాడు. సినిమాను స్టైలిష్ గా తీర్చిదిద్దాలన్న ప్రయత్నం మాత్రం కనిపించింది. అయితే బన్నీ ఈ ఇద్దరుతో చేసే రొమాన్స్ చాలా అద్బుతంగా ఉంటుంది. సినిమాలో ఎక్కడ ఎలాంటి అసభ్యకరమైన సన్నివేశాలుగానీ, జోకులుగానీ లేకుండా పూరి చాలా జాగ్రత్తపడ్డారు. యూత్ కు, కుటుంబానికి ఒకేసారి ఈ ఇద్దరమ్మాయిలు నచ్చుతారు.  

సాంకేతిక విభాగం:

పూరి జగ్ననాథ్ కు బండ్ల గణేష్ పుల్ సపోర్టు ఇవ్వటంతో .. అద్బుతమైన లోకేషన్లలో పాటలు చిత్రికరించారు. పూరి ఎంచుకున్న కథ ఒకే .కానీ స్క్రీన్ ప్లే అతను ప్లాన్ చేసుకున్న ట్విస్ట్ లు అద్భుతంగా ఉన్నాయి. కాని సినిమాని కాస్త స్పీడ్ గా నడుస్తే బాగుండేది. దాంతో పూరి అభిమానులు కాస్త నిరుత్సాహంగా ఉన్నారు. అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ బాగున్నది. సాంగ్స్ యాక్షన్ ఎపిసోడ్స్ లో చాలా అధ్బుతంగా చిత్రీకరించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చాలా అధ్బుతంగా ఉంటె బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతకంటే అద్భుతంగా ఉన్నది. రొమాంటిక్ సన్నివేశాల్లో దేవి ఆర్.ఆర్. అధ్బుతంగా ఉన్నది. సినిమాకోసం వేసిన సెట్స్ బాగున్నాయి.

 

chivaraga

ఇద్దరమ్మాయిలతో అల్లు అర్జున్ సరికొత్త రూపంలో కనిపించాడు. ఒకేసారి యూత్ కు, కుటుంబానికి కలిపి ఇద్దరమ్మాయిల కథను పూరి తెరకెక్కించాడు. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ స్టైలిష్ లుక్ కేథరిన్, అమలాపాల్ గ్లామర్ అధ్బుతమైన యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్స్. సినిమాకు తగ్గట్టుగానే పంచ్ డైలాగులు పెట్టడం జరిగింది. కానీ మెగా అభిమానులు మరికొన్ని పంచ్ డైలాగులు ఉండి ఉంటే బాగుండేదని అంటున్నారు. సినిమా పరంగా కొన్ని తప్పు లు జరిగినప్పుటికి మొత్తం మీద సినిమా కథ చాలా బాగుంది. అల్లు అర్జున్ నటన అద్బుతంగా ఉందని అంటున్నారు. సమ్మర్ కాలం ముగుస్తున్న సమయంలో .. ఇద్దరమ్మాయిలతో మూవీ తెలుగువారికి ముందే రుతుపవనాలను తెచ్చిపెట్టిందని మెగా అభిమానులు అంటున్నారు

» ఇంగ్లీష్ రివ్యూ కోసం క్లిక్ చెయ్యండి

 

more