రాష్ట్ర విభజన ప్రకటన ఏ మూహుర్తాన ప్రకటించారో గానీ.. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు పెద్ద తలనొప్పింగా మారిందనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది.ఆయా రాజకీయ పార్టీల నాయకుల్లో హై టెన్షన్ మొదలైంది. ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు దూకుడు పెంచాయి. రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయ గాలుల దెబ్బకు .. ఆయా పార్టీలలోని నాయకులు గోడలు దూకుతున్నారు. మరికొందరు ముందుగానే.. సీట్ పై కర్ఛీఫ్ వేసుకోవటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు వైఎస్ జగన్ ఫీవర్ పట్టుకుందనే విమర్శలు .. రాజకీయ నాయకులు మద్య బలంగా వినిపిస్తున్నాయి.
వైఎస్ జగన్ జైలు నుండి బయటకు వచ్చిన నాటి నుండి.. తెలుగుదేశం పార్టీలోని నాయకులకు నిద్రలేకుండా పోతుందనే విమర్శలు రాజకీయ కార్యకర్తల మద్య వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేసిన విషయం తెలిసిందే. అలాగే వైఎస్ జగన్ కూడా లోటస్ పాంట్ లో దీక్ష చేసిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరు సమైక్యాంద్ర కోసం దీక్ష చేయటం ఆశ్చర్యం. కానీ.. ఇద్దరు చేసిన దీక్షలకు ప్రజల నుండి పెద్దగా స్పందన రాలేదు. దీంతో వైఎస్ జగన్ కొత్త పంథా అమలు చేయటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. అంటే వైఎస్ జగన్ ఈనెల 26న హైదరాబాద్ లో సమైక్య శంఖారావం సభ నిర్వహించటానికి సిద్దమవుతున్నారు.
ఒక వేళ ఈ సభ హైదరాబాదులో సక్సస్ అయితే మాత్రం .. సీమాంద్ర ప్రజలందరు జగన్ వైపు తిరిగే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా .. సభ ముగిసిన అనంతరం.. వైఎస్ జగన్ రాష్ట్ర పర్యట చేయటానికి సన్నహాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో గుబులు పుడుతంది. ఒక జగన్ గానీ ..రాష్ట్ర పర్యటన చేస్తే.. మాత్రం సీమాంద్రలో ఉన్న టిడిపి నాయకులు, కార్యకర్తలు .. సైకిల్ దిగి.. ఫ్యాన్ గాలికి పడిపోయే అవకాశం ఎక్కువుగా ఉందని టిడిపి నాయకులే స్వయంగా ఎన్టీఆర్ భవన్ లో చెప్పుకుంటున్నట్లు వైసీపీ సీనియర్ నాయకులు అంటున్నారు.
అందుకే ఈసారి జగన్ ఫీవర్ నుండి తప్పించుకోవటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు భారీ ఎత్తున్న చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే జగన్ ఫివర్ తట్టుకోవాలంటే.. ఇప్పడు టిడిపి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఎంతైన ఉందని పార్టీలోని సీనియర్ నాయకులు చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. ఈ విషయం పై చంద్రబాబు పూర్తిస్థాయి ఆలోచించి నిర్ణయం తీసుకుందామని నాయకులతో చెప్పినట్లు టిడిపి వర్గాలు అంటున్నాయి. కానీ చంద్రబాబు ఆరోగ్యం రీత్య ఇప్పుడున్న పరిస్థితుల్లో.. కనీసం నిలబడి మాట్లాడే ఓపిక ఆయనలో లేకపోవటంతో.. టీడిపి నాయకులు ఆందోళన చెందుతున్నారు.
ఏమైన సమైక్యాంద్ర కోసం జగన్ దూకుడు పెంచితే మాత్రం.. టిడిపి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. అయిన 2014 ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేసిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. రాజకీయల్లో ఎప్పుడు ఏ రంగు మారుతుందో చెప్పటం చాలా కష్టం. నిన్నటి వరకు కత్తులు దూసిన రాజకీయ నాయకులు.. ఈరోజు ఐ లవ్ యు చెప్పుకోని.. కౌలిగించుకుంటున్న రాజకీయపు రోజులు లివి. ఓటరు ఎప్పుడు అలాగే ఉంటాడు.. రాజకీయ నాయకులే ఎన్నిసార్లైన మార్పు చెందుతారు. టిడిపి, వైసీపీ భవిష్యత్తు ఏమిటో చూడాలంటే.. 2014 వరకు ఆగాల్సిందే....
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more