వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలు జీవితం గడిపి, బెయిల్ మీద బయటకు వచ్చిన తరువాత మొట్టమొదటి సారిగా మీడియా విలేకర్లతో మాట్లాడటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హైకమాండ్ చేసిన రాష్ట్ర విభజన ప్రకటన తరువాత.. యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. హైకమాండ్ విభజన ప్రకటన చేసిన వెంటనే.. వైసీపీ నాయకులు రాజీనామాలతో రాజకీయాల్లో కొత్త సంచనలం స్రుష్టించారు. జైలు నుండి జగన్ రాకతో.. రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు, బీజేపి నాయకులకు కొత్త భయం పట్టుకుంది. కానీ టీఆర్ఎస్ నాయకులకు, ఎంఐఎం నాయకులు మాత్రం కొత్త ఊపిరి పీల్చుకోవటం జరిగిందని వైసీపీ నాయకులు అంటున్నారు.
జగన్ రాకతో.. సీనియర్ రాజకీయ నాయకుల నుండి, జూనియర్ కార్యకర్తల వరకు.. జగన్ ను కలిసే పనిలో బిజీగా ఉన్నారు. రాబోయే ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని, జగన్ రాజకీయ మంతనాలు జరుపుకొని, తమ రాజకీయ సీటుపై కచ్చిఫ్ వేసి వెళ్లుతున్న నాయకులు చాలా మంది ఉన్నారని వైసీపీ కార్యకర్తలు గొప్పగా చెప్పుకుంటున్నారు. అయితే ఎంఐఎం నాయకులు మాత్రం త్వరలో జగన్ ను కలిసేందుకు సిద్దమువతున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమమే నా ఊపిరి, తెలంగాణ రాష్ట్రం కోరకు నా పార్టీ అంటూ.. ప్రకటించుకొని, తెలంగాణలో హీరో ఎదిగిపోయిన .. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసిఆర్) ఇప్పుడు తెర వెనుక కొత్త విధానం మొదలుపెట్టాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా నిజాం కాలేజీలో కేసిఆర్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అని రాజకీయ మేధావులు అంటున్నారు. తెరవెనుక వైఎస్ జగన్ తో మంతనాలు జరుపుకున్న తరువాతనే. ‘‘ సకలజన భేరి’’ సభకు కేసిఆర్ హాజరైనట్లు సమాచారం.
ఈ సభలో కేసిఆర్ ద్రుష్టి మొత్తం సీమాంద్ర నాయకులే మీదనే పెట్టారు. కేసిఆర్ టార్గెట్ .. తెలంగాణ రాష్ట్రం కాదనే విధంగా.. సీమాంద్ర నాయకులను, సీమాంద్ర ప్రజలను రెచ్చగొట్టానికే సభలో ఎక్కువ సమయం కేటాయించారనే విమర్శలు బలంగా తెలంగాణ నాయకుల నుండి వినిపిస్తున్నాయి. ఆటలో విజయం సాధించిన వాడు సైలెంటుగా ఉంటాడు..కానీ కేసిఆర్ మాత్రం అందుకు విరుద్దంగా ప్రవర్తించారు. రాష్ట్ర విభజన ప్రక్రియ కేంద్రంలో నడుస్తున్న సమయంలో.. సీమాంద్ర నాయకులను రెచ్చగొట్టే విధంగా, మాట్లాడి.. తెలంగాణ నోట్ కు అటకం కలిగిస్తున్నాడని .. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కేసిఆర్ సభలో చేసిన వ్యాఖ్యాల తరువాతనే.. సీమాంద్ర నాయకులు.. ‘‘ మా ఒత్తిడి వల్లే తెలంగాణ నోట్ ఆగిందనే ’’ ప్రకటనలు మీడియా ముందు చెప్పటం జరిగింది. దీనికి కారణం కేసిఆర్ అనే విమర్శలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మద్య వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు కేసిఆర్ తెరపై ఆడిన ఆటలకే అందరికి తెలుసు. కేసిఆర్ తెర వెనుక వైఎస్ జగన్ తో పెద్ద భగవతం నడుపుతున్నట్లు .. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. నిన్న జగన్ మీడియాతో త్వరలో సమైక్యాంద్ర కోసం హైదరాబాద్ లో ‘ సమైక్య శంఖారావం ’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని జగన్ చెప్పటం జరిగింది. హైదరాబాద్ లో జగన్ సమైక్యాంద్ర సభ పెట్టానికి కారణం ఏమిటి? ఈ సభ పెట్టడం వెనుక ఎవరు ఉన్నారు? ఇప్పుడు పరిస్థితుల్లో జగన్ హైదరాబాదులో సభ పెడితే పరిస్థితి ఏమిటి? ఎలా ఉంటుంది? ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా? తెలంగాణ వాదులు జగన్ సభకు ఒప్పుకుంటారా? అడ్డుకుంటారా? అనే ప్రశ్నలు తెలుగు ప్రజలను వేధిస్తున్నాయి. కానీ జగన్ సభ పెట్టానికి మొదటి కారణం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ అనే మాటలు వైసీపీలో బలంగా వినిపిస్తున్నాయి. కేసిఆర్ వైఎస్ జగన్ తో నడుకున్న తెర వెనుక రహస్యంలో హైదరాబాద్ లో సమైక్యాంద్ర సభ ఒకటి అని వైసీపీ లోని సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.
తెలంగాణ టిడిపి నాయకులు కూడా కేసిఆర్ అండతోనే జగన్ సమైక్యాంద్ర సభ పెడుతున్నాడని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా కేసిఆర్ వ్యవహరిస్తున్న తీరుపై చెవులు కొరుకుంటున్నారు. సీమాంద్రలో జగన్ , తెలంగాణ లో కేసిఆర్.. ఇద్దరు కలిసి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే మాత్రం . కాంగ్రెస్, టిడిపి , బీజేపి పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని రాజకీయ మేధావులు అంటున్నారు. ఈ ఇద్దరి కలియక గురించి పూర్తిగా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more