ఇటీవల మీడియాలో అంబటి అరుపులు బాగా వినిపిస్తున్నాయి. కొన్ని రోజలు వరకు అంబటి రాంబాబు మీడియా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో అంబటికి జైల్లో ఉన్నజగన్ వార్నింగ్ ఇవ్వటం వలనే మీడియాకు దూరంగా ఉన్నట్లు అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే గత కొద్ది రోజుల నుండి అంబటి మీడియా తన అరుపుల దూకుడు పెంచాడు. తెలుగుదేశం పార్టీ పై మీడియా ముందు ఘాటైన విమర్శలు చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వటం వలనే రాష్ట్ర విభజన జరిగిందని, రాష్ట్రం విడిపోవటానికి కారణం చంద్రబాబే అని అంబటి కామెంట్స్ చెయ్యటం జరిగింది. సమైక్యాంద్రకు మద్దతుగా చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ పేరుతో బస్సు యాత్ర మొదలుపెట్టారు. బాబు చేస్తున్న బస్సు యాత్రపై అంబటి తనదైన శైలిలో విమర్శలు చెయ్యటం జరిగింది. సమైక్యాంద్ర కోసం సీమాంద్ర ప్రజలు నెలరోజుల నుండి ఉద్యమం చేస్తుంటే.. చంద్రబాబుకు ఇప్పుడు మెళుకువ వచ్చిందా? చంద్రబాబు ఇప్పుడు నిద్రలేచాడా? ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్న చంద్రబాబు బస్సు యాత్ర పేరుతో సీమాంద్ర ప్రజలను, ఉద్యమాన్ని ఎగతాళి చెయ్యటానికే బస్సుయాత్ర చేస్తున్నాడని అంబటి రాంబాబు మీడియా ముందు అరుస్తున్నాడు. అంబటి అరుపులకు టిడిపి నాయకులు కూడా మంచి కౌంటర్ ఇవ్వటం జరిగింది. అమ్మ అయిదు రోజులు, అబ్బాయి ఏడు రోజులు దీక్షల పేరుతో దొంగనాటకం ఆడారని టిడిపి నాయకులు అంటున్నారు. అంతేకాకుండా.. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిచాన ఎత్తివెయ్యటంతో.. ఇప్పుడు జగన్ చెల్లెల్లు షర్మిల 'సమైక్య శంఖరావం' పేరుతో సీమాంద్రలో బస్సుయాత్ర చేస్తున్న విషయం అందరికి తెలుసునని టిడిపి నాయకులు అన్నారు. షర్మిల బస్సుయాత్ర కేవలం జగన్ బెయిల్ కోసమేనని టిడిపి నాయకులు అంటున్నారు. గుంటూరులో జరిగిన చంద్రబాబు బస్సుయాత్రకు జనం లేకపోవటంతో..సాయంత్రం వరకు బస్సుయాత్ర ప్రారంభం కాలేదని అంబటి ఆరోపించారు. 30రోజులు తరువాత నిద్రలేచి ప్రజల్లోకి వస్తే ఇలా ఉంటుందని వైసీపీ నాయకులు చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more