కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి ఇప్పుడు తెలంగాణ నుండి స్వీట్ బాక్స్ లు ఢిల్లీకి రెఢీ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షడు కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆద్వరంలో ఈ స్వీట్ డబ్బాలు రెఢీ అవుతున్నట్లు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. ఇది కే కేశవరావు సలహా మేరకు ఢిల్లీ పెద్దలకు తెలంగాణ ప్రాంతం నుండి తయారు చేసిన స్వీట్లు పంపించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జరిగిన కోర్ కమిటిలో సోనియాగాంధీ తెలంగాణ కు అనుకూలంగా నిర్ణయం తీసుకుందనే సంకేతాలు రావటంతో.. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో సీమాంద్ర నాయకులు ఎన్ని కుట్రలు పన్నినప్పటికి.. సోనియగాందీ మాత్రం తెలంగాణ పై గట్టి నిర్ణయం తీసుకుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఢిల్లీలో వార్ రూమ్ లో జరిగిన విషయాలను కేసిఆర్ ఎప్పటికప్పడు.. తన ఇమేజ్ తో ఢిల్లీ పెద్దల నుండి తెలుసుకున్నట్లు టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. నేషనల్ మీడియాలో కూడా తెలంగాణ పై సోనియగాంధీ స్పష్టతకు వచ్చినట్లు ఉక దంపుడుగా తెలంగాణ న్యూస్ చెప్పటంతో.. ఆయా నేషనల్ మీడియాలకు రేటింగ్ బాగా పెరిగినట్లు ఢిల్లీ మీడియా వర్గాలు అంటున్నాయి.
అమ్మ తీసుకున్న నిర్ణయంతో సీమాంద్ర నాయకుల్లో కొత్త భయం పుట్టినట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే తెలంగాణ పై ప్రకటన వచ్చిన వెంటనే .. కేసిఆర్ స్వీట్ బాక్స్ తో అమ్మ కలిసి.. టీఆర్ఎస్ పార్టీ విలీనం చేసే విషయం పై మాట్లాడేందుకు సిద్దంగా ఉన్నట్లు టీఆర్ఎస్ పార్టీలోని సీనియర్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఈ విలీనం వెనుక పెద్ద రహస్యం దాగి ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సోనియగాంధీ తెలంగాణ ఇస్తే. తెలంగాణ ప్రజలకు ఇక టీఆర్ఎస్ పార్టీతో సంబంధం ఏం ఉంటుంది? తెలంగాణ ప్రజలు ఇప్పటికే అనేక సార్లు తెలంగాణ ఇచ్చిన వారికే.. మా ఓటు అంటూ బహిరంగ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని కేసిఆర్ ముందుగానే పసిగట్టి.. తన పార్టీని కాంగ్రెస్ పార్టీ విలీనం చేసేందుకు సిద్దమైనట్లుగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కొసమెరుపు ఏమిటంటే.. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ .. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో ముచ్చటించుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more