ప్రముఖ మాజీ సినీ నటి, ఉత్తరప్రదేశ్ రాంపూర్ నియోజక వర్గం పార్లమెంటు సభ్యురాలు అయిన జయప్రత గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఇక్కడ ఏ పార్టీలో చేరే విషయం అయి స్పష్టత రాలేదు కానీ ఆమె వైయస్సార్ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు మాత్రం వార్తలు వచ్చాయి. గత కొన్ని రోజుల క్రితం ఆమె దివంగత ముఖ్యమంత్రి కి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో వైయస్సార్ సీపీ తీర్థం పుచ్చుకోవడమే తరువాయి అనుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోకి మళ్ళీ ప్రేవేశించి 2014 ఎన్నికలలో పోటీ చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్న జయప్రద ఇక్కడ రాజమండ్రి ఎంపీ సీటు పై ఆశలు పెట్టుకుంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాజమండ్రి టిక్కెట్ ఖరారు చేయడంతో ఆ పార్టీ నుండి టిక్కెట్ రాదని భావించిన ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె సోనియాగాంధీని కూడా కలిసిందని, వారి మధ్య రాజమండ్రి ఎంపీ సీటు విషయం పై కూడా చర్చ జరిగిందని రాజకీయ వర్గాల సమాచారం.
ఒక వేళ రాజమండ్రి టిక్కెట్ కాకుండా అదే రాంపూర్ నుండి కాంగ్రెస్ తరుపున ఎంపీ టిక్కెట్ కావాలని అడిగిందని అంటున్నారు. ప్రస్తుతం రాజమండ్రికి సీనియర్ మోస్ట్ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంపీగా ఉన్నారు. ఈమెకు టిక్కెట్ ఇవ్వాలంటే అరుణ్ కుమార్ ని ఒప్పించాలి. అది జరిగే పని కాదని కొందరు అంటుండంతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం ఆలోచనలో ఉందట. ఇక తెలుగు దేశంలో పార్టీలో చేరుదామంటే గతంలో ఇందులో నుండే బయటకు వచ్చింది. పైగా రాజమండ్రికి మొరళీ మోహన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అన్ని దారులు మూసుకుపోవడంతో కాంగ్రెస్ పార్టీ పై పడింది ఈమె కన్ను. మరి ఈమెకు టిక్కెట్ ఇచ్చి ఆదరిస్తారో లేక నడిసంద్రంలో వదిలేస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more