వైవిధ్యమైన కథలని ఎంచుకుంటూ, తనదైన శైలి లో ముందుకు సాగిపోతున్నాడు, కింగ్ నాగార్జున... ప్రతీ చిత్రానికి తన నటనలో, హావ భావాలలో మార్పు చేస్తూ, కుర్ర హీరోలతో సమానంగా, ఒక విధంగా చెప్పాలంటే ఒక మెట్టు ఎక్కువగా నాగ్ తన హీరోఇజాన్ని చూబిస్తూ, అభిమానులకు ఎవర్గ్రీన్ మన్మధుడిగా వినోదాన్ని పంచుతున్నాడు. ఒకప్పుడు, తన తోటి హీరోలతో సమానంగా, ఫ్యామిలీ, కామెడి, యాక్షన్, మాస్ సినిమాలు చేసిన నాగ్, తరువాత తన సైలిని మార్చుకుంటూ, మన్మధుడిగా ఎదిగాడు... తనకంటూ, అమ్మాయిలలో ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు... యెంత మంది కుర్ర హీరోల హవా కొనసాగినా, నాగ్ అంటే ప్రత్యేకమైన గుర్తింపు, అభిమానుల్లో దక్కించుకున్నాడు... ఈ మధ్య విడుదల అయ్యి, విజయం సాధించిన 'ఢమరుకం' చిత్రంలో, తన వయస్సు ఉన్న ఇక ఏ కధానాయకుడు చెయ్యని ప్రయత్నం, 6 ప్యాక్ బాడీని పెంచి, 'నాగ్' తన సతా ఏంటో చాటాడు...
అటు అన్నమయ్య, రామదాసు, షిరిడి సాయిగా భక్తీ రసాన్ని నటనతో మేళవిస్తూనే, ఇటు మాస్ నుండి రగడ వరకు పక్కా కమర్షియల్ సినిమాలు చెయ్యడమే కాక, ప్రేక్షకుడిని తన శైలితో కన్విన్స్ చెయ్యడం నాగ్ కే చెల్లింది. ఇంతే కాక, ఒక వ్యాపార వేత్తగా తెలుగు సినీ పరిశ్రమలో అందరితో సత్సంబంధాలు ఉన్న వ్యక్తిగా, నటుడిగా నిర్మాతగా, ఒకటేమిటి, తను చేపట్టిన ప్రతీ రంగంలో విజయం సాధించడం నాగ్ శైలిని ఆవిష్కరిస్తుంది..అసలు ఇంట ఎందుకు తన కుమారుడు హీరోగా కొనసాగుతున్నా, తానూ కూడా స్టార్ హీరోగా సినిమాలు చేయ్యదమేకాక, విజయాలు అందుకున్తున్నాదంటే ఎవ్వరైనా, 'నాగ్ ఖచ్చితంగా కింగ్' అని ఒప్పుకోవాల్సిందే... 'ఢమరుకం' తో విజయ ఢంకా మ్రోగించిన తరువాత, 'భాయ్' గా త్వరలో ముస్తాబవుతున్నాడు, కింగ్.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more