Powerstar pawan kalyan birthday wishes

Powerstar Pawan Kalyan Birthday Wishes,Power Song for Power Star,Pawan Kalyan Power Star Pawan Kalyan's birthday September 12 Cameraman Gangatho Rambabu

Powerstar Pawan Kalyan Birthday Wishes

Powerstar 00.gif

Posted: 09/01/2012 03:54 PM IST
Powerstar pawan kalyan birthday wishes

power star pawan kalyan birthday wishes

Powerstar Pawan Kalyan Birthday Wishes

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షాలు.
సెప్టెంబర్ 2న పుట్టిన రోజు పండుగ జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ మరిన్ని విజయాలను సొంతం చేసుకొని తెలుగు సినిమా స్టామినాను, తెలుగు వాడి పవర్ ను దశదిశలా వ్యాపింపజేయాలని మనస్సూర్తిగా కోరుకుంటుంది ఆంద్రవిశేష్.
పవన్ అంటే
ప = పవిత్రమై మనసు కలిగిన వ్యక్తి
వ = వందకోట్ల భారతీయుల పవర్ లాంటి వ్యక్తి
న్ = ఉన్నతమైన ఆశయాలు ఉన్న నెంబర్ వన్ వ్యక్తి . అభిమానులకు నెంబర్ వన్ శక్తి.
పవన్ కళ్యాణ్ ప్రసిద్ధుడైన కొణిదెల కల్యాణ్ బాబు తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ గా వెలుగుతున్న చిరంజీవి సోదరుడు. కొణిదెల వెంకటరావు, అంజనా దేవిల మూడవ కుమారుడు కొణిదల కళ్యాణ్ బాబు. పవన్, సెప్టెంబరు 2, 1973న జన్మించాడు. పవన్, పరిశ్రమలోని తన అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తి ని పెంచుకున్నాడు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా "కళ్యాణ బాబు"గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. పవన్ కు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది.

తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. తన చిత్రాలకి, చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఫైట్ లని రూపొందించారు. బద్రి చిత్రం లో మేరా దేశ్ హై ప్యారా ప్యారా తెలుగు, హిందీ మరియు ఆంగ్లముల కలయిక తో త్రిభాషా గీతంగా, ఖుషి లో యే మేరా జహాన్ గీతాన్ని పూర్తి నిడివి హిందీ గీతంగా రూపొందించారు. ఖుషి చిత్రంలో ఆడువారి మాటలకు అర్ధాలు వేరులే, జాని చిత్రంలో ఈ రేయి తీయనిది పాటలని రీ-మిక్స్ చేయించారు. ఖుషి లోని ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ పవన్ కళ్యాణ్ ప్రతిభకు తార్కాణం. మార్షల్ ఆర్ట్స్ లో దిట్ట కావటంతో పవన్ కళ్యాణ్ చిత్రాలలో చాలా స్టంట్ లు నిజంగానే చేసినవే ఉంటాయి. అటువంటి స్టంట్ లను పవన్ చిత్రాల్లో ప్రత్యేకంగా స్లో మోషన్ లో చూపించటం జరుగుతుంది.

Powerstar Pawan Kalyan Birthday Wishes

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినానే ఏమిటో.. ప్రపంచానికి తెలియజేశాడు గబ్బర్ సింగ్ . (పవన్) సింహం ఒక్క అడుగు వెనక్కు వేసిదంటే.. దాని అర్థం వంద అడుగులు ముందుకు దూకడానికే  రెఢి అయిందని నిరూపించాడు  పవన్.    పవన్ కళ్యాణ్ కు  బ్లాక్ బస్టర్  లేదని ఫీలయ్యే ప్రతి అభిమానికి  గబ్బర్ సింగ్  కురిపించిన కలెక్షన్  సునామీలో  తడిసి ముద్దవ్వల్సిందే.   పవన్ స్టార్  హిట్టు కొడితే  ఏ రేంజ్ లో  ఉంటుందో  అందరికి తెలిసిపోయింది.

Powerstar Pawan Kalyan Birthday Wishes

తెలుగు వాడి ఫంచ్ దెబ్బ ఎలా ఉంటుందో  అన్నీ సినీ రంగాలకు రుచి చూపించిన గబ్బర్ సింగ్ , పవర్ స్టార్  పవన్ కళ్యాన్.  పసి వయసు నుంచే  పుడుతుంది ప్రతి ఒక్కరిలో పవర్ స్టార్ ను చూడాలని.  పెరుగుతున్న వయసు కొద్ది  ఆ పవరే ప్రాణం అవుతుంది అభిమానికి .  తొడలు కొట్టకపోయిన, మీసాలు తిప్పకపోయిన , పవన్ కళ్యాణ్ చూసే కంటి పవర్ కే టన్నుల కొద్ది అభిమానులు పుట్టుకోస్తారు.

Powerstar Pawan Kalyan Birthday Wishes

 పవన్ కళ్యాణ్  హిట్  వస్తే  ఒక లాగా .. ప్లాపు వస్తే  మరోలా ఫీలయ్యే  మనస్తత్వం పవన్ కళ్యాణ్ ది కాదు.  అలాగాని ఒక్క హిట్టు రాగానే ఆర్భాటపు ప్రచారాపు చేసుకునే  తత్వం  కూడా కాదు ఆయనది.  వేరే హీరోతో పోటీ పడటం.. తర్వాత  చిత్రం వాళ్ల సినిమా కన్నా ఎక్కువ కలెక్షన్లు  కురిపించాలని  ఆశించడం ఇలాంటివేమీ అస్సలు పట్టించుకోరు పవన్ కళ్యాణ్ .  అందుకే ఆయన రూటే  సెపరేటు.  ఆయన ఎవరికి అర్థం కానీ వేగు చుక్క లాంటి వ్యక్తి.  ఆయన గుండెల్లో పేదవారికి ఏదో ఒకటి చేయాలనే తపన మాత్రం ఉంటుంది. 

Powerstar Pawan Kalyan Birthday Wishes

వెయ్యి రూపాయలు దానం చేసి 10 టీవీ ఛానల్స్ ను పిలిచి లక్ష సార్లు చెప్పుకునే టైప్ కాదు.  తెలుగు సినీ రంగంలో  ఎంతో మంది  పవన్ కళ్యాణ్  ప్రత్యక్షంగానో పరోక్షంగానో  లభ్దిపొందేవుంటారు.  ఏ రోజు   పవన్ ఫలానా వారికి  సాయం చేశానని .. ఫలానా వ్యక్తికి  ఆర్థిక  లబ్ధి  చేకూర్చానని  గొప్పలు  చెప్పుకోరు.  ఆయనకు చిన్న పెద్ద తేడ లేదు .. పేద ధనిక అనేభేదం అస్సలు లేదు.  ఎలాంటి వారినైనా టాలెంట్  ఉన్నదంటే   టాలీవుడ్ లో మొదటిగా ప్రోత్సహించేంది  పవన్ కళ్యాణ్ ఒక్కడే.

Powerstar Pawan Kalyan Birthday Wishes

ఈ మాట గుండె మీద చెయ్యివేసుకొని చాలా మంది చెబుతారు. ‘‘ ఆయన కు తిక్కుందని అంటారు.. కానీ ఆ తిక్కులో ..వందల మందిని బతికించే లెక్కుందని ఆయనకు మాత్రమే తెలుసు.. అదే పవన్ కిక్క్’’  అసలు పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ ను అభిమానులు అంతగా ఎందుకు  ఆరాధిస్తారు?  తెలుసా?  ఆయన దగ్గర ఎక్కడ దొరకని  క్రమశిక్షణ,  మంచితనం, నిజాయితీ,  సేవాభావం ఉన్నాయి.  అందుకే ఆయనంటే  యూత్ కు ఒక ఐకాన్ గా  నిలిచిపోతాడు.  పవన్ లో ప్రత్యేక మైన గుణం  ఒక్కటి ఉంది. 

Powerstar Pawan Kalyan Birthday Wishes

ఆయన మాటల్లో కాకా  చేతల్లో  చేసి చూపిస్తాడు.  ( నిర్మాతలను  శ్రేయస్సును  మనసులో  ఉంచుకోని  ముందుగా తన రెమ్యునరేషన్  కూడా తగ్గించుకుంటున్నట్లుగా  ప్రకటించి  మిగిలిన హీరోలందరికీ ఆదర్శంగా  నిలిచారు.  అంతేకాకుండా కష్టాల్లో ఉంటే  నిర్మాతలకు  ఆయన ఆదుకున్న  సందర్భాలు ఉన్నాయి.ఇటీవల  చేసిన తీన్ మార్  సినిమా  వలన నష్టపోయిన  నిర్మాత  బండ్ల గణేష్ ను ఆదుకున్న విషయం తెలిసిందే)   ఇవన్నీ మనకు తెలిసిన కోణమే.

Powerstar Pawan Kalyan Birthday Wishes

కానీ ఆయన కు రెండో కోణంలో  ఆయన మంచి మనసు .. ..  సామాజిక  సేవద్రుక్పథం.. సాయం చేసి  ప్రతిఫలాన్ని ఆశించని తత్వం  ఇలాంటి అత్యున్యత లక్షణాలు  కలిగిన  ఏకైక రియల్ హీరో  పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ మాత్రమే.  అందుకే  ఆయన అభిమానులు అంతా పవన్ ఫ్యాన్స్  అని చెప్పుకోవటానికి  గర్వంగా  ఫీలవుతుంటారు. 

Powerstar Pawan Kalyan Birthday Wishes

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Will a separate telangana facilitate merger of trs and congress
Vidya signs rs5 crore sari endorsement deal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more