కొన్నాళ్లుగా పెట్టీబేడా పట్టుకుని సొంత రాష్ట్రానికి పయనమవుతోన్న ఈశాన్య రాష్ట్రాల ప్రజల భాయాలకు కారణం తెలిసొస్తోంది. ఎందుకీ భయాలు, ఎందుకీ ప్రయాణాలని తలలు పట్టుకున్న మంత్రులు, అధికారులకు ఇప్పుడిప్పుడే అసలు విషయం బోధపడుతోంది. దీనంతటికీ కారణం పొరుగు దేశం పాకిస్తాన్ భారత్ ను నీడలా వెంటాడటమే అని తెలుస్తోంది. భారత్ ను తీవ్రంగా ద్వేషించే పాకిస్తాన్ మనల్ని దెబ్బతీయడానికి అన్ని దారులు వెతుక్కుంటోంది. అవకాశం వచ్చినప్పుడల్లా దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. తాజాగా అసోం అల్లర్లను పాకిస్తాన్ పావుగా వాడుకుంది. భారత్ లో శాంతి భద్రతలను దెబ్బతీసే ప్రయత్నం చేసింది. అసోంలో జరుగుతున్న జాతి ఘర్షణల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని ఈశాన్య రాష్ట్రాల వారిపై దాడుల జరుగుతాయని కొన్నాళ్లుగా బల్క్ ఎస్ ఎంఎస్ లు, ఎంఎంఎస్ లు వస్తుండం కలకలం రేపుతోంది.
ఈ ఎస్ ఎంఎస్ లు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాల ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ప్రాణభయంతో హడలిపోయేలా చేస్తున్నాయి. ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనతో కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని దాదాపు 30వేల మంది ఈశాన్య వాసులు స్వస్థలాలకు తరలిపోయారు. ప్రభుత్వం హామీ ఇచ్చినా వారి ప్రయాణాలు ఆగడం లేదు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల భయాలను తొలగించేందుకు కేంద్ర హోం శాఖ రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా బల్క్ ఎస్ ఎంస్ లను 15రోజులపాటు నిషేధించింది.
ఎస్ ఎంఎస్ లు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ దర్యాఫ్తులో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఎస్ఎంఎస్ లు పాకిస్తాన్ నుంచి వస్తున్నట్టు కేంద్ర హోం శాఖ గుర్తించింది. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు తుపాన్లు, భూకంపాల మృతుల ఫొటోలకు మార్పులు చేసి, వాటిని మయన్మార్ హింసాకాండ మృతులవిగా పేర్కొంటూ ఈ వెబ్ సైట్లలో ఉంచారని అధికారులు తెలిపారు. వదంతుల ప్రచారం పాక్ నుంచే జరిగిందని ధృవీకరించిన అధికారులు.. ఇందుకు కారణమైన వెబ్ సైట్లను ఇప్పటికే బ్లాక్ చేశారు.
మరో 34వెబ్ సైట్లను గుర్తించామని వాటినీ త్వరలో బ్లాక్ చేస్తామని అధికారులు తెలిపారు. ఇక ఈ ఎస్ఎంఎస్ లు పాకిస్తాన్ లోని ఏ ప్రాంతం నుంచి వచ్చాయన్న దానిపై భారత సాంకేతిక నిపుణుల బృందం విచారిస్తోంది. అరెస్టయిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంపై దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు. అటు బెదిరింపు ఎస్ ఎంఎస్ లు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా పాకుతున్నాయి. రంజాన్ తర్వాత ఢిల్లీలోని ఈశాన్య వాసులపై దాడులు జరుగుతాయంటూ మళ్లీ బెదిరింపు ఎస్ ఎంఎస్ లు పుట్టుకొచ్చాయి. అయితే ఇవి నకిలీవని పోలీసులు తేల్చారు.
మరోవైపు ఈశాన్య వాసులకు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి భద్రత కల్పిస్తున్నాయని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. దక్షిణ భారత్ లో ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు భద్రతే లేకుండా పోయిందంటూ కొన్ని అవాంఛనీయ, అసాంఘిక శక్తులు వదంతులు సృష్టిస్తున్నాయని, వీటిని నమ్మొద్దని ప్రధాన మంత్రి కార్యాలయ సహాయ మంత్రి నారాయణసామి చెప్పారు. ఇక అసోం హింస కుట్రదారుల గురించి విలువైన సమాచారం అందించినవారికి లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తామని సీబీఐ ప్రకటించింది.
అటు అస్సామీయులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కిక్కిరిసిపోయింది. నిన్న ఒక్క రోజే ఐదువేల మంది అస్సామీయులు స్వరాష్ట్రానికి పయనమయ్యారు. హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఐదువేల మంది అస్సామీయులు స్వరాష్ట్రానికి తిరుగుపయనమయ్యారు. ఈస్ట్ కోస్ట్, ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైళ్లు అస్సామీయులతో కిక్కిరిసిపోయాయి. అస్సామీయులకు సహాయపడేందుకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక్కోరైలులో ఒక ఎస్ ఐతో పాటు పదిమంది ఆర్ పీఎఫ్ పోలీసులు హౌరా వరకు వెళుతున్నారు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో మూడు అదనపు సాధారణ టిక్కెట్ కౌంటర్ లను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసులకు తెలియజేయాలని టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉన్న అసోం వాసులకు అన్ని విధాలా భద్రత కల్పిస్తామని సర్కార్ ప్రకటించినా వందతులపై అస్సామీయులు ఆందోళన చెందుతూనే ఉన్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more