P vijaya reddy a danam political war over khairatabad

Vijaya Reddy and Danam Nagender Political War over Khairatabad, MLA seat, Political war

Vijaya Reddy and Danam Nagender Political War over Khairatabad

P. Vijaya Reddy & Danam Political War over Khairatabad.png

Posted: 08/11/2012 07:55 PM IST
P vijaya reddy a danam political war over khairatabad

Danam-Nagender

దివంగత మాజీ మంత్రి పి. జనార్దన్ రెడ్డి కూతురు విజయా రెడ్డి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి  ఈనెల 12వ తేదీ ఆదివారంనాడు ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఆరోజు ఆమె అధికారికంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఖైరతాబాదులోని మహంకాళి దేవాలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించి అక్కడి నుంచి భారీ ఊరేగింపుతో వెళ్లి పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు.

అయితే పీజేఆర్ కుమార్తె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక బలమైన కారణం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఖైరాతాబాద్  శాసనసభా నియోజకవర్గంలో తన తండ్రి పిజెఆర్ చేసిన సేవలు, కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి, ఆ నియోజక వర్గ ప్రజలు పిజెఆర్  దేవుడిగా కొలుస్తారు. అలాంటి నియోజక వర్గంలోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ తన సోదరిని ఆ నియోజక వర్గం నుండి పోటీ చేయించాలని పోయిన ఎలక్షన్స్ లో గట్టి ప్రయత్నాలు చేశాడు. రానున్న ఎలక్షన్లలో దానం ఆ సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తాడు. తన తండ్రి నియోజక వర్గంలో వేరే వారికి స్థానం లేకుండా చేసేందుకు, ముఖ్యంగా దానం కి చెక్ పెట్టాలంటే ప్రస్తుతం ప్రజల్లో  ఎక్కువ ఆదరణ ఉన్న వైయస్సార్ పార్టీలో చేరితే అది సాధ్యమౌవుతుందని భావించే ఆమె వైయస్సార్ పార్టీలో చేరడానికి సిద్ధ పడిందని అంటున్నారు.

ఇదిలా వుంటే, ఆమె సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి బంజారాహిల్స్ శాసనసభా నియోజకవర్గం నుంచి శానససభకు కాంగ్రెసు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయా రెడ్డి ఖైరతాబాద్ సీటును ఆశించారు. అయితే, అందుకు వైయస్ రాజశేఖర రెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదు. ఇప్పుడైతే ఈ టిక్కెటు సాధించవచ్చని ఉద్దేశ్యంతో కూడా అందులో చేరుతుందని అంటున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డితో పి. జనార్దన్ రెడ్డి జీవించి ఉన్నంత కాలం పోరు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి వైఖరిని నిరంతరం తప్పు పడుతూ వచ్చారు. అలాంటి పీజేఆర్ కుమార్తె జగన్ వంతన చేరడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు కొందరు. మరి విజయా రెడ్డి దానం కి చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp stand on scs reservations
Tarakaratna life changed after alekya  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more