గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో అమీతుమీకి సిద్ధమైన మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ ఎట్టకేలకు సొంత దారి ఎంచుకున్నారు. కొత్త పార్టీని ప్రకటించారు. గుజరాత్ పరివర్తన్ పార్టీని స్థాపించినట్టు ప్రకటించారు. రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేశూభాయ్.. మోడీ శకం మొదలైన తర్వాతే ప్రాభవం కోల్పోయారు. కొద్దికాలంగా మోడీ పాలనపై అసంతృప్తితో ఉన్న కేశూభాయ్.. బీజేపీ ఏకవ్యక్తి పార్టీగా మారిందంటూ పరోక్షంగా మోడీపై విమర్శలు గుపిస్తూ వచ్చారు. అసంతృప్తితో పార్టీలో కొనసాగడం సరికాదని భావించిన ఆయన ఈనెల 4న పార్టీకి రాజీనామా చేశారు. తన వర్గం నేతలతో సంప్రదింపులు జరిపిన కేశూభాయ్ గాంధీనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్త పార్టీని ప్రకటించారు. గుజరాత్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో తమ పార్టీ పనిచేస్తుందని కేశూభాయ్ తెలిపారు. గుజరాత్ గుర్తింపును నాశనం చేసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమ పార్టీ రాష్ట్ర ఔన్నత్యాన్ని కాపాడుతుందని పారదర్శక పాలన అందిస్తుందని హామీ ఇచ్చారు.
తమ పార్టీ రాష్ట్రంలోని 182స్థానాల్లోనూ పోటీ చేస్తుందని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మద్దతు లభించే అవకాశాలపై కేశూభాయ్ ఆచితూసి స్పందించారు. ఆర్ఎస్ఎస్ రాజకీయేతర సంస్థ అని ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. మహాత్మాగాంధీ, రవిశంకర్ మహారాజ్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ వంటి మహనీయుల అడుగుజాడల్లో తమ పార్టీ నడుస్తుందని చెప్పారు. కేశూభాయ్ నేతృత్వంలోని గుజరాత్ పరివర్తన్ పార్టీ ద్వారా మోడీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యే వకాశాలున్నాయని రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ లకు గట్టి సవాలు విసర గలిగే తృతీయ శక్తిగా ఆవిర్భవించే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఈ సవాలును మోడీ ఏమేరకు ఎదుర్కొంటారనేది తెలియాలంటే ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకూ వేచి చూడాల్సి ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more