Vijayamma with bible is objectionable

Vijayamma with Bible is Objectionable,AP Politics, AP Politics blog, AP Politics bloggers, AP Politics articles,

Vijayamma with Bible is Objectionable

Vijayamma.gif

Posted: 07/25/2012 03:55 PM IST
Vijayamma with bible is objectionable

Vijayamma with Bible is Objectionable

మొన్న.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు జైలు నుంచి బయటికి వచ్చిన జగన్ పక్కనే ఉన్న వైఎస్ విజయలక్ష్మిని గమనించారా? నిన్న.. సిరిసిల్లలో చేనేత ధర్నాలో ప్రసంగిస్తున్న విజయలక్ష్మిని చూశారా?  రెండు సందర్భాల్లోనూ ఆమె చేతిలో మీకొక పుస్తకం కనిపించింది కదూ! అది ఆమె పర్సనల్ డైరీ అనుకుంటున్నారా? కాదు.. బైబిల్! క్రైస్తవులు పరమపవిత్రంగా భావించే వారి మత గ్రంథం.. బైబిల్!!

విజయమ్మ ఉప ఎన్నికల్లో  లగడపాటి.. జగన్  అవినీతి పరుడు కాదని .. బైబిల్ మీద ఒట్టు వేయాలని  కోరినప్పటకి .. వైఎస్ విజయమ్మలో కొంచెం కూడా లగడపాటి మాటలకు  సమాధానం చెప్పలేకపోయింది.  కానీ  ఇప్పుడు  వైఎస్ విజయమ్మ చేస్తున్న  చేనేత దీక్షలో  మాత్రం  .. బైబిల్ చేతిలో  పట్టుకొని .. కనిపించటం పై అనేక విమర్శలు  వస్తున్నాయి.  లగడపాటికి సమాధానం చెప్పాని  విజయమ్మ ఈరోజు బైబిల్ ను  ఎలా పట్టుకుందని టీఆర్ఎస్ నాయకులు  అడుగున్నారు.ఇంతకీ ఆమె ఎప్పుడు.. ఎక్కడికెళ్లినా ఆ పుస్తకాన్ని ఎందుకు చేతబట్టుకుని వెళ్తున్నారు? అంతటా ఆసక్తి రేకెత్తిస్తున్న చర్చ ఇది. క్రైస్తవమతంపై అమిత విశ్వాసం ఉన్న విజయలక్ష్మి.. బైబిల్‌ను తన చేతిలో ఉంచుకుంటే అంతా మంచే జరుగుతుందని, తనకు రక్షణగా ఉంటుందని, తాను చేపట్టిన పని ఎలాంటి అడ్డంకులూ లేకుండా సవ్యంగా జరుగుతుందని నమ్ముతారని వైఎస్ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే, ఆమె ఖాళీ సమయాల్లో బైబిల్‌ను పఠిస్తారని అందుకనే వెంట తీసుకెళ్తారని వివరించాయి. అయితే.. రాజకీయ వర్గాలు దీన్ని ఇంకోలా విశ్లేషిస్తున్నాయి.

Vijayamma with Bible is Objectionable

క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న విజయలక్ష్మి ఆ గ్రంథాన్ని పఠించడంలో తప్పులేదని.. కానీ, తాను వెళ్లిన చోటికల్లా అలా చేతిలో పట్టుకుని వెళ్లడంలో రాజకీయ లబ్ది కోణం ఉందని ఆరోపిస్తున్నాయి. క్రైస్తవ మైనారిటీ వర్గాలను దగ్గర చేసుకోవాలనే వ్యూహం అందులో ఉందని, 'మనం మనం ఒకటి.. మేం మీ వాళ్లం, మీరు మా వాళ్లు' అని క్రైస్తవులకు సంకేతం ఇస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మాట్లాడకుండా మతప్రచారం చేస్తున్నారని.. చేతిలో బైబిల్‌తో విజయలక్ష్మి ఒక ట్రెండును సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఉదాహరణకు.. మొన్నటి ఉప ఎన్నికల సమయంలో ఆమె ప్రచారానికి వెళ్లినప్పుడు పలు గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో చేతుల్లో బైబిల్ పుస్తకాలు పట్టుకుని పదేపదే ఆమెను ఆకర్షించే ప్రయత్నం చేశారు.సిరిసిల్ల చేనేత ధర్నా సందర్భంగా వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి.. ఒక చేతిలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ పట్టుకొని అన్నీ పాపపు మాటలే మాట్లాడారని టీఆర్ఎస్ ధ్వజమెత్తింది. ఒక్క సత్య వచనం పలకకుండా, అన్నీ అబద్ధాలే చెప్పారని మండిపడింది. బైబిల్ పట్టుకొని తప్పుడు మాటలు మాట్లాడిన విజయలక్ష్మిని, ఆమె కుటుంబాన్ని ఏసుక్రీస్తు, మేరీ మాత క్షమించరని ఆయన చెప్పారు. జరిగిన పొరపాటును అంగీకరించి మొదట జీసస్‌కు, తర్వాత తెలంగాణ ప్రజలకు విజయలక్ష్మి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Vijayamma with Bible is Objectionable

రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మరో మతతత్వ పార్టీగా మారబోతోందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీకి ధీటుగా వైసీపీ కూడా మతాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. వై.ఎస్.విజయలక్ష్మి ఒక పార్టీ గౌరవాధ్యక్షురాలి హోదాలో ఉండి ఓ మత ప్రచారకురాలిగా వ్యవహరిస్తున్నారని, కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు.మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధికోసం చూడటం వైసీపీకే చెల్లిందని వర్ల రామయ్య అన్నారు. పవిత్రమైన బైబిల్‌ను రాజకీయ సభలకు, కార్యక్రమాలకు తీసుకురావడం దేనికి సంకేత మని ప్రశ్నించారు. తమ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవటం దురదృష్టకరమన్నారు. బైబిల్‌ను రాజకీయ కోణంలో ఉపయోగించుకోవడంపై ఆ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhimineni srinivasa rao
Deepika padukone to endorse scooters  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more