వారికి అధికారం ఉంది, చేతిలో ఖజానా భారీగానే ఉంది. కానీ వారు మాత్రం పిసినారి ఎంపీలు. ఒక్క పైసా కూడా పనులకు ఖర్చు పెట్టారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదే! కేంద్రం వందల కోట్ల మేరకు నిధులిస్తున్నా వినియోగించుకోలేని అశక్తత మన ఎంపీలది. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కోసం ఉద్దేశించిన ఎంపీ లాడ్స్ పథకాన్ని ఓ సారి పరికిస్తే ఇది బోధపడుతుంది. ఈ పథకం కింద కేంద్రం కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నా.. వాటిని ఖర్చు చేసేందుకు మన ఎంపీలకు చేతులు రావడం లేదు. పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రం ఎంపీ ల్యాడ్స్ నిధులను 95 శాతం ఉపయోగించుకొంటోంది. ఇక్కడి ఎంపీలకు మాత్రం ఆ నిధులను వెచ్చించే తీరికే దొరకడం లే దు! ఎంపీ లాడ్స్ పథకాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవడంలో అరుణాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర కూడా ముందున్నాయి. ఆయా రాష్ట్రాల్లో 96.3 శాతం, 90.8 శాతం మేర నిధులు వినియోగమవుతున్నాయి. 2009-2010 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు మన 42 మంది ఎంపీలకు కలిపి మొత్తం రూ.588 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో రూ.323 కోట్ల మేరకు కేంద్రం విడుదల చేసింది. వడ్డీతో కలిపి ఇది రూ.338.19 కోట్లకు చే రింది. విడుదలైన ఈ మొత్తంలో రూ.122.38 కోట్ల మే రకే ఎంపీలు ఖర్చు చేసి చేతులు దులుపుకొన్నారు. అంటే సగం నిధులను కూడా వ్యయం చేయలేకపోయారు. నియోజకవర్గాల్లో సమస్యలకు కొదవేమీ ఉండదు. ప్రతి ఎంపీకి ఈ పథకం కింద 2009-2010 ఆర్థిక సంవత్సరానికి రూ.14 కోట్లు కేటాయించారు. రెండేళ్లు గడచినా ఆ ఏడాది నిధులనే ఇంతవరకూ ఖర్చు చేయలేకపోయారు.
అయితే ఎంపీలు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు కేంద్రం మాత్రం నిధులను విడుదల చేసేసింది. ఇందులోనూ కొంత మొత్తాన్నే ఎంపీలు ఖర్చు చేశారు. రోడ్లు, తాగునీ టి పథకాలు, ఇతర సదుపాయాల కల్పన కోసం ఈ నిధులను వెచ్చించొచ్చు. ఎంపీ లాడ్స్ నిధులను మరీ తక్కువగా ఖర్చు చేసిన వారిలో మందా జగన్నాథం, పనబాక లక్ష్మి, జగన్, కావూరి సాంబశివరావు, సర్వే సత్యనారాయ ణ, అసదుద్దన్ ఒవైసీ, ఎం.ఎం. పళ్ళంరాజు, మధుయాష్కీ, అంజన్‌కుమార్‌యాదవ్, కిశోర్‌చంద్రదేవ్, బలరాంనాయక్, కిల్లి కృపారాణి, చింతామోహన్, దగ్గుబాటి పురందేశ్వరి, ఎస్.రాజయ్య, ఉండవల్లి అరుణ్‌కుమార్, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు, జైపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సబ్బం హరి ఉన్నారు. విడుదలైన మొత్తంలో రూ.3 కోట్లకు మించి వీరి ఖాతా ల్లో నిధులు మూలుగుతున్నాయి. వీరికి 6.50 కోట్ల నుం చి 11 కోట్ల వరకు నిధులు విడుదలయ్యాయి. అందరికన్నా ఎక్కువగా నిధులు తెచ్చుకోగలిగింది మందా జగన్నాథమే. ఈయన రూ.11.50 కోట్లు పొందగలిగారు. అయితే ఇందులో ఖర్చుచేసింది సగానికి పైగానే! నిధు లు దాదాపు సంపూర్ణంగా ఖర్చు చేసిన వారిలో సురేశ్‌షెట్కార్, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, విజయశాంతి, నామా నాగేశ్వరరావు, మేకపాటి రాజమోహనరెడ్డి ఉన్నారు. ఎంపీ లాడ్స్‌ను ఖర్చు పెట్టడం లేదని రెండేళ్ల క్రితం కాగ్ కూడా మొట్టికాయలు వేసింది. అయినా మన ఎంపీలు మాత్రం ఇవేవీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పదవికి రాజీనామా చేసినా, లేక కేంద్రం నుంచి ఏమైనా ఇబ్బందులు, ఆటంకాలు కలిగి ప్రభుత్వ మనుగడ సాగించలేని పరిస్థితులు వస్తే ఈ నిధులు అందడం దుర్లభమే!
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more