Legal assistance for ministers issue

legal assistance for ministers issue

legal assistance for ministers issue

20.gif

Posted: 07/09/2012 02:24 PM IST
Legal assistance for ministers issue

     cm వార్త విన్నవారంతా ఇది మరీ విడ్డూరం కాకపోతే ఏంటంటున్నారు.. దేనిగురించంటారా... అవినీతి మం త్రులకు ప్రభుత్వ అండ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరు గని విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు ప్రభుత్వపరంగా ఆర్థిక, న్యాయ సహాయం అందించడం ఏమిటని ప్రతిపక్షాలు నిల దీస్తున్నాయి. కళంకిత మంత్రులకు న్యాయ సహాయం అందించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నాయి. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగంలో పాలుపంచుకున్న మంత్రులకు న్యాయ, ఆర్థిక సాయం అందించడమంటే అవి నీతికి రాచబాట వేయడమేనని విమర్శించాయి.yarram      అంతేకాకుండా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అవినీతి కేసు నుండి బయట పడేసేందుకే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని మండిపడ్డాయి. ప్రభుత్వ తీరుపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు, ప్రభుత్వం కూడా తన వైఖరిని పూర్తిగా సమర్ధించు కున్నది. అంతేకాకుండా స్వయాన కేబినెట్‌ మంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం జైలులో వున్న మాజీమంత్రి మోపిదేవి వెంకట రమణకు కూడా న్యాయ సహాయం అందించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే సిఎంకు లేఖ రాస్తానని కూడా చెప్పారు. మరో మంత్రి పార్ధసారధి కూడా ఇవే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యులు వి.హనుమంత రావు సైతం మంత్రులకు సాయం చేయడాన్ని సమర్ధించారు. అయితే, వైఎస్‌ హయాం నాటి అధి కారులకు మాత్రం ఎలాంటి సాయం అందించ రాదని అన్నారు. మోపిదేవికి సాయం అందించాల్సిన అవసరం వుందన్నారు.

    botsa కిరణ్‌కుమార్‌రెడ్డి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితో లాలూచీ పడ్డారని టిడిపి ఆరోపించింది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కె.ఎర్రంనాయుడు ఎన్‌టిఆర్‌ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లాలూచీ కారణంగానే అవినీతి కేసులో సుప్రీంకోర్టు నోటీసులందుకున్న మంత్రు లకు న్యాయసహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విమర్శించారు. అవినీతి మంత్రులకు అండగా నిలపడమేమిటని ఆయన ఆక్షేపించారు. జగన్‌ ఎదుర్కొంటున్న అవినీతి కేసులను నీరుగార్చడమే ముఖ్యమంత్రి, ప్రభుత్వ లక్ష్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చేపట్ట నున్న ఇందిరమ్మ బాటను ఆయన ఎద్దేవా చేశారు. అవినీతి మంత్రులను వెనకేసుకువస్తున్న కిరణ్‌ కుమార్‌రెడ్డి ఇక ఇంటి బాట పట్టడం ఖాయమని ఎర్రంనాయుడు జోస్యం చెప్పారు. sabita_ponnala

     రాష్ట్రంలో ఆరుగురు మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని నారాయణ అన్నారు. వారు నేరుగా సుప్రీంకోర్టు నుంచి సమన్లు అందుకున్నారని గుర్తు చేశారు. వీరంతా కోర్టు ముందు దోషులుగా నిలబడబోతు న్నారని, అలాంటి మంత్రులకు న్యాయ సహాయం అందించాలని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, ఏకంగా జీఓలు విడుదల చేయడం దారుణమని నారాయణ అన్నారు. సహజంగా అత్యంత పేదలకు న్యాయసహాయం, ఆర్ధికసాయం అందించ డం సర్వసాధారణమని పేర్కొన్నారు. అయితే, ఇక్కడ వేల కోట్ల అక్రమాలు, అవినీతికి పాల్పడిన మంత్రు లకు ప్రభుత్వం సాయమందించడం ఏమిటని నారా యణ సూటిగా ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను అతిపేదల కింద జమ కట్టి ప్రజాధనాన్ని న్యాయ సలహా కోసం ఉపయో గించాలని ప్రభుత్వం భావిస్తున్నదా? అని నిలదీ శారు. కోట్లాది రూపాయల ఆస్తులు కల్గిన మంత్రు లకు ప్రభుత్వం ఏ విధంగా ఆర్ధిక సాయం చేకూరు స్తుందని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలు ఎదు ర్కొంటున్న మంత్రులను తక్షణమే కేబినెట్‌ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

    geeta మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు న్యాయ సహాయం అందించే ఉత్తర్వులు వెలువడడంలో జాప్యానికి ఆయన ప్రభుత్వానికి చేసుకున్న దరఖాస్తు సిఎంఓ కార్యాలయంలో మాయం కావడమే కారణమన్నారు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ. ఈ ఫైల్‌ మాయం కావడానికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంకోవైపు వైఎస్‌ఆర్‌ హయాంలో 26 వివాదాస్పద జీఓల విడుదల విషయంలో అధికారులదే తప్పని, వారికి న్యాయసహాయం అందించాల్సిన అవసరం లేదని రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు అన్నారు. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులకు ప్రభుత్వం న్యాయసహాయాన్ని అందించడాన్ని సమర్ధించారు. మోపిదేవి వెంకటరమణకు కూడా న్యాయ సహాయాన్ని అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అటు సామాన్యప్రజలు సైతం ఈ అంశంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  King fisher airlines in heavy loss
Lagadapati rajagopal letter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more