మందగమనంలోకి జారిపోతున్న ఆర్థిక వ్యవస్థలకు చేయూతనిచ్చేందుకు యూరోపియన్, చైనా కేంద్ర బ్యాంకులు కీలక నిర్ణయాలను ప్రకటించాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్(ఈసీబీ) కీలక వడ్డీరేటును పావు శాతం కోత విధించి 0.75 శాతానికి చేర్చింది. ఇది రికార్డు కనిష్ట స్థాయి కావడం విశేషం. మరోపక్క, చైనా కేంద్ర బ్యాంక్.. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఆశ్చర్యకరమైన రీతిలో వడ్డీరేటును తగ్గించింది. 0.31 శాతం కోత విధించి 6 శాతానికి చేర్చింది. మరోపక్క, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్(బీఓఈ) తాజాగా 50 బిలియన్ పౌండ్ల విలువైన ఉద్దీపన చర్యలను ప్రకటించింది. వ్యవస్థలోకి మరిన్ని నిధులను ప్రవహింపజేసేందుకు రుణపత్రాల కొనుగోలు పరిమాణాన్ని(అసెట్స్ పర్చేజ్ ప్రోగ్రామ్) పెంచింది. వెరసి బీఓఈ మొత్తం అసెట్స్ పర్చేజ్ ప్రోగ్రామ్ పరిమాణం 375 బిలియన్ పౌండ్లకు చేరుకోనుంది. కాగా, వాణిజ్య బ్యాంకుల నిధులపై చెల్లించే అధికారిక వడ్డీరేటును 0.5 శాతంగా కొనసాగించాలని బీఓఈ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. భారత్ చైనా తదితర వర్ధమాన దేశాలతో పాటు అభివృద్ధి చెందిన సంపన్న దేశాల్లో వృద్ధి అంచనాలు మందకొడిగా మారిన తరుణంలో తాజా వడ్డీరేట్ల కోత ప్రకటనలు వెలువడ్డాయి.
తీవ్రమైన రుణ సంక్షోభంతో అల్లాడుతున్న యూరోజోన్‌కు కొంతమేరైనా బూస్ట్ ఇచ్చేందుకు గాను ఈసీబీ ఎట్టకేలకు వడ్డీరేట్లలో కోతకు దిగివచ్చింది. బ్యాంక్ ప్రామాణిక వడ్డీరేటు ప్రస్తుతం 1 శాతం కాగా, ఇప్పుడు దీన్ని 0.75 శాతానికి తగ్గించింది. మరోపక్క, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్) కింద ఇచ్చే రుణాలపైనా వడ్డీరేటును 1.75 శాతం నుంచి 1.5 శాతానికి చేర్చింది. ఇదిలావుండగా, డిపాజిట్లపై వడ్డీరేటును ఏకంగా సున్నాకు తగ్గించేంచేసింది. ఇప్పుడు ఈ రేటు 0.25 శాతంగా ఉంది. చైనా ఆర్థిక వృద్ధిరేటు మందగమనానికి ఊతమిచ్చేలా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా నెలరోజుల్లో ఏకంగా రెండోసారి వడ్డీరేట్ల కోతకు దిగడం గమనార్హం. భారత్‌లోనూ వృద్ధి మందగమనం కొనసాగుతున్నా... ఈ విధమైన చర్యలకు ఆర్‌బీఐ వెనకాడుతోంది. గత నెలలో జరిగిన పాలసీ సమీక్షలో వడ్డీరేట్లను యథాతథగా కొనసాగిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. దీనికి ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను ప్రధాన కారణంగా పేర్కొంది. కాగా, చైనా సెంట్రల్ బ్యాంక్ తన కీలక రుణ రేటును 6.31% నుంచి 6 శాతానికి చేర్చడంతో పాటు డిపాజిట్ రేటును కూడా పావు శాతం తగ్గించింది. ఇప్పుడున్న 3.25% నుంచి 3 శాతానికి కోత విధించింది. నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా గత నెల 7న వడ్డీరేట్లను తగ్గించడం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more