భారత అథ్లెట్ పింకీ ప్రామాణిక్ పేరు ఇప్పుడు సెర్చ్ ఇంజన్స్ లో ఎక్కువుగా టైప్ చేస్తున్నారు. పింకీ మహిళ కాదని, పురుషుడని తనపై రేప్ అటెంప్ట్ చేశాడంటూ ఓ మహిళ పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పింకీ 2006లో జరిగిన దోహా ఏసియాడ్‌లో 4న 400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. అదే ఏడాది మెల్బోర్న్ కామనెవెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న ఆమె అదే ఈవెంట్లో రజత పతకం గెల్చుకుంది. 2006లోనే కొలంబోలో జరిగిన శాఫ్ క్రీడల్లో 400 మీటర్లు, 800 మీటర్ల పరుగుతోపాటు 4న400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో పింకీ క్రీడల నుంచి తప్పుకుంది. ఇటీవలే ఈమె పై రేప్ కేసు నమోదైంది. అత్యంత ఆశ్చర్యకరంగా, పింకీ మహిళ కాదని, పురుషుడనీ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బ్రాగుటీ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఎంతోకాలంగా తనతో ప్రేమ వ్యవహారం నడిపిన పింకీ పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి మోసం చేసినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తనను బలాత్కరించినట్టు ఆరోపించింది.
ప్రతిభగల అథ్లెట్‌గా గుర్తింపు పొందిన పింకీ మహిళ కాదని ఇప్పుడు ఫిర్యాదు అందడంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పింకీ మహిళ కాదని, తప్పుడు సర్ట్ఫికెట్లతో మహిళల విభాగంలో పోటీపడినట్టు రుజువైతే కఠిన చర్యలు తప్పవని భారత అథ్లెటిక్ సమాఖ్య స్పష్టం చేసింది. కాగా, పింకీపై కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి కాదు. 2004 నవంబర్ 22న నాదియాలో కొంతమంది స్థానికులు ఆమె బ్యాగును దొంగిలించారు. పింకీ ప్రామాణిక్ ఒక అథ్లెట్ కంటే కూడా రేప్ కేసు ద్వారా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఈ ఉదంతం రోజు రోజుకీ మరో మలుపు తిరుగుతుంది. పింకీ ప్రామాణిక్ లింగ నిర్దారణ పరీక్షల సందర్బంగా ఆమె నగ్నంగా ఉన్న వీడియో క్లిప్ ఇప్పడు ఇంటర్నెట్లో దర్శనమివ్వడం సర్వత్రా చర్చనియాంశం అయింది. 29 సెకన్ల నిడివితో ఉన్న ఈ ఎంఎంస్ క్లిప్ ఆన్లైన్లో హాల్ చల్ సృష్టిస్తుంది.
కోల్‌కతా సమీపంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో పింకీకి తొలుత లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా ఈ క్లిప్‌ను చేశారని ఆరోపణలు వినపడుతున్నాయి. ‘నాకు కూడా ఈ విషయం తెలిసింది. నేనింకా ఆ వీడియోను చూడలేదు. ఇలాంటి పనులకు కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఈ విషయమై మేము పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిఉంది' అని పింకీ తరఫు న్యాయవాది తుహిన్ రాయ్ అన్నారు. అంతక ముందు లింగ నిర్ధారణ జరపడానికి అవసరమైన సదుపాయాలు బారాసత్ ప్రభుత్వ ఆస్పత్రిలో లేవని, అందువల్ల ఈ కేసును కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆస్పత్రికి నివేదించాలని ఉత్తర 24 పరగణాల జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కోర్టుకు తెలియజేసారు. పింకీ ప్రామ్నిక్ అందరూ అనుకుంటున్నట్లు మహిళ కాదని, పురుషుడని, అందుకే తనపై అత్యాచారం చేసాడంటూ ఒక మహిళ చేసిన ఫిర్యాదుపై పింకీకి లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఈ నెల 29వ తేదీలోగా నివేదిక సమర్పించాలని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జిల్లా వైద్యాధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more