Kcr new story

kcr new story, Telangana, Rayala telangana, kCr, Bhanu kiran, Suri, Congress party, Seemandhra leaders, Lands,

kcr new story

kcr.gif

Posted: 07/03/2012 05:36 PM IST
Kcr new story

kcr new story

కేసిఆర్ కొంత కాలంగా మీడియా దూరంగా ఉన్న విషయం తెలిసిందే.  ఇటీవల  రాయల తెలంగాణ  ప్రకటన తెర మీదకు రావటంతో.. కేసిఆర్  గొంతు అక్కడక్కడ వినిపిస్తుంది.   తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు అంగీకరించకపోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కొత్త కథ వినిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీటి యుద్ధాలు జరుగుతాయని కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు అంటున్న నేపథ్యంలోనే కెసిఆర్ ఓ పవర్‌ఫుల్ స్టోరీని ముందుకు తెచ్చారు. హైదరాబాద్ సిర్ఫ్ హమారా అనే ఓ టీవీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిడికెడు మంది సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డం పడుతున్నారని, అసైన్డ్, అక్రమ భూములను కలిగి ఉన్న నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డం పడుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాదును సమస్యగా చూపడం పెట్టుబడులు పెట్టడం వల్ల కాదని, అక్రమాస్తుల వల్లనే అని ఆయన అన్నారు. చట్టబద్దమై ఆస్తుల విషయంలో సమస్య ఉండదని, అక్రమాస్తులను కలిగి ఉన్నందునే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సమస్య వస్తుందని వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు.

హైదరాబాదు లేని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాము అంగీకరించబోమని కెసిఆర్ అన్నారు. హైదరాబాదు రాజధానిగా తమకు తెలంగాణ రాష్ట్రం కావాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన తప్పదని ఆయన అన్నారు. రాయల తెలంగాణవంటి పిచ్చి ప్రతిపాదనలతో తెలంగాణ ప్రజలు అయోమయానికి గురి కావద్దని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తప్పదని ఆయన అన్నారు. కాగా, హైదరాబాదు చట్టుపక్కల ఉన్న అక్రమాస్తుల కారణంగానే సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారనే కెసిఆర్ మాటలు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాదులోని, హైదరాబాదు పరిసరాల్లోని భూములకు విపరీతంగా గిరాకీ ఉంటూ వస్తోంది. ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారాలు కూడా భారీగానే జరిగాయి. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ ఉదంతం ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha in nuvvostanante nenoddantana hindi remake
Cbi files another chargesheet on hetero drugs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more