No walk over for pranab mukherjee

No walk-over for Pranab Mukherjee,Pranab Mukherjee, House wife, suvra, two sons, one daughter, fish, chicken, EGE,

No walk-over for Pranab Mukherjee

Pranab.gif

Posted: 06/28/2012 05:04 PM IST
No walk over for pranab mukherjee

No walk-over for Pranab Mukherjee

ప్రణబ్ ముఖర్జీ భార్య పేరు 'సువ్రా'. ప్రణబ్ ముఖర్జీ 1957 జూలై 13న సువ్రా ముఖర్జీని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల దృష్టిలోనే కాకుండా, బెంగాలీ ప్రజలందరి దృష్టిలోనూ వారిది ఆదర్శ, అన్యోన్య దాంప త్యం. ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగా గానీ ప్రణబ్ ఏనాడూ తన భార్యని విమర్శించలేదు. కుటుంబ విషయాలకు సంబంధించినంత వరకూ భార్యతో సంప్రదించకుండా ఏ పనీ చేయలేదు. భార్య మాటకు ఆయన ఎంతో విలువ ఇస్తారని బంధువులు చెబుతుంటారు. సువ్రా రవీంద్ర సంగీతంలో చక్కని గాయని. ఒకప్పుడు దేశమంతా తిరి గి ప్రదర్శనలు కూడా ఇచ్చారు. భార్యాభర్తలిద్దరికీ కళలం టే చాలా ఇష్టం. ప్రణబ్ సాధారణంగా బయట భోజనం చేయరు. ఢిల్లీలో ఉన్నారంటే తప్పనిసరిగా భార్య చేతి వంట మాత్రమే తింటారు. ప్రణబ్ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు ఎంతో ఆనందపడిన సువ్రా.. "ఆయన కు బెంగాలీ వంటలంటే చాలా ఇష్టం. మసాలాలు దట్టించాలి. నూనె తక్కువగా వేయాలి'' అని చెప్పారు.

ప్రణబ్ ముఖర్జీకి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు అభిజిత్ తండ్రి మార్గంలో నడిచి రాజకీయాల్లో ప్రవేశించారు. నల్హాతీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికయ్యారు. రెండో కుమారుడు ఇంద్రజిత్ వ్యాపార రంగం లో ప్రవేశించారు. కుమార్తె శర్మిష్ఠకు కళలంటే మక్కువ. ఆమె జైపూర్ ఘరానా కథక్ నృత్యంలో మంచి కళాకారిణి. "మా నాన్న ఎంతగా ప్రేమ చూపిస్తారో.. అంతగా క్రమశిక్షణనూ ఆశిస్తారు. హాస్టల్ రోజుల్లో నేను ఇంటికి వచ్చినప్పుడు అర్ధరాత్రి అయినా కూడా ఆయన ఫైళ్లతో కూర్చుని ఉండడం కనిపించేది'' అని శర్మిష్ఠ అన్నారు. "మా నాన్న క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తారు. చదువు పట్ల శ్రద్ధ ఎక్కువ. ఆడంబరాలు, పటాటోపాలంటే ఏమా త్రం ఇష్టం ఉండదు'' అని అభిజిత్ చెప్పారు. విరామం దొరికిందంటే చాలు.. ప్రణబ్ పాత స్నేహితులతో కాలక్షేపం చేస్తుంటారు. ఆఫీసు పని ముగించుకుని ఇంటికి రాగానే డైరీ రాయడం మొదలెడతారు. ప్రణబ్ యాభై ఏళ్లుగా డైరీ రాస్తున్నారు. ఆ డైరీలను శర్మిష్ఠకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆ డైరీల్లో అనేక రాజకీయ పరిణామాలతో పాటు, కొన్ని 'విస్ఫోటక అంశాలు' కూడా ఉన్నాయని మిత్రులు చెబుతుంటారు.  ప్రణబ్ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నారు. 1945 సమయంలో.. నాలుగో తరగతిలోనే ఆయనకు రెండు రూపాయల స్కాలర్‌షిప్ వచ్చింది. కాలేజీ రోజుల్లో 55 పైసలకు లభించే భోజనంతోనే రోజంతా సరిపెట్టుకునేవారు. ప్రణబ్ రాజకీయ కార్యకర్తగా మారిన తరువాత కూడా కొంతకాలం అధ్యాపకుడిగా, జర్నలిస్టుగా కొనసాగారు. దేషేర్ డాక్ అనే బెంగాలీ దినపత్రికలో కొంత కాలం పనిచేశారు.

ప్రణబ్ ముఖర్జీ ప్రతీరోజూ ఒకే సమయానికి భోజనం చేస్తారు. పప్పన్నం, కోడిగుడ్డు, చేపలు రోజూ ఉండాల్సిం దే. స్వీట్లంటే ఇష్టం. ఇక రోజూ ప్రార్థన చేస్తారు. శనివారం ఉపవాసం ఉంటారు. అర్ధరాత్రి 2 గంటల వరకూ మేల్కొని ఉన్నా.. ఉదయం 6 గంటలకే లేచి, వ్యాయామం చేస్తారు. వ్యాయామానికి ట్రెడ్‌మిల్ ఉపయోగిస్తారు. ఒకప్పుడు చుట్ట తాగేవారు. తర్వాత దానికి స్వస్తి చెప్పడమే కాకుండా.. దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని స్నేహితుల్ని హెచ్చరించేవారు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం కొద్ది సేపు నిద్ర పోవాల్సిందే.  ప్రణబ్ ముఖర్జీ 'మిడ్‌టెర్మ్ పోల్, బియాండ్ సర్వైవల్, ఎమర్జింగ్ డైమన్షన్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఆఫ్ ది ట్రాక్, సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్, ఛాలెంజెస్ బిఫోర్ ది నేషన్' వంటి పుస్తకాలు రాశారు. పుస్తక పఠనమంటే ఆయనకు చాలా ఇష్టం. ఇక ఆయన ఏనాడూ సెల వు తీసుకుని ఎరుగరు. ఎక్కువగా సందర్శించే ప్ర దేశం బేలూరులోని రామకృష్ణ మఠం. ప్రణబ్ క్రమశిక్షణ ను, రాజనీతిజ్ఞతను చూసి బీజేపీ నేత అద్వానీ సైతం "ప్రణబ్ లేనిదే కాంగ్రెస్ మనుగడ సాధ్యం కాదు'' అని వ్యాఖ్యానించడం విశేషం. తనకు ఇంగ్లీషు అంతగా రాద ని ప్రణ బ్ చెబుతుంటారు. ఇక సినిమాలు చూసే అలవాటు త క్కువే. చివరగా 'రంగ్ దే బసంతీ' అనే సినిమా చూశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc president botsa satyanarayana
Viveka not allowed to meet jagan in jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more