Nara lokesh enetering in to direct politics in soon

Nara Lokesh Enetering in to Direct Politics in Soon,Nara, Lokesh, entered, politics,

Nara Lokesh Enetering in to Direct Politics in Soon

Nara.gif

Posted: 06/27/2012 03:12 PM IST
Nara lokesh enetering in to direct politics in soon

Nara Lokesh Enetering in to Direct Politics in Soon

రాష్ట్రాన్ని కాపాడుదాం అనే పేరుతో నారా లోకేష్ ఓ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధమైనట్లు కూడా సమాచారం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ రాజకీయ ప్రవేశానికి కార్యక్రమం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేరుగా తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లోకి తేకుండా మరో మార్గంలో లోకేష్‌ను ముందుకు తేవాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాన్ని కాపాడుదాం అంటూ నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలా రాష్ట్ర పర్యటన చేస్తే లోకేష్‌కు ప్రజల నుంచి లభించే ఆదరణ తెలిసి వస్తుందని, ప్రజలు ఆయనను ఎలా ఆదరిస్తారనే విషయం బయటపడుతుందని, నందమూరి హీరోలు వ్యతిరేకించడానికి వీలు కాదని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి, నారా లోకేష్ ఇప్పటికే పార్టీ వ్యవహారాల్లో తెర వెనక పనులన్నీ చేస్తున్నట్లు సమాచారం. 2009 ఎన్నికల సందర్భంలో నగదు బదిలీ పథకానికి రూపకల్పన చేసింది ఆయనే అని చెబుతారు. అయితే, ఆ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో జాప్యం జరిగిందని, కాస్తా ముందుగా ఆ పథకాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి వాళ్లకు అర్థమయ్యేలా చేస్తే ఫలితాలు తమ పార్టీకి మెరుగ్గా ఉండేవని నారా లోకేష్‌ ఎంట్రీని కోరుతున్న తెలుగుదేశం నాయకులు అంటున్నారు.

కాగా, ఇటీవలి ఉప ఎన్నికల సమయంలో కూడా నారా లోకేష్ కీలకమైన బాధ్యతలే నిర్వహించారని అంటారు. చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల్లో పర్యటిస్తుంటే క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని, వాటిని విశ్లేషించి, స్థానిక నాయకులకు తగిన సూచనలు చేయడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని, స్థానిక నాయకులతో నేరుగా ఆయన మాట్లాడుతూ మార్గదర్శకత్వం చేశారని అంటున్నారు.నారా లోకేష్ కుమార్ రాజకీయ ఆరంగేట్రంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా విన్నారని సమాచారం. ఉప ఎన్నికలలో ఓటమిపై రాయచోటి, రైల్వేకోడూరు నియోజకవర్గాల సమీక్షలు ఎన్టీఆర్ భవనంలో జరిగాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు లోకేష్ రాజకీయ ఆరంగేట్రంపై అధినేతకు సూచించినట్లుగా సమాచారం.

లోకేష్‌ను రాజకీయాలలోకి తీసుకు రావాలని వారు బాబును కోరారు. పార్టీ సుప్రీంగా చంద్రబాబు ఉంటూనే.. యువతకు ప్రాధాన్యతనిచ్చే విధంగా కుమారుడిని కూడా పార్టీలోకి తేవాలని సూచించారు. అన్ని విషయాలు మీ వరకు తీసుకు రాలేమని, కొన్ని విషయాలు చెప్పుకోవడానికి ఒక నేత కావాలని, ఇప్పుడు పలువురు నేతలు ఉన్నప్పటికీ, యువతను ప్రోత్సహించే క్రమంలో లోకేష్‌ను తీసుకు రావాలని సూచించారని సమాచారం. దీంతో మొత్తానికి లోకేష్‌ను రాజకీయాలలోకి తీసుకు వచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని అర్థమవుతోందని అంటున్నారు. ఇది వరకు ఖండించడం ఇప్పుడు మౌనంగా ఉండటం చూస్తుంటే త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ విషయంలో బాబుదే తుది నిర్ణయమని చెబుతున్నారు.తెలుగుదేశం పార్టీలో ఓ వర్గం నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో కీలక భూమిక పోషించాలని కోరుకుంటోంది. ఇదే విషయాన్ని చంద్రబాబుతో వారు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranab mukherjee behind cover up on netajis air crash alleges book
Mla jogi ramesh makes sensational comments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more