Hema malini reveals esha deols wedding plans

Hema Malini reveals Esha Deol's wedding plans,bharat takhtani,bharat takhtani business,bhart takhtani,bollywood,esha deol,esha deol getting married,esha deol marriage,esha deol wedding,events,hema malini,isha deol marriage

Hema Malini reveals Esha Deol's wedding plans

Esha.gif

Posted: 06/20/2012 06:56 PM IST
Hema malini reveals esha deols wedding plans

Hema Malini reveals Esha Deol's wedding plans

టాలీవుడ్ లో బాలీవుడ్ లో పెళ్లి  గంటలు మొగుతున్నాయి . మొన్న టాలీవుడ్  మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్  వివాహం జరిగిన విషయం తెలిసిందే.  ఇప్పుడు అదే రీతిలో  బాలీవుడ్  లో ఒక హీరోయిన్ కూతురు పెళ్లి జరగబోతుంది. ఆమె ఎవరో కాదు హేమమాలిని కూతురు ఇషా డియాల్ పెళ్లి  త్వరలో జరగబోతుంది. ఇషాడియోల్ పెళ్లి దక్షణాది పద్దతిలో జరుగుతుందని  బాలీవుడ్ వాసులు అంటున్నారు.  ఇషాడియోల్ తండ్రి ధర్మేంద్ర  పంజాబీ కావటం , తల్లి  హేమమాలిని తమిళియన్ కావటంతో.. ఇషా పెళ్లి పై  బాలీవుడ్ లో రకరకాలుగా అనుకుంటున్నారు.  అంటే పంజాబీ పద్దతిలో చేస్తారా? లేక  సౌత్ ఇండియన్ పద్దతిలో చేస్తారా అనే ప్రశ్నలు  బాలీవుడ్ వర్గాలు మధ్య తిరుగుతున్నాయి .ఈ నెల 29న వ్యాపారవేత్త భరత్ తక్తానీతో ఆమె వివాహం జరగనుంది. భరత్ చాలా మంచి వ్యక్తి అని, అతని కుటుంబ సభ్యులు కూడా తనతో చాలా ప్రేమగా ఉంటారని ఇషా అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న భరత్, ఇషాల నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్‌లో భరత్ సోదరి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకల్లో ఇషా కూడా పాల్గొన్నారు.

ఆ సమయంలోనే భరత్ కుటుంబంతో క్లోజ్‌గా మూవ్ అయ్యే అవకాశం చిక్కిందని ఆమె తెలిపారు. ఇషా తండ్రి ధర్మేంద్ర పంజాబీ. తల్లి హేమమాలిని తమిళ్ అయ్యంగార్. కాబట్టి పెళ్లి ఏ పద్ధతిలో చేస్తారనే చర్చ బాలీవుడ్‌లో సాగింది. ఈ విషయం గురించి హేమమాలిని చెబుతూ -సౌత్ ఇండియన్ స్టయిల్‌లో పెళ్లి చేయనున్నాం. గుడిలో పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇషా కంచీవరం చీర కట్టుకుంటుంది. మేమందరం కూడా కంచీవరం చీరలనే ఎంపిక చేసుకున్నాం.గుడిలో పెళ్లి కాబట్టి దగ్గర బంధువులను, స్నేహితులను మాత్రమే ఆహ్వానించాం అన్నారు. ముంబయ్‌లోని ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీని గురించి హేమమాలిని చెబుతూ - ఆర్టిస్టులుగా, రాజకీయ నాయకులుగా మాకు రెండు జీవితాలు ఉన్నాయి. కాబట్టి సినీ, రాజకీయ రంగ ప్రముఖులను రిసెప్షన్‌కి ఆహ్వానించాం. అతిథులందరికీ అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Udaykiran wedding
Nitish kumar attacks modi puts bjp on notice  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more