టీడీపీలో కోలా కృష్ణమోహన్ కొత్త అలజడులు పుట్టిస్తున్నాడు. జగన్ అక్రమాస్తుల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు మీదకు శత్రుపార్టీలు ప్రయోగించిన కోలా కృష్ణమోహన్ ఉదంతం .. చంద్రబాబు ఇచ్చిన క్లారిటీతో సమసిపోయినట్లేనని కేడర్ భావిస్తోంది. ఉప ఎన్నికల ముందు సడన్ గా మళ్లీ తెరపైకి వచ్చిన కోలా కృష్ణమోహన్ తనకు చంద్రబాబుతో వున్న రిలేషన్ బయట పెట్టడం జరిగింది. ఈ విషయం తెలిసిన పార్టీ నాయకులు కాస్త గందర గోళంలో పడ్డారు. వైఎస్ఆర్ సీపీ కూడా పదేపదే ప్రచారం చేయటంతో.. చంద్రబాబు క్లారీటీ ఇవ్వటం జరిగిందని పార్టీ నాయకులు అంటున్నారు. కొద్ది రోజుల ముందు కోలా కృష్ణమోహన్ చెప్పినవన్నీ అబద్దాలేనని చంద్రబాబు తోసిపుచ్చారు. యూరో లాటరీ గెలుచుకున్న తర్వాత కోలా కృష్ణమోహన్ .. పార్టీ ఫండ్ కింద 10 లక్షల రూపాయలు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు నిర్థారించారు. అయితే లాటరీ మోసం తెలిసిన వెంటనే ఆ డబ్బు కోర్టులో డిపాజిట్ చేసినట్లు చంద్రబాబు చెబుతున్నారు. కోలా ఆరోపించినట్లుగా తనకు విదేశీ ఎకౌంట్లు లేవని బాబు అంటున్నారు.
అయితే సింగపూర్ లోని చంద్రబాబుకు బినామీ పేర్ల మీద వున్న బ్యాంక్ ఎకౌంట్లను ఇటీవలే కోలా వెల్లడించినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి . అయితే చంద్రబాబు పూర్తి ఆధారాలుంటే వాటిపై కోలో ఫిర్యాదు చేయవచ్చని చంద్రబాబు సవాల్ విసిరారు. కోలా కృష్ణమోహన్ ఏమైనా చేసి .. వాటిని తన మీదకు తోసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చంద్రబాబు అంటున్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు సాక్షి పేపర్ ప్రయత్నిస్తోందని చంద్రబాబు అంటున్నారు. నేరాల ఊబిలో చిక్కుకుపోయిన వైఎస్ఆర్ సీపీ నేతలు తనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని బాబు అంటున్నారు. ప్రజల్లో తనపై అనుమానాలు రేకెతి్తంచడమే సాక్షి పత్రిక లక్ష్యమని చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబు క్లారిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన టీడీపీకి కోలా గండం తప్పినట్లు కాదని తెలుగు దేశం పార్టీ నాయకులు కొంతమంది భావిస్తున్నారు. సాక్షి మీడియా మొదలు పెట్టిన ఈ రివర్స్ గేర్ ఉచ్చు ఇప్పట్లో తొలగేలా లేదని సామాన్య ప్రజలు అంటున్నారు. కోలా విసిరిన సవాళ్లకు చంద్రబాబు ఇచ్చిన జవాబులు సూటవుతయో లేదో అన్నది తేలాల్సివుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more