ఇప్పటిదాకా వీవీఎస్ లక్ష్మణ్ ఆడటమే చూశాం. ఇకమీదట వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ క్లబ్ ఆడనుంది. అయితే ఆ జట్టు ఆడేది హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్ సీఏ) లీగ్స్ లోనో.. ఆంధ్రా క్రికెట్ సంఘం ( ఏసీఏ) నిర్వహించే టోర్నీల్లోనో కాదు. క్రికెట్ కు పుట్టినిల్లైన ఇంగ్లాండ్ లో యార్క్ షైర్ లోని బ్రాడ్ ఫోర్డ్ లో ఆడనుంది. బ్రాడ్ ఫోర్డ్ మూచ్యువల్ సండే స్కూల్ క్రికెట్ లీగ్ (బీఎంఎస్ఎస్ సీ ఎల్) లో తలపడుతున్న జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ క్లబ్ అని నామకరణం చేశారట. బ్రాడ్ ఫోర్డ్ కు చెందిన వ్యాపారవేత్త 41 ఏళ్ళ మనీష్ పటేల్ తమ జట్టుకు లక్ష్మణ్ పేరు పెట్టాడు.
ఈ విషయంపై లక్ష్మణ్ ను మనీష్ సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే లక్ష్మణ్ కూడా ఒకే చెప్పటంతో చకచకా పనులు జరిగిపోయాని మనీష్ అంటున్నారు. బీఎంఎస్ఎస్ పీఎల్ కు యార్క్ షైర్ లో చాలా పేరుంది. 117 ఏళ్ళ చరిత్ర ఈ లీగ్ సొంతం. ఈ లీగ్ లోని జట్లు నాలుగు గ్రూపులుగా ఆడుతుండగా .. వీవీఎస్ లక్ష్మణ్ సీసీ గ్రూప్-బిలో ఉంది. వీవీఎస్ జట్టు.. సెమీఫైనల్ బెర్తుకు ఒక విజయం దూరంలో ఉంది. క్లబ్ కు నా పేరు పెట్టాలని అనుకుంటున్నట్లు చెప్పగానే కొంచెం వింతగా అనిపించింది. ఐతే చాలా ఆనందంగా గొప్పగా ఉందని లక్ష్మణ్ అంటున్నారు. అయితే వెంటనే సరే అని చెప్పటం జరిగిందని లక్ష్మణ్ చెబుతున్నాడు. 1995 , 1996 లో సీనియర్ బ్రాడ్ ఫోర్డ్ క్రికెట్ లీగ్ లో పుడ్ సీ కాంగ్స్ తరపును లక్ష్మన్ ఆడాడు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more