ఐదేళ్లలో లక్ష కోట్లు సంపాదించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టై జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పుడు జగన్ జైలు బ్యాంకు బ్యాలెన్ 2900 మాత్రం ఉందని జైలు అధికారులు చెబుతున్నారు. ఆస్తుల కేసులో అరెస్టై, రిమాండ్‌లో ఉండి, ప్రస్తుతం సీబీఐ కస్టడీలో విచారణ ఎదుర్కుంటున్న వైఎస్ జగన్ చంచల్ గుడా జైలులో సాదాసీదా జీవితం గడుపుతున్నారు. గత సంవ త్సరం తన ఆస్తుల విలువ రూ.356 కోట్లుగా ప్రకటించిన జగన్‌కు చంచల్ గుడా జైలులో ఖైదీలు దాచుకునే డబ్బు నిలువ ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రూ.2,900 మాత్రమే. రిమాండ్ ఖైదీ నంబర్ 6,093గా ఉన్న జగన్ అరెస్టు అయిన తర్వాత ఆయన సతీమణి వైఎస్ భారతి ఈ నెల ఒకటిన రూ.4,000 ఖర్చుల కోసం జైలులో డిపాజిట్ చేశారు. గత ఐదు రోజులుగా జగన్ ఈ మొత్తంలో రూ.1,100 ఖర్చు చేసినట్టు జైలు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువగా ఐస్‌క్రీంలు, బిస్కట్లు, కూల్ డ్రింకులు, పళ్ళు, మినరల్ వాటర్, సబ్బు, టూత్ పేస్టు వంటి వాటికే వెచ్చించారని జైలు అధికారులు తెలిపారు.
జైలు వర్గాలు అందించిన సమాచారం ప్రకారం జగన్ చాలా పరిమితమైన ఖర్చుకు అలవాటు పడ్డారు. ప్రత్యేక హోదా కలిగిన ఇతర ఖైదీలతో పోలిస్తే జగన్ చేస్తున్న ఖర్చు చాలా తక్కువ అని వారన్నారు. సాధారణ ఖైదీలైనా, అండర్ ట్రయల్స్యినా తమ అవసరాల కోసం ఖర్చు చేసుకునేందు కు జైలు అకౌంట్లు ఉంటాయి. ప్రత్యేక అయితే వారెవరికీ నాణాలు కానీ, నోట్లు కానీ అందుబాటులో ఉంచరు. ఐదు, పది, 20 రూపాయల టోకన్లు ఇస్తారు. జైలు క్యాంటీన్లో ఖైదీలు, ట్రయల్స్ వాటిని ఉపయోగించి తమకు కావలసిన వాటిని కొనుగోలు చేసుకోవచ్చు. జైలులో ఉన్న ఖైదీలు సిగరెట్ ప్యాకెట్లు, పొగాకు, బిస్కట్లు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీంలు కొనుగోలు చేసుకోవచ్చు. సాయంత్రం వేళల్లో ఆలూ బజ్జీ, మిర్చి పకోడా లాంటివి సైతం లభిస్తాయి.
నిమ్మగడ్డ...రూ.3,060: జైలు వర్గాలు అందించిన సమాచారం ప్రకారం జైలులోనే ఉన్న వాన్‌పిక్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ అకౌంట్లో రూ.3,060 ఉన్నాయి.ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య అకౌంట్లో రూ.1,200 ఉన్నాయి. మ రో పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ అకౌంట్లో రూ.2,500 ఉన్నాయి. మరో వ్యాపార వేత్త బి.శ్రీనివాసరెడ్డి అకౌంట్లో రూ.3,000 ఉండగా అధికారి వీడీ రాజగోపాల్ అకౌంట్లో రూ.2,009 ఉన్నాయి.వాన్‌పిక్ కుంభకోణంలోనే అరెస్టయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అకౌంట్లో రూ.1,100 ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more