జగన్ కు కేంద్రంలో .. ఒక ఆయుధం లాంటి వ్యక్తి ఉన్నాడని గతంలో కొంత మంది రాజకీయ నాయకులు అంటున్నారు. కేంద్ర మంత్రి వీరప్పన్ మొయిలీ కొడుకు హాస్తం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా మొయిలీ జగన్ పై ఎలాంటి విమర్శలు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లు కేంద్ర నాయకులు అంటున్నారు. అందువలన అధిష్టానం వీరప్పను దూరంగా పెడుతున్నట్లు రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. గాలిజనార్ధన్ రెడ్డికి బెయిల్ రావడానికి పదిరోజుల ముందు నుంచి బెయిల్ వచ్చాకా నాలుగు రోజులు అంటే మే 16వ తేదీ వరకూ సదరు కేంద్రమంత్రి కుమారుడి నుంచి పట్టాభికి ప్రతీరోజూ నాలుగైదు పర్యాయాలు ఫోన్‌లు రావడంపై సీబీఐ దృష్టిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న బెయిల్ కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతోంది.
ఈ వ్యవహారంలో గతంలో వైయస్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కు అత్యంత సన్నిహితుడుగా మెలిగిన కేంద్రమంత్రి కుమారుడి ప్రమేయం కూడా ఉందని సీబీఐ అనుమానిస్తోంది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాకా సీబీఐ కోర్టు రెండవ అదనపు న్యాయమూర్తి పట్టాభిరామారావు వ్యక్తిగత సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్ లిస్ట్ సేకరించిన సీబీఐకి అందులో కేంద్రమంత్రి కుమారుడి ఫోన్ కాల్స్ గుర్తించింది. అంతేకాకుండా సదరు మంత్రి కుమారుడి ఫోన్ నుంచి హైదరాబాద్‌లోని మరో వ్యక్తికి, ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన మాజీ న్యాయమూర్తి చలపతిరావుకు కూడా ఫోన్‌లు వెళ్ళడంతో ఈ వ్యవహారంలో అతడిపాత్రకూడా ఉండిఉండవచ్చుఅని సీబీఐ అనుమానిస్తోంది.
కాగా ఈ కేసులో సీబీఐ అందజేసిన ప్రాధమిక నివేదికను హైకోర్టు విజిలెన్స్ విభాగం రిజిస్ట్రార్ పరిశీలిస్తున్నారు. నివేదికలోని అంశాలు, సీబీఐ అందజేసిన ప్రాధమిక సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదిక సమర్పిస్తారు. అనంతరం కోర్టు ఆదేశాలమేరకు తదుపరి చర్యలు ఉంటాయి. కాగా ఈ కేసులో గతంలో గాలిజనార్ధన్ రెడ్డికి చెందిన సంస్థలో పిఆర్‌ఓగా పనిచే సిన ఒక జర్నలిస్ట్ ప్రమేయంపై కూడా సీబీఐ ఆరాతీస్తోంది. కాగా ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే బాధ్యతను అవినీతి నిరోధక శాఖకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే హైకోర్టు ఉద్యోగులు, న్యాయమూర్తులను సీబీఐ నేరుగా విచారించే అవకాశం లేదు. అందుకోసం అటు ప్రభుత్వం అయినా లేఖరాయాలి, లేదా హైకోర్టు అయినా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలి. అలా కాని పక్షంలో ఈ కేసును రాష్ట్రానికి చెందిన అవినీతి నిరోధఖ శాఖతో దర్యాప్తు చేయించాల్సి ఉంటుంది. అయితే ఇందులో నిందితుడుగా ఉన్న పట్టాభిరామారావు గతంలో ఏసీబీ కోర్టుల న్యాయమూర్తిగా పనిచేసినందున ఆ విషయంపై హైకోర్టు అధికారులు కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలిసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టునుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more