Jagan spent rs 1 cr on lawyers just for one day

Jagan Spent Rs 1 Cr On Lawyers Just For One Day, YS Jagan Casu, YS Jagan, Lawyers fees,

Jagan Spent Rs 1 Cr On Lawyers Just For One Day

Lawyers.gif

Posted: 05/30/2012 06:22 PM IST
Jagan spent rs 1 cr on lawyers just for one day

Jagan Spent Rs 1 Cr On Lawyers Just For One Day

మాములు ప్రజలు అయితే అంత డబ్బు లాయర్లు ఖర్చు పెట్టారని కొంత మంది పొలిటికల్ నాయకులు అంటున్నారు. సొంత కష్టపడి సంపాదించిన డబ్బును ఎవరైనా ఇలా ఖర్చు పెడతారా? అది అవినీతి సొమ్ము కాబట్టే.. జగన్ లక్ష కోట్లు నుండి అవలీలగా రోజుకు 3 కోట్లు రూపాయలు తీసి లాయర్లుకు ఇవ్వటం మాములు ప్రజలు ,ఎవరు చేయారని సాధరణ ప్రజలు అనుకుంటున్నారు. కేవలం ఒక్క రోజుకే కోటి రూపాయల ఫీజ్ అంటే జగన్ ఏ రేంజ్ లో ఉన్నాడో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

రాం జెఠ్మలానీ, రాకేశ్ ద్వివే దీ, ముకుల్ రోహత్గీ, ఎం.ఎల్. వర్మ, సుశీల్ కుమార్... ఉద్ధండ పిండాలు! నోటి మాటతో కోర్టు హాలును గడగడలాడించే 'నల్ల కోటు యోధులు'! సుప్రీం కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో కీలకమైన కేసులు వాధించే వారిని... ఇప్పుడు వైఎస్ జగన్ నాంపల్లికి రప్పించారు. లక్షల్లో ఫీజులు, ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస... వీళ్లు చాలా కాస్ట్‌లీ గురూ!

'రాజుల సొమ్ము రాళ్లపాలు'.. అని ఓ నానుడి. ఇప్పుడు జగన్ సొమ్ము మాత్రం లాయర్లపాలు అవుతోంది. జగన్ నియమించుకుంటున్న లాయర్లు అంత కాస్ట్‌లీ మరి! దేశంలోనే పేరుమోసిన క్రిమినల్ లాయర్ రాంజెఠ్మలానీ జగన్ కేసుల్లో ఇప్పటికి చాలాసార్లు వాదించారు. ఆయనకు ఒకరోజు ఫీజు అక్షరాలా కోటి రూపాయలని న్యాయవాద వర్గాలు చెబుతాయి. జెఠ్మలానీ ఢిల్లీలో కాకుండా మరోచోట కేసు వాదిస్తే... ఫీజు రెట్టింపు అవుతుందని కూడా చెబుతారు. ముకుల్ రోహత్గీ తక్కువ వారేమీ కాదు. ఆయన అనిల్ అంబానీ కుటుంబానికి బాగా సన్నిహితుడైన న్యాయవాది. ఇటీవలి వరకూ ఆయన కేసుకు మూడు లక్షల రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేసేవారు. ఇప్పుడు ఆయన రేటు కూడా బాగా పెరిగింది. కేవలం సలహా ఇవ్వడానికే లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు.

1970 దశకంలో ముంబైలో పేరుమోసిన స్మగ్లర్ హాజీ మస్తాన్ తరఫున వాదించి 'మంచి' పేరు తెచ్చుకున్నారు. ఆయన ఎక్కువగా టెర్రరిస్టులు, స్మగ్లర్లు, డెకాయిట్‌ల తరఫునే ఎక్కువగా వాదించారు. ఇందిరాగాంధీ,రాజీవ్‌గాంధీ హంతకుల లాయర్ కూడా ఆయనే. జయలలిత తరఫున కూడా వాదించారు. 'జెఠ్మలానీని నియమించుకోవడానికి కూడా ఒక స్థాయి ఉండాలి' అని సుప్రీంకోర్టు లాయర్లు చాలామంది చెబుతుంటారు. జెఠ్మలానీతో సమానంగా ఫీజు తీసుకునే మరో సీనియర్ లాయర్ హరీష్‌సాల్వే. ఆయనను జగన్ ఎంగేజ్ చేసుకోలేదు. ఎందుకంటే సాల్వే రిలయన్స్ తరఫున వాదిస్తున్నారు. జగన్ తరఫున వకాల్తా పుచ్చుకున్న మరో సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి. ఆయన ఎన్‌డీఏ హయాంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా పని చేశారు. ఆయన ఒక్కో సిట్టింగ్‌కు రూ.30లక్షల వరకూ వసూలు చేస్తారు. హైదరాబాద్‌కు వచ్చి వాదించారంటే ఈ రేటు డబుల్ అవుతుంది.

జగన్ కేసుల్లో తరచూ వాదిస్తున్న మరో సీనియర్ లాయర్ సుశీల్ కుమార్. ఆయన రోజుకు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ వసూలు చేస్తారు. ఇటీవల కాలంలో ఆయన ఢిలీల్లో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారని... మకాం అక్కడికే మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని సుప్రీం కోర్టు లాయర్లు గుసగుసలాడుకుంటున్నారు. జెఠ్మలానీ, రోహత్గీ, సుశీల్‌కుమార్, అమన్ లేఖి తదితరులను ఒక్కరోజు ఎంగేజ్ చేస్తే... జగన్ మూడు నాలుగు కోట్లు ఫీజు కింద చెల్లించాల్సిందే! కార్పొరేట్ సంస్థలు తమ కంపెనీ తరఫున ఒక లాయర్‌ను నియమించుకుని... జీతం చెల్లిస్తుంటాయి. జగన్ తన లాయర్లకు కార్పొరేట్ సంస్థలను మించి డబ్బులు ఇస్తున్నట్లు సుప్రీం లాయర్లు చెబుతున్నారు. ఇటీవల వోడాపోన్ కేసులో లాయర్లకు అత్యధిక స్థాయి ఫీజు అందినట్లు తెలుస్తోంది.

జగన్‌పై వచ్చిన అక్రమార్జన కేసులు మొదలుకొని, బెయిల్ పిటిషన్లపై వాదించడం, సలహాలివ్వడం, సూచనలివ్వడం... ఈ న్యాయశాస్త్ర ప్రవీణులు చేయాల్సిన పని. ఈ ఉద్ధండులు తమ మేధనంతా ఉపయోగించి, వాదించి, సహాయ సహకారాలు అందజేసి, జగన్ అండ్ కోను గట్టెక్కించాల్సి ఉంటుంది. ఈ న్యాయశాస్త్ర ప్రవీణులు న్యాయశాస్త్రాన్నే ఔపోసన పట్టినవారు. ఈ న్యాయవాదులు ఒక గంట సేపు వాదించినందుకే లక్షల్లో ఫీజులు చేస్తుంటారన్నది జగమెరిగిన సత్యం. ఈ హేమా హేమీ న్యాయవాదుల్ని ప్రత్యేకంగా, విమానాల్లో పిలిపించారు. చివరికి వీళ్ల వాదనలు నెగ్గినా నెగ్గకపోయినా వీరి పారితోషికాలను మాత్రం తప్పనిసరిగా చెల్లించాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu sirishs gauravam on floors from june 18
Mamata banerjee makes ipl champions dance to her tunes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more