Jagans mother vijayamma to hit bypoll campaign trail today

Jagan's mother, Vijayamma to hit bypoll campaign trail today,YS Jagan, YS Vijayamma,Sharmila, congress party, By Election camp, Sonia Gandhi, Rahul Gandhi, Rajiv Gandhi, Sanjay Gandhi, Nehru, Priyanka Gandhi, YS Rajasekara reddy,

Jagan's mother, Vijayamma to hit bypoll campaign trail today

Vijayamma.gif

Posted: 06/01/2012 06:53 PM IST
Jagans mother vijayamma to hit bypoll campaign trail today

Jagan's mother, Vijayamma to hit bypoll campaign trail today

అవునంటున్నారు రాష్ట్ర పార్టీల పొలిటికల్ నాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెఢ్డిని సిబిఐ అరెస్ట్ చేసి.. చంచల్ గూడ జైల్లో ఉంచిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. అయితే అన్నీ పార్టీల నాయకులు .. వైఎస్ విజయమ్మ చేస్తున్న ఉప ఎన్నికల ప్రచారం పై ద్రుష్టి సారించారట. కన్న కొడుకు జైల్లో ఉంటే.. విజయమ్మ మాత్రం ఉప ఎన్నికల ప్రచారం కోసం నడుం బింగించటం చాలా ఆశ్చర్యంగా ఉందని రాజకీయ పార్టీల నాయకులు అంటున్నారు .

ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మకు విశాఖ ఎయిర్‌పోర్టులో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో విమానాశ్రయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పార్టీ జెండాలు చేతబట్టి విజయమ్మను ఆహ్వానించారు. పార్టీ కార్యకర్తలు , వైఎస్ ఆర్ నాయకులు విజయమ్మను (ఇందిరమ్మ) అమ్మ, అమ్మ అంటు నినాదాలు చేయటం , అమ్మకు జే జేలు కొడుతూ ఆహ్వానించారు. అయితే విజయమ్మ .. నవ్వుతూ.. వారి అభివాదం చేస్తే.. , అలాగే వైఎస్ షర్మిలా కూడా .. చేతులు గాలిలో ఊపుతూ.. చిరునవ్వుతో.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మాలవేసి అక్కడ నుండి కడప నుండి వచ్చిన ప్రత్యేకమైన బస్సు లో కూర్చోని.. ప్రజలకు విజయ్మ.. ఇందిరాగాంధీ మాదిరి ఫోజు ఇచ్చి ..ప్రజలకు చేతులు ఊపుత విజయమ్మ ఉప ఎన్నికల ప్రచారాన్ని సాగించటం జరుగుతుందని మీడియా వారు అంటున్నారు.

విశాఖ వాసులు మాత్రం విజయమ్మ చేస్తున్న యాత్రలో .. గతంలో .. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ చేసినట్లుగా మొత్తం సోనియా కుటుంబాన్ని   వైఎస్ కుటుంబం ఫాలో అవుతుందని విశాఖ ప్రజలు అనుకుంటున్నారు. కడప నుండి 1000 మంది కార్యకర్తలు రావటం, స్థానికులకు ఒక్క మనిషి 500, నుండి 1000 రూపాయాలు, బిర్యాని, చెల్లించి విజయమ్మ ప్రచారానికి కార్యకర్తలను తీసుకొచ్చినట్లుగా, స్థానికులు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా ..అక్కడున్న స్థానికుల కంటే .. బయట నుండి వచ్చిన వారే ఎక్కువగా కనబడతున్నారని మీడియా వారు గుసగుసలాడుకంటున్నారు.

కొంత మంది స్థానికులైతే.. ‘‘అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట’’ అనే విధంగా విజయమ్మ ప్రచారం సాగుతుందని స్థానికులు అంటున్నారట. అలా ఎందుకు అంటున్నారంటే.. విజయమ్మ ఉప ఎన్నికల గురించి మాట్లాడుతుంటే.. వెనక నుండి వాసి రెడ్డి పద్మ స్ర్కిప్ట్ ను అందించటం జరుగుతుందని అది చూసి స్థానిక ప్రజలు పైవిధంగా అనుకోని నవ్వుకుంటున్నారని                అక్కుడున్న మీడియా వారు గుసగుసలాడుకుంటున్నారట. కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

ఇది మొత్తం జగన్ వేసిన ఒక పథకం లాగ ఉందని, అందుకే కొడుకు జైల్లో ఉన్న విజయమ్మ ఉప ఎన్నికల్లో నవ్వుతూ ప్రచారం చేయటం అవినీతి కోడుకు పదవి కోసం ఒక తల్లి ఇలా చేయటం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు . ఏమైన ‘‘అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది’’ అనే సామెతను విజయమ్మ మరొసారి గుర్తుకు తెస్తున్నారని స్థానిక ప్రజలు అంటున్నారు.

Jagan's mother, Vijayamma to hit bypoll campaign trail today

జగన్ తన తల్లి విజయమ్మను ఇంధిరా గాంధీ లా చూడలనే కోరికతో .. ఇవన్నీ చేస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు . అసలు ఇందిరా గాంధీ కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి .. నాగ లోకానికి .. నక్కలోనికి ఉన్న వ్యత్యాసం ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు . ఇందిరా గాంధీ కుటుంబం ..ఒక రాజకీయ కుటుంబం. ఐదు తరాల రాజకీయ చరిత్ర ఉన్నకుటుంబం. వారు పదవుల కోసం ఏ రోజు ఆశపడలేదట, ప్రజా సేవా ముఖ్యంగా భావించిన కుటుంబమాని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు .

అసలు వైఎస్ కుటుంబం గురించి ‘‘అన్నీ తెలిసినవాడూలేడు, ఏమీ తెలియనివాడూలేడు’’ అనే నిజం ప్రజలకు తెలియాదా? ప్రజల కోసం తుపాకి బుల్లెట్లకు ప్రాణాలార్పించిన కుంటుంబం ఇందిరా గాంధీది. ప్రాణాలు తీసే కుటుంబం వైఎస్ కుటుంబం? అసలు రాజకీయాలు ఇష్టం లేకపోయిన తప్పని పరిస్థితిలో .. ప్రజల కోసం, దేశం కోసం రాజకీయల్లోకి వచ్చిన కుటుంబ. వైఎస్ జగన్ పదవి కోసం .. డబ్బు కోసం , రాజకీయాలను వాడుకుంటున్నా కుటుంబం. నెహ్రూ తరువాత .. ఇందిరా గాంధీ రాజకీయల్లో రావటం జరిగింది. ఆ తరువాత తన పెద్ద కొడుకు సంజయ్ గాందీ మరణించటంతో.. రాజకీయాలు ఇష్టం లేకపోయిన అమ్మ కోరిక మేరకు రాజీవ్ గాంధీ రాజకీయల్లోకి రావాటం జరిగిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు .

అదే వైఎస్ కుటుంబం ..పదవి కోసం పాద యాత్రలు చేసి.. ప్రజలను సెంటిమెంట్ తో నమ్మించి పదవి దక్కించుకొని అవినీతి కుటుంబంగా చరిత్రకెక్కిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇందిరా సిక్కుల తుపాకి బుల్లెట్ కు బలితే.. అప్పుడు రాజీవ్ గాంధీ దేశ రక్షణ కోసం,దేశ ప్రజల కోరిక మేరకు ఇష్టం లేకపోయిన రాజకీయాల్లోకి రావటం జరిగిందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. వైఎస్ కుటుంబం .. పేదప్రజల భూములు లాక్కోని .. లక్ష కోట్లు సంపాదించిన ఘనత వైఎస్ ఫ్యామిలీదేనని కాంగ్రెస్ నాయకులుఅంటున్నారు .

రాజీవ్ గాంధీని బాంబు బ్లాస్ట్ లో చనిపోయినప్పుడు .. రాజకీయ పదవుల కోసం సోనియా కుటుంబం .. ఆశించలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. సోనియా గాంధీ 5 సంవత్సరాల వరకు రాజకీయల వైపు కన్నెత్తి చూడకుండా దూరంగా ఉండటం జరిగిందట. తరువాత దేశం సమైక్యాం ఉండాలని, దేశ రక్షణ కోసం, పార్టీ సీనియర్ నాయకుల కోరికల మేరకు సోనియా రాజకీయ ప్రవేశం చేయటం జరిగిందట. సోనియా గాంధీ కి ప్రధాని పదవి తీసుకోమని చెప్పిన ఇప్పటికి ఆమె ఆ పదవి వైపు చూడకుండా .. ఒక పార్లమెంట్ మెంబర్ గా ఉండి, పార్టీ కి నాయకత్వం వహిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

అదే వైఎస్ జగన్ .. తండ్రి ప్రక్రుతి మరణం చెందితే.. ఆమరణాన్ని జగన్ తన కుఠిల రాజకీయానికి వాడుకోవటం చాలా దారుణమని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. తండ్రి శవం ఇంట్లో పెట్టుకొని .. సీఎం పదవి కోసం .. మంతనాలు జరిపిన చరిత్ర జగన్ కే దక్కిందని బిజేపి పార్టీ నాయకులు అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం .. కాంగ్రెస్ ను బయటికి వచ్చి సొంత కుంపటి పెట్టుకొని .. సోనియా గాందీ కుటుంబంతో పోటీపడాలని జగన్ .. బెంగుళూర్ .. 37 ఎకరాల స్థలంలో.. ఇళ్ళు కట్టుకోవటం, అలాగే.. హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ కట్టుకోవటం .. ఇవన్నీ జగన్ విజయమ్మను ఇందిరా గాంధీలాగా చేయాలనే ప్లాన్ తో చేసినట్లు సీనియర్ విశ్లేషకులు చెబుతున్నారు.

అసలు జగన్ పదవి కోసం ఇన్ని చేస్తుంటే.. రాహుల గాంధీ మాత్రం తనకు ప్రధాని పదవికి అవకాశం ఉన్నప్పటికి .. పదవి కంటే ముందు ప్రజ సేవా ముఖ్యమని భావించిన వ్యక్తి రాహుల్ గాంధీ. ఏ రోజు కూడా సోనియాగాంధీ కులం, మతం , అనే పదాలు ఎక్కడా వాడలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. జగన్ మతం, కులం పేరులతో ప్రజలను మభ్యపెట్టి రాజకీయ చేస్తున్నాడని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. జగన్ బ్రహ్మణుడైన బావను అనిల్ బ్రదర్ మార్చిన ఘనత జగన్ కే దక్కుతుందని బిజేపి నాయకులు అంటున్నారు. షర్మిలా ..ప్రియాంక గాంధీ లా ఉండాలని జగన్ కోరికట. అసలు ప్రియాంకకు షర్మిలా ఎలా సంబంధ కుదురుతుందని కాంగ్రెస్ వారు అంటున్నారు . ప్రియాంక పద్దతిగా పెళ్లి చేసుకొని భర్తతో కాపురం చేస్తుందని ఢిల్లీ నాయకులు అంటున్నారు. ఆమె ఎప్పుడు పదవుల కోసం బయటికి రాలేదని అంటున్నారు. షర్మిలా.. మాత్రం పెళ్లైన అనిల్ ను పెళ్లాడిన సంగతి ప్రజలకు తెలుసునని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

జగన్ సోనియా కుటుంబం కంటే.. మేము గొప్ప అనిపించుకోవాలనే ప్లాన్ లో ఉన్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అంతేకాకుండా.. జగన్ లక్ష్యం .. ప్రపంచ ధనవంతుల్లో ఒకడు కావాలని కోరిక జగన్ బాగా ఉందని అన్నీ పార్టీల నాయకులు చెబుతున్నారు . జగన్ ఆశయం 20లక్షల కోట్లు సంపాదించటం కోసమే.. పదవి కోరుకుంటున్నాడని ..కాంగ్రెస్ నాయకులు అంటున్నారు .

ఇప్పుడు విజయమ్మ జగన్ ఇచ్చిన ట్రైనింగ్ తో ప్రచారం చేస్తుందట. తన కొడుకు జగన్ కోసం ఆమె రోడ్డుకెక్కిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయిన ‘‘ ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే, మీసాలన్నీ తెగకాలినవట’’ అనే విధంగా.. జగన్ కోసం విజయమ్మ రోడ్డునపడటం చూసి ప్రజలు .నవ్వుకుంటున్నారు. విజయమ్మకూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించటం కోసం ‘‘నిండా మునిగిన వానికి చలేంటి’’ అనే విధంగా ఆమె కొత్త ఆశలు పుట్టినట్లు ఉన్నాయాని బీజేపి నాయకులు అంటున్నారు.

విజయమ్మ ఉప ఎన్నికల ప్రచారం పై రాష్ట్ర కమ్యునిష్టులు ఆశ్చర్యంతో వ్యక్తం చేస్తున్నారట అయిన తల్లి కొడుకులు అవినీతి సొమ్ము కోసం ( పదవి) ‘‘నడమంత్రపు సిరి నరము మీద పుండులాంటిది’’అనే విధంగా ఇలా రోడ్డుకెక్కి అమాయక ప్రజలను మభ్యపెతున్నారని కమ్యునిష్టు నాయకులు అంటున్నారు. విజయమ్మ రాజకీయల్లోకి వచ్చిన కొన్ని సంవత్సరాలైనా కాకుండానే.. సోనియా గాంధీ పై విమర్శలు చేయటం ‘‘నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు ఇంత పెద్ద గాలివాన తన జీవితంలో చూడలేదన్నదట’’ గా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

అయిన జగన్ మనస్సులో ఏం అనుకుంటున్నాడో.. ఆ ‘‘లోగుట్టు పెరుమాళ్ళ కెరుక’’ అని రాష్ట్ర రాజకీయ అగ్రనాయకులు అంటున్నారు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I suspect congress in ysrs death ys vijayamma
Cbi judge pattabi ram suspended by hc  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more