అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పావులు కదుపుతున్నారు. యూపీఏకు సవాల్‌గా నిలుస్తోన్న ఆమె.. కాంగ్రేసేతర పార్టీలను సమీకరించే పనిలో మునిగిపోయారు. లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మాను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్న జయ.. ఇందుకు మద్దతు కూడగట్టేందుకు ఎన్డీఏ, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కొత్త రాష్టప్రతి ఎన్నికపై యుపిఏ భాగస్వామ్య పక్షాలతోపాటు ప్రధాన ప్రతిపక్షమైన బిజెపి కూటమి కూడా మల్లగుల్లాలు పడుతుంటే, అన్నాడిఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాత్రం లోక్‌సభ మాజీ స్పీకర్ పిఎ సంగ్మా అభ్యర్థిత్వానికి మద్దతు కూడకట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన సంగ్మాకు రాష్టప్రతి కావటానికి అన్ని అర్హతలు ఉన్నందున తమ పార్టీతోపాటు బిజూ జనతాదళ్ మద్దతు ఉన్నట్టు జయలలిత ఇప్పటికే ప్రకటించారు.
ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కలిసి ఆమె సంగ్మా అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. పార్లమెంట్ సమావేశాలు ముగుస్తున్నందున ఆమె భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుడు, ఎన్డీయే అధ్యక్షుడు ఎల్‌కె అద్వానీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి బర్దన్, సమాజ్‌వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడి సంగ్మా అభ్యర్థిత్వాన్ని బలపర్చాల్సిందిగా కోరారు. రాష్టప్రతి ఎన్నిక విషయమై కాంగ్రెస్ యుపిఏ ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈనెల 24, 25 తేదీల్లో ముంబయిలో జరగనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో బిజెపి నాయకత్వం రాష్టప్రతి ఎన్నికపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
గత ఎన్నికలలో భైరాన్‌సింగ్ షెకావత్‌ను రంగంలోకి దించిన విధంగా, ఈసారీ తమ అభ్యర్థిని పోటీకి దించాలని బిజెపిలోని ఒక వర్గం అభిప్రాయ పడుతోంది. అయితే రెండోసారి కూడా ఓడిపొతే రాజకీయంగా ఎదురయ్యే నష్టం లేకపోయినా కూటమి బలహీనత బయట పడుతుందని మరోవర్గం వాదిస్తోంది. ఒకవేళ పోటీకి దిగాలని నిర్ణయించుకుంటే అన్నివిధాలా అర్హుడైన అభ్యర్థి ఎవరు? అన్న విషయమై తర్జన భర్జన పడుతున్నారు. ఇలావుంటే, రాష్టప్రతి ఎన్నికపై జయలలిత విపరీతమైన ఆసక్తి చూపించటం అత్యంత చర్చనీయాంశంగా మారుతోంది. 2014 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువగా ఉండి ప్రభుత్వం ఏర్పాటులో తమదే పైచేయి అవుతుందన్న నమ్మకంతో ఉన్న జయలలిత, వివిధ పార్టీలతో ఒక కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ లక్ష్య సాధనలో భాగంగానే రాష్టప్రతి ఎన్నికను ఆమె ఒక వేదికగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఈ దిశగా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టి రెండోసారి కూడా ఓడిపోవటం జరిగింది.
కేంద్ర వ్యవసాయ మంత్రి పవార్ నాయకత్వం వహిస్తున్న ఎన్‌సిపిలో సంగ్మా ఉన్నారు. రాష్టప్రతి పదవికి జరిగే ఎన్నికలలో తమ పార్టీ యుపిఏకే మద్దతు అందిస్తుందని పవార్ ఇంతకుముందే స్పష్టం చేశారు. దీంతో సంగ్మాకు ఎన్‌సిపి మద్దతు లభించే అవకాశాలులేవు. కాగా, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పావులు కదుపుతున్నారు. రాజ్యసభ సభ్యుడైన తన సోదరుడు ప్రొఫెసర్ రామ్‌గోపాల్ యాదవ్‌కు డిప్యూటీ చైర్మన్ పదవిని ఇస్తే ఆయన యుపిఏ అభ్యర్థినే బలపరుస్తారు. దీనితోపాటు రాష్ట్రానికి నిధులను రాబట్టుకోవటానికి ఆయన పాలకపక్షం వైపే మొగ్గు చూపటం ఖాయంగా కనిపిస్తున్నది. పంజాబ్ ముఖ్యమంత్రి బాదల్ ఎన్డీయేలో ఉన్నందున ఆయన ఆ కూటమి నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. రాష్టప్రతి ఎన్నికలో విజయం సాధించే అవకాశాలు యుపిఏకే అధికంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఒక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయటానికి రాష్టప్రతి ఎన్నికతో జయలలిత ఓ ప్రయోగం చేసే అవకాశాలు ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more