Rekha jaya bachchan maintain distance in rs

Rekha, Jaya Bachchan maintain distance in RS,Jaya Bachchan, Rekha, Rajya Sabha, Bollywood

Rekha, Jaya Bachchan maintain distance in RS

Rekha.gif

Posted: 05/19/2012 01:13 PM IST
Rekha jaya bachchan maintain distance in rs

Rekha, Jaya Bachchan maintain distance in RS

ఆడవాళ్ల మధ్య స్నేహం, వైరం ఎక్కువ కాలం కొనసాగదంటారు. కానీ ఓ ఇద్దరి మధ్య ఏర్పడిన అగాధం మాత్రం ముప్పై ఏళ్లుగా అలాగే ఉంది. వాళ్లెవరో సామాన్యులు కాదు. బాలీవుడ్‌ నిన్నటితరానికి చెందిన అగ్రహీరోయిన్లు.. జయాబచ్చన్‌, రేఖ. 1970 చివర్లో వీరిద్దరి మధ్య మొదలైన విబేధాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఫలితంగా వీరిద్దరూ ఇప్పటి వరకు పెద్దగా ఎదురపడ లేదు.. పొరపాటున పడ్డా… ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు.బాలీవుడ్‌ అందాలనటి రేఖ.. రాజ్యసభ ప్రవేశం అనేక ఆసక్తికర అంశాలకు వేదికవుతోంది. సినీ ఇండస్ట్రీలో బద్ధ విరోధులుగా చెప్పుకునే జయా బచ్చన్‌.. రేఖ.. ఒకే సారి రాజ్యసభలో కనిపించడం అందరినీ ఆకట్టుకున్నా.. తనను పదే పదే టీవీలో చూపించడంపై జయ మండిపడ్డారు. ఇంతకీ రేఖ రాజ్యసభలోకొస్తే జయకు ఏం ఇబ్బంది.. ? కొత్తగా సభలో అడుగుపెట్టిన సహచర ఎంపీని.. ఒక సీనియర్‌గా ఆమె పలకరిస్తే ఏమయ్యేది.. ? ఇవే ఇప్పుడు అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్నలు..

Rekha, Jaya Bachchan maintain distance in RS

1981 లో వచ్చిన సూపర్‌ హిట్‌ సినిమా సిల్‌సిలాలో కలిసి నటించిన ఈ హీరోయిన్ల మధ్య.. అమితాబ్‌ విషయంలో పొరపొచ్చాలు వచ్చాయని ప్రచారం. అమితాబ్‌, రేఖ మధ్య నడిచిన ప్రేమాయణం.. మిస్సెస్‌ బచ్చన్‌ అగ్రహానికి కారణమని చెప్పవచ్చు. ఆ తర్వాత అంతా సద్దుమణిగినా.. వీరిద్దరి మధ్య ఏర్పడిన అగాధం మాత్రం అలాగే ఉండిపోయింది. తాజాగా రేఖ రాజ్యసభ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు కూడా.. జయ ముభావంగానే కనిపించారు. ముక్కు నలుపుకుంటూ చిరాగ్గా కనిపించారు. చివరికి.. రేఖ సీటు తనకు దగ్గర్లో ఉంటుందని తెలిసి.. తన స్థానం కూడా మార్పించుకున్నారంటే.. వీరిద్దరి మధ్య ఎలాంటి వాతావరణం ఉందో అర్థం చేసుకోవచ్చు.రేఖ సభలోకి రావడం జయకు గిట్టలేదో ఏమో.. ఆమెపై ఉన్న అక్కసును రాజ్యసభ టీవీ వారిపై తీశారు. రేఖ ప్రమాణస్వీకారం చేస్తుంటే పదే పదే తనను ఎందుకు చూపించడమంటూ మండిపడ్డారు. దీనిపై ఆమె ఛైర్మన్‌ కు ఫిర్యాదు చేశారని వార్తలు వచ్చినా.. అవేమీ లేదంటూ రాజ్యసభ సెక్రటేరియట్‌ కొట్టిపారేసింది. మొత్తం మీద… జయ పాత విషయాలను ఇంకా మర్చిపోలేదనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే ఓ సహచర ఎంపీ కొత్తగా సభలోకి వస్తే కనీసం పలకరించవచ్చు కదా అనే వాళ్లూ లేకపోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh new dialogue
Kirti azad demands ipl shut shop  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more